38.2 C
Hyderabad
Wednesday, April 22, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 147

వాణీదేవి రచనలు నేటి తరానికి మార్గనిర్దేశం.

వాణీదేవి రచనలు నేటి తరానికి మార్గనిర్దేశం

హైద్రాబాద్ సంస్థాన స్వాతంత్ర సమరయోధుడు స్వామి రామానంద తీర్థ

నిజాం రాష్ట్రంలో మాహాత్మ గాందీ పర్యటనలు. ఆది హిందూ వ్యవస్థాపకుడు భాగ్య రెడ్డి వర్మ ల రచనలు ఆవిష్కరణ …….

గజ్వేల్ 23 డిసంబర్ 22

హైద్రాబాద్ సంస్థాన విలీన విమోచన స్వాతంత్ర సమరయోధుడు గా స్వామి రామానంద తీర్థ, నిజాం రాష్ట్రంలో మహాత్మా గాంధి పర్యటన, ఆదిహిందూ సంఘం వ్యవస్థాపకుడు గా భాగ్య రెడ్డి ల గొప్పతనాన్ని చాటుతూ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె, ఎమ్మెల్సీ సురభీ వాణీదేవి రాసిన రచనలు నేటి తరానికి ఎంతో మార్గదర్శనం చేస్తాయని సురభి దయాకర్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. వెంకటరమణ కొనియాడారు. శుక్రవారం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ కూతురు ఎమ్మెల్సీ సురభి వాణీదేవి రచనలను కళాశాల లో ఆవిష్కరించారు. ఆనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. వెంకటరమణ మాట్లాడుతూ స్వాసంత్రం సిద్దిస్తున్న తరుణంలో హైద్రాబాద్ ప్రజలకు నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కలిగించాలని 1946 జూలై 3న భారతదేశంలో రాజకీయ విప్లవం వస్తున్న తరుణంలో హైద్రాబాద్ సంస్థానం దీని నుంచి తప్పుకోవడానికి ఇష్టపడదని, ప్రజల మనోభావాలను గౌరవించాలని స్వామి రామానంద తీర్థ నినదించిన తీరును వాణీదేవి రచనల్లో పేర్కొని గొప్పదనాన్ని చాటారని కొనియాడారు. హైద్రాబాద్ సైన్యాలకు పరాజయం తప్పదన్న విషయం గ్రహించగానే స్వామి రామానంద తీర్థ ను నిజాం రాజు జైలు నుండి విడుదల చేయగా సుల్తాన్ బజార్ లోగల ఆయన ఇంటి ఆవరణలో వేచివున్న అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి రామానంద తీర్థ చేసిన భావోద్వేగ ప్రసంగం నేటి యువతను చైతన్య పరిచేలా వివరించారని, పార్లమెంటు సభ్యునిగా హైద్రాబాద్ రాష్ట్ర అభవృద్ధికి చేసిన కృషి, దారిద్య్ర నిర్మూలన, వెనకబడిన, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి రామానందతీర్థ చేసిన కృషిని తెలియజేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా నిజాం రాష్ట్రంలో మహాత్ముని పర్యటనలతో పాటు ఆది హిందూ సంఘం వ్యవస్థాపకుడు భాగ్యరెడ్డి వర్మ లపై వ్రాసిన రచనలలో ఎంతో విలువైన సమాచారం ఉందన్నారు. నిజాం రాష్ట్రంలో మాహత్మ గాందీ ని పర్యటింప జేసెలా దర్మవీర బిరుదు గల వామన్నాయక్ చేసిన కృషి అనిర్వచనీయమని, ఆయన కృషి వల్ల 1929 ఏప్రిల్ 6 న గాంధీజీ మొదటిసారి హైద్రాబాద్ పర్యటన సాగిందని, ఆయన పాల్గొన్న బహిరంగ సభలో ప్రకటించిన ముఖ్యమైన అంశాలు కూలంకషంగా వివరించిన ఘనత కేవలం వాణీదేవికే దక్కిందన్నారు. తెలంగాణా దళిత జనొద్దరణ లో భాగంగా ఆదిహిందు సంస్థ , సోషల్ సర్వీస్ లీగ్ న్యాయ పంచాయతీ వ్యవస్థ ద్వారా మాదర భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషిని నేటి తరం నేర్చుకోవాల్సిన అవసరం స్పష్టంగా వివరించారని తెలిపారు. దళితుల అభివృద్ధికి జగన్నిత్ర మండలి ద్వారా పాఠశాలల స్థాపన, అంటరానితనం ప్రారదొలాలనే సంకల్పంతో సభలు, సమావేశాలు నిర్వహించడం, దళితులను ఆర్థికంగా అభవృద్ధి చేయాలని చేసిన సూచనలు సత్ఫలితాలివ్వడం గురించి వాణీదేవి రాసిన రచనల్లో గొప్పగా చెప్పడం జరిగిందన్నారు. తండ్రి పీవీ నరసింహారావు ఆశయాల కనుగుణంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకుని స్వాతంత్య్రం పూర్వం ఉన్న మేదావులపై వాణీదేవి రచనలలో ఎంతో మందికి తెలియచేసేలా పూనుకోవడం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది డాక్టర్ ఎస్. ఫణీంద్ర, డాక్టర్ ఆర్.నిర్మల, సిహీచ్. ఎస్. సంతోష్, నరేష్ రెడ్డి, సౌమ్య, సౌందర్య, స్నేహ, ఈశ్వర్, భారతి, పూజిత, మమత రెడ్డి, అరుణ, ప్రవీణ్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు

