36.2 C
Hyderabad
Wednesday, April 22, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 146

కేజీ వీల్స్ తో రోడ్లపైకి రావద్దు.. మంత్రి

కేజీ వీల్స్ తో రోడ్లపైకి రావద్దు.. మంత్రి

నిజామాబాద్ 24 డిసెంబర్ 22

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం దేవక్కపేట, కారేపల్లి నూతనంగా వేసిన బీటీ రోడ్డుపై ట్రాక్టర్ క్రేజ్ వీల్ వాహనాల గుర్తులను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రభుత్వం కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తుంటే పట్టీలు లేని కేజీవిల్స్ తో వాహనాలు నడిపి రోడ్లు నాశనం చేయడం అది కాదని, ట్రాక్టర్ యజమానులకు, ట్రాక్టర్ డ్రైవర్ లకు అవగాహన కల్పించి, ఇప్పటివరకు ఎన్ని కేజీ విల్ ట్రాక్టర్స్ పై కేసు నమోదు చేశారని పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకొని రోడ్లపై కేజీవిల్ వాహనాలు పట్టిలు లేకుండా నడపమని తీర్మానాలు చేసి మండలాలలోని తాసిల్దార్లకు అందజేయాలన్నారు. గ్రామాలు తీర్మానం చేసుకోనంతవరకు ఆయా గ్రామాల గుండా వెళ్లాల్సిన బిటి రోడ్ పనులను వాయిదా వేయాలని అధికారులకు తెలిపారు.

అత్యాధునిక హంగులతో కొత్త బస్సులు.. ప్రారంభం

అత్యాధునిక హంగులతో కొత్త బస్సులు.. ప్రారంభం

హైదరాబాద్ 24 డిసెంబర్ 22

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక హంగులతో సూపర్ లగ్జరీ బస్సులను హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
శనివారం ప్రారంభించారు. ఈ బస్సులలో ప్రయాణికులకు కల్పిస్తున్న సదుపాయాలను, టీఎస్ ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ లతో కలిసి సూపర్ లగ్జరీ బస్సుల ప్రత్యేకతలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రహదారి, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధా ప్రకాష్ తో పాటు ఉన్నతాధికారు పాల్గొన్నారు.

సైబర్ మోసాలతో జాగ్రత్త..కమిషనర్

సైబర్ మోసాలతో జాగ్రత్త..కమిషనర్

రామగుండం 24 డిసెంబర్ 22

లాటరి, లోన్ యాప్, సైబర్ మోసాలు,ఫోన్లకు మెసేజ్ రాగానే NCRP portal (www.cybercrime.gov.in) లో తక్షణమే ఫిర్యాదు చేసి టోల్ ఫ్రీ నెంబర్ 1930 తక్షణమే కాల్ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం సమాజంలో తొందరగా డబ్బు సంపాదించాలని చూస్తున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మచ్చి జీతం సరిపోక పార్ట్ టైం జాబ్స్ , మహిళ లు కాలి సమయం లో పార్ట్ టైం జాబ్ కోసం వెతుకుతూ సైబర్ నేరగాళ్లు చేతికి చిక్కుతూ ఉంటారు. కొంతమంది మోసగాళ్లు మీ తక్షణ అవసరాలను గుర్తించి, రుణం తీసుకోవడానికి ముందుగా మీరు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని రుణం మంజూరు చేయడానికి డబ్బులు అడగడం అంటే స్కామ్ అని గుర్తించాలని అన్నారు.

త్వరలో అందుబాటులో ఆర్మూర్ అర్బన్ పార్క్..

త్వరలో అందుబాటులో ఆర్మూర్ అర్బన్ పార్క్..

ఆర్మూర్ 24 డిసెంబరు 22

ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చేతులమీదుగా ప్రారంభించుకుందాం..

