36.2 C
Hyderabad
Wednesday, April 22, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 145

యేసుక్రీస్తు అందరి వాడు..బాజిరెడ్డి గోవర్ధన్

యేసుక్రీస్తు అందరి వాడు..బాజిరెడ్డి గోవర్ధన్

నిజామాబాద్ 25 డిసెంబర్ 22

శాంతి, కరుణ, ప్రేమ, సేవ అన్న క్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయం.

*తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్రిస్టియన్ మైనారిటీల అధిక ప్రాధాన్యత.

*యేసు క్రీస్తు పుట్టిన రోజు ప్రపంచమంతా అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు.

నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు, టీఎస్ ఆర్ టి సి చెర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మతాలకు దేవుడు ఒక్కడే అన్న ఏసుక్రీస్తు ప్రభోదం మేరకు ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్ని మతాలను సమానతో, పండగలను అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. క్రిస్టియన్ మైనారిటీల ఆత్మగౌరవం పెంపొందించేలా 2 ఎకరాల స్థలంలో 10 కోట్లతో క్రిస్టియన్ భవనం నిర్మించడానికి శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా చర్చిల నిర్మాణానికి, మరమ్మత్తులకు, ఆధునీకరణకు, మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వ నిధులు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. తెలంగాణ లో అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో మైనారిటీ లకు అడ్మిషన్లు ఇస్తున్నారని, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ 20 లక్షల రూపాయలు ఇసున్న ప్రభుత్వం మనదేనని బాజిరెడ్డి గోవర్ధన్
అన్నారు.

క్రిస్మస్ పండగ సంతోషం నింపుతుంది.. ఎమ్మెల్యే చల్లా

క్రిస్మస్ పండగ సంతోషం నింపుతుంది.. ఎమ్మెల్యే చల్లా

పరకాల 25 డిసంబర్ 22

పేదలకు సహయం చేయడమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని, పేదలు బీఆర్ఎస్ ప్రభుత్వనికి ఆత్మబంధువులని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా గీసుగొండ మండల గొర్రెకుంటలోని తెలుగు బాపిస్తు, మంచి కాపరి కాథోలిక చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతు, యేసుక్రీస్తు జన్మించిన ఈ పర్వ దినమున అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని, ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ఇంటింటా ఆనందపు కాంతులు వెల్లివిరియాలని యేసు క్రీస్తును ప్రతిస్తూ, ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్ని మతాలను సమానతో, పండగలను అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సుంకరి శివ, మండల ముఖ్య నాయకులు, నాయకులు, కార్యకర్తలు, మతపెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

ఆలేరు నియోజకవర్గంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు..

ఆలేరు నియోజకవర్గంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు..

ఆలేరు 25 డిసంబర్ 22

ఆలేరు నియోజకవర్గం చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన బీర్ల అయిలయ్య

ఆలేరు నియోజకవర్గంలోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని పలు చర్చిల్లో క్రిస్మస్ చిన్నపిల్లలతో కేక్ కట్ చేయించారు , క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆలేరు నియోజకవర్గం క్రిస్టియన్ సోదరులతో యేసు యొక్క జన్మదిన వేడుకలు ఇలా జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.

ప్రారంభోత్సవనికి కల్యాణ మండపం..

ప్రారంభోత్సవనికి కల్యాణ మండపం..

ఆర్మూర్ 25 డిసంబర్ 22

నిజామాబాద్ జిల్లా వంజరి కులస్తులకు నిర్మిస్తున్న కల్యాణ మండపం జనవరి 26న ప్రారంభోత్సవం చేస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తెలిపారు. ఆదివారం మాక్లూర్ మండలంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. మామిడిపల్లి గ్రామ వంజరి కులస్తులతో ముచటించారు. గ్రామా ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యే దృష్టికి తిసుకవేల్లరు, గ్రామా సమస్యలు వెంటనే పరిశ్క్షంచాలని అధికారులకు, ప్రజ ప్రధినిదులకు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా క్రిస్మస్ పండుగా..మంత్రి హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా క్రిస్మస్ పండుగా..మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట 25 డిసెంబరు 22

దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా క్రిస్మస్ పండుగను జరుపు కుంటున్నమని రాష్ట్ర ఆర్థిక, అరిగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. పెదవర్గాలే బీఆర్ఎస్ప్ర పార్టీకి ఆత్మబంధువులని, పేదలకు సాయం చేయడమే తెలంగాణ ప్రభుత్వదేయమని మంత్రి తెలిపారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సీఎస్ఐ చర్చిలో ఆదివారం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని, ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ తో కలిసి హాజరయ్యారు. కేక్ కట్ క్రైస్తవ ఫాస్టర్లకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో క్రిస్మస్ పండుగకు రెండు రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు. భారత దేశం భిన్నత్వంలో ఏకత్వమని, అన్నీ కులాలు, మతాలు కలిసి ఉన్న దేశమని,పేదలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆత్మబంధువులని అన్నరు. సిద్ధిపేట సీఎస్ఐ చర్చి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉత్సవాలను జరుపుతున్న సందర్భంగా సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. సిద్ధిపేట నియోజక వర్గాన్ని అన్నీ రంగాలలో అభివృద్ధి చెందుతున్నరు.