రైతుల వ్యతిరేక మోదీ ప్రభుత్వం కు బుద్ది చెపుతాం..

కేంద్రం ప్రభుత్వం మెడలు వంచాల్సిందే..కొత్త ప్రభాకర్ రెడ్డి
రైతుల వ్యతిరేక మోదీ ప్రభుత్వం కు బుద్ది చెపుతాం

సిద్దిపేట 23 డిసంబర్ 22

తెలంగాణాలో ఉన్న రైతులకు కేంద్రంలో ఉన్న ప్రదాని నరేంద్రమోదీ ప్రభుత్వనికి వ్యతిరేకంగా.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశ వ్యాప్త పోరాటం సాగుస్తామని మెదక్ పార్లమెంటు సభ్యుడు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట లో జరిగిన మహాధర్నా కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమాలు చేశామని, నేడు కేంద్రంకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నామని. దేశంలోనే ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందని, ఓర్వ లేకనే మోదీ ప్రభుత్వం కొర్రీలు పెడుతు. సీఎం కేసీఆర్ రైతు బిడ్డ కావడంతో రైతుల కష్టాలు ఎరిగిన వ్యక్తి కావడంతో రైతు సంక్షేమం కోసం, ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, రైతు హిత పథకాలను తెలంగాణ లో అమలవుతోదని తెలిపారు. రైతులు కల్లాలు నిర్మించుకుంటే..నిధులు వాపస్ ఇవ్వాలని అంటున్నారు…ఇదెక్కడి న్యాయం..బీజేపీ ఎంపీ లు ఉన్నారు..ఎం లాభం..ఒక్కరోజు కూడా తెలంగాణ గురుంచి మాట్లాడలేరు. మైకుల ముద్దర మాత్రం ఈ cc రోడ్డు, బాత్రూము లు, కల్లాలు మాయే అంటారు..కేసీఆర్ .హరీశ్ రావు, కేటీఆర్, ను ఓడిస్తా అంటాడు.. తెలంగాణ అభివృద్ధి,సంక్షేమం మిగతా రాష్ట్రాల్లో ఎందుకు లేదని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో రైతులు హరి గోసఘోష పడుతురు, గుజరాత్ లోని రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని, తెలంగాణ తరహా దేశ వ్యాప్తంగా రైతు బాగు పడటానికే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ధర్నాలో జిల్లా పరిషత్ చేర్మెన్ రోజా శర్మ, ఎమేల్సి పారుక్ హుసేన్,జిల్లా నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

పరిశోదనలే వ్యవసాయ రంగానికి మూల స్తంభం..గవర్నర్ తమిళిసై

పరిశోదనలే వ్యవసాయ రంగానికి మూల స్తంభం..గవర్నర్ తమిళిసై

గజ్వేల్ 23 డిసెంబర్ 2022.

ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించే వంగడాల ఉత్పత్తి లక్ష్యంగా పరిశోధనలు నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్ కొండ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం చాన్సులర్ తమిళిసై సౌందరరాజన్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ములుగు లో గల శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం రెండవ సాధనోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను, పీహెచ్డీ చేసిన వారికి డాక్టరేట్ పట్టాలను అందజేశారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ ఉద్యాన రంగం వ్యవసాయ రంగానికి మూల స్తంభం లాంటిదని, ఎలాంటి అనారోగ్యాలు లేకుండా గత తరం మనుషులు ఎలాంటి ఆహారం తీసుకొని ఆరోగ్యవంతంగా బతికారో అలాంటి ఆరోగ్యవంతమైన పంటలను పండించడానికి ఉద్యాన విద్యార్థులు విస్తృతమైన పరిశోధనలు జరపాలని అన్నారు. గతంలో వివిధ రకాలైన వరి ధాన్యాలను వివిధ సందర్భాల్లో ఆహారంగా తీసుకునే వాళ్ళు కానీ ప్రస్తుతం పాలిష్ చేసిన వరి బియ్యంతో చేసిన వంటలను ఆహారంగా తీసుకోవడం మూలంగా శరీరానికి అవసరమైన ప్రోటీన్లను పొందలేకపోతున్నమన్నారు. కరోనా వైరస్ తో పౌష్టికాహారం విలువను ప్రపంచానికి తెలిసిందని, మానవాళికి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించే వంగడాల సృష్టి జరిగేలా ఉద్యాన విద్యార్థులు నిరంతరం పరిశోధనలు నిర్వహించాలని అన్నారు. శాకాహారం, పండ్లు, పూల వలన మానవాళికి జరిగే లాభాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. నెగిటివ్ ఆలోచనలు మాని పాజిటివ్ గా ఆలోచించి విశ్వవిద్యాలయంలో కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా నైపుణ్యాన్ని సాధించాలని గవర్నర్ విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ నీరజ ప్రభాకర్ మాట్ల్తడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయం 8 సంవత్సరాల వ్యవధిలో సాధించిన విజయాలను, విద్యార్థులకు అందజేసిన కోర్సుల వివరాలను, జరిగిన పరిశోధనలను వివరించారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (హార్టికల్చర్) డా. ఆనంద్ కుమార్ సింగ్ మాట్లాడుతూ దేశంలో సగం జనాభా వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉందని వ్యవసాయ రంగానికి ఉద్యాన పంటలు తోడైనప్పుడు మాత్రమే రైతులు అభివృద్ధి సాధిస్తారని అన్నారు. దేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉద్యాన పంటల పండించే జాబితాలో ఉందని ప్రభుత్వం సమీకృత ఉద్యాన వన అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు ఈ రెండవ శాతకోత్సవంలో 482 అండర్ గ్రాడ్యుయేట్, 76 పోస్ట్ గ్రాడ్యుయేట్, 17 పీహెచ్డీ పట్టాలు, అండర్ గ్రాడ్యుయేట్ లో మూడు బ్యాచ్ లకు మూడు యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్, పీజీ లో రెండు బ్యాచ్ లకు రెండు యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్ అలాగే పీజీలో మరో ఆరు స్పాన్సర్ గోల్డ్ మెడలు కలిపి మొత్తంగా పదకొండు బంగారు పతకాలను గవర్నర్ విద్యార్థులకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్టర్ భగవాన్, ప్రొఫెసర్లు, అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, పిహెచ్డి విద్యార్థులు, పేరెంట్స్, యూనివర్సిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి..రాజన్న సిరిసిల్ల

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి..రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల 23 డిసెంబర్ 22