ప్రతిష్టాత్మకంగా తల పెట్టిన ఆర్మూర్ అర్బన్ పార్క్ నిర్మాణం పనులను అతి త్వరలో పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని పీయూసీ ఛైర్మన్,ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తెలిపారు.


“నమస్తే నవనాధపురం”

కార్యక్రమంలో భాగంగా శనివారం మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్ గ్రామం వద్ద ఆర్మూర్ అర్బన్ పార్క్ నిర్మాణం పనులను క్షేత్రస్థాయిలో, ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి అర్బన్ పార్క్ పనులను మొత్తం పరిశీలించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి అధికారులతో సమావేశమై పార్క్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. చేపట్టిన పనులలో విజయం సాధించడం కోసం అంకితభావంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి అధికారులకు ఉద్బోధించారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ అటవీశాఖ పర్యవేక్షణలో ఆర్మూర్ అర్బన్ పార్క్ నిర్మాణం జరుగుతున్న దన్నారు.166 హెక్టార్లు అనగా మొత్తం 470 ఎకరాల్లో చేపట్టిన ఈ పార్క్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసుకొని, త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. తెలంగాణ రాష్ట్రం లోని ఆరు కిలో మీటర్ల వాకింగ్ ట్రాక్ ఉన్న ఏకైక పార్క్ ఇదేనన్నారు. చిన్నపూర్ చెరువు సుందరీకరణ, పార్క్ కు మంచినీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, కల్వర్టుల నిర్మాణం వంటి పనులకు ఇప్పటికే ఆరు కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు జీవన్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ అర్బన్ పార్క్ ను మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల పాలిట దేవుడని, ఆయన దయతోనే ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమైందని జీవన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆర్మూర్ అర్బన్ పార్క్ తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా ఆయన అభివర్ణించారు. ఈ పార్క్ నిర్మాణంలో భాగస్వాములు అయిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను, ప్రజా ప్రతినిధులను ఆయన అభినందించారు. ముఖ్యంగా అటవీశాఖ అధికారులు రెండు సంవత్సరాలు శ్రమించి ఈ పార్క్ కు ఒక రూపమిచ్చా రన్నారు. ఈ పార్కును ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు జీవన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు శ్రీనివాస్, సౌమ్య, అశోక్ కుమార్, మాక్లూర్ మండల పరిషత్ అధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్ గంగారెడ్డి, అడివి మామిడిపల్లి సర్పంచ్ మల్లారెడ్డి, ఎంపీటీసీ సత్యనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

దేశ రాజకీయాల్లోనే సరికొత్త అధ్యాయం..బీఆర్ఎస్ పార్టి

దేశ రాజకీయాల్లోనే సరికొత్త అధ్యాయం..బీఆర్ఎస్ పార్టి

నిజామాబాద్ 24 డిసెంబర్ 22

తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధించాలని చూస్తుంది.

భారత దేశమంతటా తెలంగాణ అభివృద్ధి కోరుకుంటున్నారు.

రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పాలన ఆకర్షితులై నిజాంబాద్, బాల్కొండ నియోజకవర్గంలోని బిజెపి, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు శనివారం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ రాజకీయాల్లోనే సరికొత్త అధ్యాయం మొదలైంది, దేశం బాగు కోసం సీఎం కేసీఆర్ అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలు టిఆర్ఎస్ పార్టీని అక్కున చేర్చుకుంటున్నారని, తెలంగాణ తరహా 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు, కుల వృత్తుల ప్రోత్సాహం ఎన్నో సంక్షేమ పథకాల ను అన్ని రాసి రాష్ట్రాలలో అమలు జరిగలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారు. తెలంగాణ బిజెపి నేతలకు రాజకీయం తప్ప ఇక్కడి ప్రజల బాగు పట్టదని అన్నారు. కాంగ్రెస్ బిజెపితో ప్రజలు విస్క్ పోయారని రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా బిఆర్ఎస్ ప్రభావం ఉంటుందని ” అబ్ కి బార్ కిసాన్ సర్కా ర్” అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో శివ, వినోద్, శ్రీకాంత్, రాజశేఖర్, షేక్ కరీం పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా సహకార విద్యుత్ సంఘం ఎన్నికల పోలింగ్