టాలీవుడ్‌ నటుడు చలపతి రావు మృతి..

టాలీవుడ్‌ నటుడు చలపతి రావు మృతి..

హైదరాబాద్ 25 డిసంబర్ 22

ప్రముఖ నటుడు చలపతిరావు (78) మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది వరసగా సీనియర్ నటులు మృతి చెందడం బాధగా ఉంది. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల. సత్యనారాయణ, చలపతి రావ్ లు వరసగా మరణించడం చిత్రరంగానికి లోటు. చలపతిరావు ఆకస్మిక మరణంతో టాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. చలపతి రావు ఆత్మకు శాంతి చేకూరాలంటూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రవిబాబు దర్శకుడు, నటుడు, నిర్మాతగా ఉన్నారు. 1944 మే8న కృష్ణా జిల్లా బల్లిపర్రులో జన్మించిన చలపతిరావు.. నటుడు, నిర్మాతగా గుర్తింపు పొందారు. 600కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. 1966లో విడుదలైన ‘గూఢచారి 116’ సినిమాతో ఆయన చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. ఎన్టీఆర్‌, కృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్‌ చిత్రాల్లో సహాయనటుడిగా, ప్రతినాయకుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ‘కలియుగ కృష్ణుడు’, ’కడప రెడ్డమ్మ’, ‘జగన్నాటకం’, ‘పెళ్లంటే నూరేళ్ల పంట’తదితర సినిమాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు. సీనియర్‌ ఎన్టీఆర్‌తో చలపతిరావుకు ప్రత్యేక అనుబంధం ఉంది. మూడు తరాల నటులతోనూ ఆయన నటించారు. ‘యమగోల’, ‘యుగపురుషుడు’, ‘డ్రైవర్‌ రాముడు’, ‘అక్బర్‌ సలీమ్‌ అనార్కలి’, ‘భలే కృష్ణుడు’, ‘సరదా రాముడు’, ‘జస్టిస్‌ చౌదరి’, ‘బొబ్బిలి పులి’, ‘చట్టంతో పోరాటం’, ‘దొంగ రాముడు’, ‘అల్లరి అల్లుడు’, ‘అల్లరి’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘నువ్వే కావాలి’, ‘సింహాద్రి’, ‘బన్నీ’, ‘బొమ్మరిల్లు’, ‘అరుంధతి’, ‘సింహా’, ‘దమ్ము’, ‘లెజెండ్‌’ ఇలా ఎన్నో వందల చిత్రాల్లో ఆయన కీలకపాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన ‘బంగార్రాజు’ తర్వాత చలపతిరావు వెండితెరపై కనిపించలేదు….

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో రాజకీయ జోక్యం తగదు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో రాజకీయ జోక్యం తగదు.

యాదాద్రి భువనగి 24 డిసంబర్ 22

అర్హులకు ఇల్లు కేటాయించకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం..

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో రాజకీయ జోక్యంతో అర్హులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మండల కార్యనిర్వహక అధ్యక్షులు ఎరుకల వెంకటేష్ శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల జరిగిన గ్రామసభలో అర్హులను కాకుండా అనర్హులను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుందని, సంబంధిత శాఖల అధికారులు. ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి అర్హులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ మండల అధ్యక్షుడు తలారి అశోక్, కోట సురేష్ తదితరులున్నారు

రాష్ట్రస్థాయిలో రాణిస్తున్న సిద్దిపేట జిల్లా ఉపాధ్యాయులు..

రాష్ట్రస్థాయిలో రాణిస్తున్న సిద్దిపేట జిల్లా ఉపాధ్యాయులు..

” జాతీయ గణిత దినోత్సవం ”

SCERT తెలంగాణ నిర్వహించిన రాష్ట్రస్థాయి గణిత సెమినార్ కు పి. రూపా రాణి, ఎస్ .ఎ .మ్యాథ్స్ జెడ్పిహెచ్ఎస్ సిరిసినగండ్ల, మం. కొండపాక , వి .అజయ్ కుమార్ రెడ్డి, ఎస్. ఎ.మ్యాథ్స్ , జడ్పీహెచ్ఎస్ కుకునూరుపల్లి, మం, సిహెచ్. ప్రదీప్ కుమార్ ,ఎస్జిటి, ఎంపీ యుపిఎస్ సంగుపల్లి ,ఎంపికైనారు. వీరిలో పి.రుపారాణి మరియు వి. అజయ్ కుమార్ రెడ్డి లు SCERT – TELANGANA వారు జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా నిర్వహించే రాష్ట్రస్థాయి గణిత సెమినార్ కు వరుసగా రెండుసార్లు ఎంపికై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం విశేషం .ఇటీవల నిర్వహించిన ఇన్స్పైర్ అండ్ సైన్స్ ఫెయిర్ లో ఉత్తమ టీచర్ ఎగ్జిబిట్ గా రాష్ట్రస్థాయికి ఎంపిక అవ్వడం జరిగింది. గతంలో కూడా కరోనా సమయంలో యానిమేషన్స్ ఉపయోగించి అనేక మ్యాథ్స్ డిజిటల్ లెసన్స్ స్వయంగా తయారు చేసి విద్యార్థులకు ఆకర్షణీయమైన బోధనను అందించారు.