23 డిసెంబర్ 22 జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ రాజన్న సిరిసిల్ల జిల్లా గారి ఆదేశాలను సారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్ స్కీం లో వైద్యాధికారి (Contractual basis) బస్తి దావకానాలు నియామకం కొరకు తేదీ. 24 డిసెంబర్ 22 నుండి 29 డిసెంబర్ 22 , సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఆసక్తిగల అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించబడును. పోస్ట్ 1. మెడికల్ ఆఫీసర్. విద్యా అర్హతలు ఎంబీబీఎస్, ఎండి తెలంగాణ బోర్డ్ లో తప్పకుండా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి… మీ పూర్తి బయోడేటా మరియు సంబంధిత జిరాక్స్ కాపీలు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం సిరిసిల్లలో అందజేయగలరని కోరనైనది….. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి రాజన్న సిరిసిల్ల

క్రైస్తవులను మైనారిటీలుగా గుర్తించిన ఘనత కాంగ్రెస్ దే….

క్రైస్తవులను మైనారిటీలుగా గుర్తించిన ఘనత కాంగ్రెస్ దే ….

సిద్దిపేట 23 డిసంబర్ 22
క్రైస్తవులను మైనారిటీలుగా గుర్తించిన ఘనత కాంగ్రెస్ దేనని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. గురువారం రాత్రి సిద్దిపేట పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు అత్తు ఇమామ్ హాజరై, చర్చి ఫాస్టర్ అంటోని లతో కలిసి కేకు కట్ చేశారు. ఈ సందర్భంగా అత్తు ఇమామ్ మాట్లాడుతూ గత కరోనా కాలంలో పండగలు కూడా జరుపుకోలేదని, ఈ ఏడాది క్రిస్మస్ ను క్రైస్తవులంతా ఘనంగా జరుపుకోవాలని కోరారు. మతాలు ఎన్ని అయినా భావం మాత్రం ఒకటేనని, కానీ ఎవరి సంప్రదాయం వారికి ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే క్రైస్తవుల అభివృద్ధి జరిగిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు క్రైస్తవులంతా ప్రార్థనలు చేయాలని కోరారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రాగానే క్రైస్తవుల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అధికారం ఉందని అర్థంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. నాసిరికమైన బట్టలను అందజేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం క్రైస్తవులను మోసం చేస్తుందని ఆరోపించారు. అనంతరం ఫాస్టర్ అంటోని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, అత్తు ఇమామ్ ఫాస్టర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ అతిక్. యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ రాజ్వీర్. పట్టణ మైనారిటీ ఉపాధ్యక్షుడు ఫయాజ్ యూత్ కాంగ్రెస్ నాయకులు గయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు

నిబంధన ప్రకారం వాహనాలకు అన్ని పత్రాలు ఉండాలి..డిసిపి

నిబంధన ప్రకారం వాహనాలకు అన్ని పత్రాలు ఉండాలి..డిసిపి

మంచిర్యాల 23 డిసెంబర్ 22

వాహనాలకు రిజిస్ట్రేషన్,నెంబర్ ప్లేట్ దాచినా, కొన్ని నెంబర్లు తొలగించిన ఇకనుండి చీటింగ్ కేసులు నమోదు చేస్తామని డిసిపి అఖిల్ మహాజన్ తెలిపారు. మంచిర్యాల జిల్లా పరిధిలో మూడు రోజుల నుండి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీస్ లు వాహనం దారులకు అవగాహన కల్పిస్తూ ఇ ఛాలెంజ్ జరిమానా విధించడం జరుగుతుంది. స్పెషల్ డ్రైవ్ డిసెంబర్ 31 వరకు ప్రతిరోజు నిర్వహిస్తామని నిబంధనలకు విరుద్ధంగా, నెంబర్ ప్లేట్స్ కనపడకుండా, ఈ చాలన్స్ తప్పించుకోవడం కోసం వాసన ధారణం వాహనాలపై తప్పుడు నంబర్లను రాస్తున్నారని, కొందరు మరి ప్లేట్లపై డిజైన్లు, మాస్కులు వేస్తున్నారని గుర్తించామన్నారు. ఇప్పుడు జరుగుతున్న స్పెషల్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల జూన్ పరిధిలోని ప్రజలందరూ నిబంధనల ప్రకారం వాహనాలను పేపర్లు, నంబర్ ప్లేట్లు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ తప్పకుండా వాడాలని డిసిపి తెలిపారు. కరోనా మళ్లీ విజృంభించడంతో ప్రజలందరూ మాస్కలు ధరించాలని, కరణ్ నియంత్రణ పాటించాలని డిసిపి తెలిపారు.