ప్రశాంతంగా సహకార విద్యుత్ సంఘం ఎన్నికల పోలింగ్

సిరిసిల్ల, 24 డిసెంబర్ 22

సహకార విద్యుత్ సహకార సంఘం ఎన్నికలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు జరు చున్నవి, సెస్ పోలింగ్ సెంటర్లలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు .

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి..కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి..కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి

రామగుండం 24 డిసంబర్ 22.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి రామగుండం పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్ లో సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, హోంగార్డ్ లకు శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. పరేడ్ కి రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి (ఐజీ) హాజరై గౌరవ వందనం స్వీకరించి ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ప్రతిరోజు ఉదయాన్నే కనీసం ఒక అరగంట యోగ, ధ్యానం, నడకతో, వ్యాయామం, మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విదులు నిర్వహించడానికి ఫిజికల్ ఫిట్నెస్ తప్పనిసరి అని తెలిపారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాల, రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్ ఏ.ఆర్ ఏసీపీ సుందర్ రావు, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్జాలోద్దీన్, ఆర్ఐ లు శ్రీధర్, విష్ణు ప్రసాద్, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామీణ రైతులకు ఘనంగా సన్మానం..

గ్రామీణ రైతులకు ఘనంగా సన్మానం..

సిద్దిపేట 23 డిసంబర్
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా స్థానిక న్యూ విజేత పాఠశాల మరియు స్పైస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో22 శుక్రవారం విద్యార్థులతో కలిసి స్థానిక ఇమాంబాద్ లో ఉన్న శ్రీమతి శ్రీ రాధారం లక్ష్మి-రంగయ్య దంపతుల యొక్క వ్యవసాయ క్షేత్రంలో పర్యటించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులందరూ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న రైతు దంపతులను పంటలు ఎలా పండిస్తారో, ఏ విధంగా నీళ్లు పెడతారో, ఏ విధంగా పంటను కోస్తారు మొదలగు విషయాలు మరియు ఆకుకూరలు, కూరగాయలు మొదలగు పంటలను ఎలా పండిస్తారు అని అడిగి తెలుసుకున్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతు చేస్తున్న కృషిని ఆ రైతులకు వివరిస్తూ, రైతు దేశానికి వెన్నెముక లాంటివాడని రైతు కష్టం చేయకపోతే మానవజాతికి మనుగడనే లేదని రైతుల యొక్క కృషిని కొనియాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు యాజమాన్య బృందం అందరూ కలిసి ఆ రైతు దంపతులు శ్రీమతి శ్రీ రాధారం లక్ష్మి రంగయ్య మరియు స్థానిక లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన రైతు మహిపాల్ రెడ్డి గార్లను ఘనంగా సన్మానించడం జరిగినది.జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో అక్కడున్న ప్రాంతమంతా మారుమోగేలా నినాదాలు చేస్తూ ఆ రైతు దంపతులకు జేజేలు పలికినారు. ఇట్టి కార్యక్రమంలో స్పైస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ గుండ్ల రవికుమార్, ఎర్రబోలు శ్రీకాంత్ రెడ్డి మరియు న్యూ విజేత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ చాతరాశి రవి గారు పాల్గొనడం జరిగినది.