క్రైస్తవ సోదర సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు… మంత్రి హరిష్ రావు

క్రైస్తవ సోదర సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు… మంత్రి హరిష్ రావు

సిద్దిపేట 24 డిసంబర్ 22

ఉమ్మడి మెదక్ జిల్లా క్రైస్తవ సోదర, సోదరీమణులకు, మంత్రి హరీశ్ రావు క్రిస్మస్ శనివారం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రేమ,సేవాతత్పరతను, క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మించినరోజును క్రైస్తవ సోదరులకు అత్యంత సంతోషకర పవిత్రమైన రోజుఅని, ఆనందోత్సహాలతో
ఈ పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని పేద క్రిస్టియన్లకు ప్రభుత్వం కానుకగా బట్టలు పంపిణీ చేసిందని, యేసు ప్రభు దీవెనలతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ఆభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశ స్ధాయి లో అమలు అయ్యేలా బి ఆర్ ఎస్ పార్టీ ని దేశంలో గుణాత్మక మార్పు తెచ్చాల యేసు ప్రభు ఆశీర్వదాలు ఇవ్వాలని ఆకాంక్షించారు.

ప్రశాంత వాతావరణంలో ముగిసిన సెస్‌ ఎన్నికల పోలింగ్

ప్రశాంత వాతావరణంలో ముగిసిన సెస్‌ ఎన్నికల పోలింగ్

  • ఉత్సహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు
  • జిల్లా వ్యాప్తంగా 84 శాతం పోలింగ్ నమోదు
  • ఎన్నికల పోలింగ్ ప్రక్రియను మానిటర్ చేసిన జిల్లా కలెక్టర్, రాష్ట్ర సహకార ఎన్నికల సంఘం అథారిటీ అధికారిని సుమిత్రా, ఎలక్షన్ అధికారి బి మమతలు

సిరిసిల్ల 24 డిసెంబర్ 22

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్‌ సరఫరా ప్రశాంత వాతావరణంలో ముగిసిన ఎన్నికల పోలింగ్.
15 డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతవాతావరణం లో పారదర్శంగా ముగిసింది.
15 డైరెక్టర్ స్థానాలకు మొత్తం 75 మంది అభ్యర్థులు బరిలో నిలవగా
పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల లోపు వచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 202 పోలింగ్‌ కేంద్రాల లో 252 పోలింగ్ బూత్ లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపారు . పోలింగ్ బూతుల సంఖ్య అధికంగా ఏర్పాటు చేయడంతో Q లైన్లో ఎక్కువసేపు వేసి చూడనవసరం లేకుండా ఓటర్లు సులువుగా, వేగంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేములవాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో పోలింగ్ తీరును రాష్ట్ర కోఆపరేటివ్ ఎన్నికల అథారిటీ సుమిత్ర, సెస్ ఎన్నికల అధికారి మమత పరిశీలించారు. బూత్‌లోని సిబ్బందితో మాట్లాడి పోలీంగ్‌ సరళిని తెలుసుకున్నారు. సిరిసిల్ల శివనగర్‌లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌ను జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే పరిశీలించారు.పోలింగ్ జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు మానిటర్ చేసిన జిల్లా కలెక్టర్ పోలింగ్ జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మానిటర్ చేశారు. క్షేత్ర పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరిగేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సిరిసిల్ల పట్టణం జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నీ బూత్ 5 ,6,7, 14 పోలింగ్ బూత్ లు, కుసుమ రామయ్య బాలుర ZPHS లో బూత్ నెంబర్ 3, 4,5 పోలింగ్ కేంద్రాల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్వయంగా సందర్శించి
పోలింగ్ ప్రక్రియ జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు.
పోలింగ్ సజావుగా జరిగేందుకు పోలింగ్ పర్సన్ లకు పలు సూచనలు చేశారు.

…జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ…

స్వేచ్ఛా యుతవాతావరణంలో పోలింగ్ ప్రశాంతంగా పోలింగ్ పూర్తయిన అనంతరం సహకార ఎన్నికల అధికారులతో శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో సమావేశమయ్యారు. నిబంధనల మేరకు కౌంటింగ్ సజావుగా జరిగేలా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.కాగా డిసెంబర్ 26న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 27న ఆఫీస్ బేరర్ల ఎన్నిక జరుగుతుందని ఎలెక్షన్​ ఆఫీసర్​ బి మమత వెల్లడించారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...