మాజీ ప్రధాని పీవీ నర్సింగరావు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన.. మంత్రి ఎర్రబెల్లి

మాజీ ప్రధాని పీవీ నర్సింగరావు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన.. మంత్రి ఎర్రబెల్లి

హనుమకొండ 23 డిసెంబర్22

భారతదేశ ప్రధానిగా గొప్ప రాజనీతజ్ఞుడు, దేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చి దేశ ప్రతిష్టతను పెంచిన గొప్ప నాయకుడు పీవీ నరసింహారావు గారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా శుక్రవారం హనుమకొండ జిల్లాలోని పివి విగ్రహానికి పూలమాల తో నివాళులు అర్పించారు. ఇది ప్రధానిగా ఉన్నప్పుడు దేశం చాలా ముందుకెళ్లిందని నిజాయితీగా పనిచేసే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని, ఇంత గొప్ప వ్యక్తి మన వరంగల్ జిల్లా తెలుగు బిడ్డ కావడం మనందరికీ గర్వకారణంగా ఉందని, అంత గొప్ప వ్యక్తికి నివాళులు అర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను తెలిపారు.

నాడు వ్యవసాయం దండగ అన్ననేడు..రైతేరాజు..

నాడు వ్యవసాయం దండగ అన్ననేడు..రైతేరాజు..

వ్యవసాయం దండగ అన్న..నేడు పండగ చేసి రైతు రాజ్యమే అన్న ఏకైక నినాదంతో టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చి, రైతు సర్కార్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన సందర్భంగా శుక్రవారం జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని యావత్ రైతులందరికీ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.కేంద్రంలోని బిజెపి సర్కార్ దిగివచ్చే విధంగా నేడు తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రైతు ధర్నాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో మద్దతు పలికి దేశంలో రైతు రాజ్యం కోసం రైతులు టిఆర్ఎస్ పార్టీ వెంట నడవాలన్నారు.

కైకాల సత్యనారాయణ మృతి..

కైకాల సత్యనారాయణ మృతి..

టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. కైకాల మరణం..

హైదరాబాద్ 23 డిసెంబర్ 2022

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గత కొంత కాలంగా అనారోగ్య తో బాధపడుతూ హైదరాబాద్ లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రధాన విలన్ గా కమెడియన్ గా అన్ని రకాల పాత్రలను పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు. సత్యనారాయణ నిర్మాత గా సినిమాలు రూపొందించి ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన నటనకు సార్వభౌమ అనే బిరుదు పొందారు. కైకాల సత్యనారాయణ తెలుగు సినీ పరిశ్రమలో ఎమ్మెస్ రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య పాత్రను పోషించిన వారిలో సత్యనారాయణ ఒకరు. కైకాల సత్యనారాయణ కన్నుమూత తో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి తరలివస్తున్నారు.

పుస్తక ప్రియులకు శుభవార్త..

పుస్తక ప్రియులకు శుభవార్త..

(35 వ హైద్రాబాద్ పుస్తక ప్రదర్శన)

హైదరాబాదు 23డిసంబర్2022

నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం కానుంది. 22 డిసెంబరు 2022 గురువారం నుండి 01 జనవరి 2023 వరకు తెలంగాణ కళాభారతి NTR STADIUM లొ సమయం మధ్యాహ్నం 2 గ ల నుండి సాయంత్రం 8.30 నింషాల వరకు శని,ఆది వారాలలో మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 9 వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...