మరో నాలుగు నెలల్లో భారత్ నం.1.. – రెండో స్థానానికి చైనా

మరో నాలుగు నెలల్లో భారత్ నం.1..
– రెండో స్థానానికి చైనా

హైదరాబాదు 23 డిసంబర్ 22

ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ఏదంటే టక్కున చెప్పే సమాధానం చైనా అని.. కానీ ఇప్పుడు గర్వంగా మనమే అనే చెప్పుకునే రోజు త్వరలోనే రానుంది.మరో నాలుగు నెలల్లో జనాభాలో భారత్ చైనాను వెనక్కి నెట్టి ప్రపంచ నం.1గా అవతరించనుంది. ప్రస్తుతం చైనా జనాభా 141.5కోట్లు. భూమిపై ఉన్న మొత్తం జనాభాలో మూడో వంతు జనాభా చైనాలోనే ఉన్నారు. 2023ఏప్రిల్ నాటికి భారత్ జనాభా చైనాను అధిగమిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుత భారత జనాభా 139కోట్లుగా ఉంది. ఇటీవల చైనాలో జననాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గతేడాదిలో కేవలం 1.60కోట్ల జననాలు మాత్రమే నమోదయ్యాయి. ఆ దేశ మృతుల సంఖ్యతో పోల్చితే పెద్ద సంఖ్యేమీకాదు. ఇటు భారత్‌లోనూ అదే పరిస్థితి. 1950లో భారత సంతానోత్పత్తి రేటు సగటున 5.7 శాతంగా ఉండగా, అది ఇప్పుడు రెండుకు తగ్గింది.ఇక 1983లో చైనా జనాభా వృద్ధి రేటు 2 శాతంగా ఉండగా, ప్రస్తుతం 1.1 శాతం ఉంది. అంటే జననాల రేటు దాదాపు సగానికి పడిపోయింది. కొరియా, మలేసియా, తైవాన్‌, థాయ్‌లాండ్‌ వంటి తూర్పు ఆసియా దేశాలు, భారత్‌ కంటే ఆలస్యంగా జనాభా నియంత్రణ చేపట్టినప్పటికీ భారత్‌ కంటే ముందుగా సంతానోత్పత్తి స్థాయి తగ్గించడంతో పాటు, మాతాశిశు మరణాల రేటు తగ్గుదల, ఆదాయాల పెంపు, మెరుగైన జీవన ప్రమాణాలను సాధించాయి. ఐతే కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో జనాభా వృద్ధి రేటు తగ్గుతోంది. తాజాగా మరణాల రేటు తగ్గిపోవడం, ఆయుర్దాయం పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరిగింది. దీంతో జననాలు మునుపటి కంటే తగ్గటానికి దోహదపడ్డాయి. అలాగే ప్రపంచంలో 25 ఏళ్ల లోపు ఉన్న ప్రతీ అయిదుగురిలో ఒకరు భారతీయు కావడం విశేషం. మన దేశ మొత్తం జనాభాలో 47 శాతం జనాభా 25 ఏళ్లలోపు వారే ఉన్నారు. 1947లో భారతదేశ ప్రజల సగటు వయస్సు 21 సంవత్సరాలుగా ఉండిరది. ఆ సమయంలో 60 ఏళ్ల పైబడిన వారు కేవలం 5 శాతం మంది మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు భారత దేశ ప్రజల సగటు వయసు 28 సంవత్సరాలకు పైగా ఉంది. 60 ఏళ్లు దాటిన వారి సంఖ్య 10 శాతంగా ఉంది.

కైకాల సత్యనారాయణ ప్రస్థానం..

కైకాల సత్యనారాయణ ప్రస్థానం..

హైదరాబాదు (డిసెంబర్23)

మరో సినీ దిగ్గజం భువినుండి దివికి ఎగిసింది.. సీనియర్‌ నటుడు..
కైకాల సత్యనారాయణ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.. సినీ నటుడిగానే కాదు.. పార్లమెంట్‌ సభ్యుడిగా ఆయన సేవలు అందించారు.. తన 60 సంవత్సరాల సినీజీవితంలో 777 సినిమాల్లో నటించారు.. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు పోషించారు.. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వీ రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరు.. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో సినీరంగప్రవేశం చేసిన కైకాలకు సంబంధించిన ప్రస్థానంలోకి వెళ్తే.. కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో 1935 జులై 25న జన్మించారు కైకాల సత్యనారాయణ.. గుడివాడ కళాశాల నుంచి పట్టభద్రుడైన ఆయన.. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మను వివాహం చేసుకున్నారు.. కైకాలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.. తన మనవళ్లలో ఒకరిని నటవారసుడిగా చూడాలనేది కైకాల కోరిక.. నవరస నటనా సార్వభౌముడిగా ప్రఖ్యాతిగాంచిన కైకాల.. ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో తన ప్రయాణాన్ని కొనసాగించారు.. 777 చిత్రాల్లో నటించి మెప్పించారు.. కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం సిపాయి కూతురు కాగా.. ఆయన నటించిన చివరి చిత్రం సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన మహర్షి.. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లోఎన్నో పాత్రలు పోషించిన కైకాల.. 28 పౌరాణిక, 51 జానపద, 9 చారిత్రక చిత్రాల్లో నటించారు.. 200 మందికిపైగా దర్శకులతో పనిచేశారు. 100 రోజులు ఆడిన కైకాల నటించిన చిత్రాలు 223 ఉన్నాయి.. అర్ధశతదినోత్సవాలు జరుపుకున్న సినిమాలు 59.. సంవత్సరం ఆడిన చిత్రాలు 10 ఉన్నాయి.. ఇంటర్ రెండో సంవత్సరంలో నాటకరంగంలో ప్రవేశం చేశారు కైకాల.. నాటకరంగ అనుభవంతో సినిమాల్లో వేషం కోసం మద్రాసు వెళ్లిన ఆయనకు నటుడిగా గుర్తించారు డి.ఎల్.నారాయణ.. తొలి సినిమాతోనే కథానాయకుడి అవకాశాన్ని అందుకున్న కైకాల.. సిపాయి కూతురు చిత్రంతో కథానాయకుడిగా తెరకు పరిచయం అయ్యారు.. కైకాలకు ఎన్టీఆర్ పోలికలు కలిసివచ్చాయి.. కైకాలను ఎన్టీఆర్ కు నకలుగా భావించారు పరిశ్రమ పెద్దలు.. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ తో కలిసి తెరను పంచుకున్నారు.. విఠలాచార్య దర్శకత్వంలో తొలి ప్రతినాయకుడి వేషం వేసిన కైకాల.. కనకదుర్గ పూజ మహిమ చిత్రంలో తొలిసారి ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అయితే, ఎన్టీఆర్ అగ్గిపిడుగు చిత్రంతో కైకాల సినీ జీవితం మలుపుతిరిగింది.. ఎన్టీఆర్ తో కలిసి 101 చిత్రాల్లో నటించారు.. ఎన్టీఆర్ తో పోరాట సన్నివేశాల్లో పోటాపోటీగానటించి మెప్పించారు కైకాల. యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా అలరించారు కైకాల .. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు పాత్రల్లో ఆయన జీవించారు.. సాంఘిక చిత్రాల్లో రౌడీ, తండ్రి, తాత పాత్రల్లో నటించి మెప్పించారు. రమా ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించిన కైకాల.. కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు లాంటి చిత్రాలను నిర్మించారు.. 1994లో బంగారు కుటుంబం చిత్రానికి నంది పురస్కారం అందుకున్నారు. 2011లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆయనను సత్కరించారు.. ఇక, 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కైకాల సత్యనారాయణ.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.. తొలి రోజుల్లో ”రాముడు-భీముడు’ వంటిఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయ చిత్రాలలో ఆయనకు డూప్ గా నటించారు.. కైకాల మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.. సినీ, రాజకీయ ప్రముఖులు.. ఆయనకు నివాళులర్పిస్తున్నారు.. కైకాలతో వారికి ఉన్నఅనుబంధాన్నిగుర్తుచేసుకుంటున్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...