34.2 C
Hyderabad
Wednesday, April 22, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 148

కరోనపై ఆందోళన వద్దు..జాగ్రతగాఉందాం..మంత్రి హరీష్ రావు

కరోనపై ఆందోళన వద్దు..జాగ్రతగాఉందాం..మంత్రి హరీష్ రావు

తెలంగాణలో ఆరోగ్యశాఖ శాఖ అన్ని విదాలుగా సిద్ధంగా ఉంది..
హైదరాబాదు 22డిసంబర్2022

కరోనా వ్యాప్తి పట్ల ఆందోళన చెందవద్దని, జాగ్రతలు తీసుకొంటు అప్రమత్తంగా ఉందని రాష్ట ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, కోవిడ్ వాక్సిన్ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని, బూస్టర్ డోసులను వేసుకోవాలని తెలిపారు. చైనా సహా పలు దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్ననేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు అనుసరించి, కోవిడ్ సన్నద్ధతపై ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గురువారం ఉన్నత స్థాయి సమీక్ష జూమ్ ద్వారా నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండి చంద్రశేఖర్ రెడ్డి, టీవీవిపి కమిషనర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ బి.ఎఫ్ 7 వ్యాప్తి, ప్రభావం గురించి అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం ఆరోగ్య శాఖ కోవిడ్ సన్నద్ధత పై మంత్రి సమీక్షించారు. ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు సర్వం సంసిద్ధంగా ఉందని ప్రజలు ఎటువంటి భయాందోనళకు గురి కావద్దని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఇప్పటికే కరోనా ను విజయవంతంగా ఎదుర్కొని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలచిందన్నారు. మానవ వనరులు , మందులు , ఆక్సిజన్ , ఐసీయూ పడకలు అన్ని కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పాజిటివ్ వచ్చిన శాంపిల్స్ ని జీనోమ్ సీక్వెన్స్ కోసం గాంధీ ఆసుపత్రికి పంపాలని, ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశించారు.

కేంద్ర మంత్రి నామకు..క్షమాపణ..!

కేంద్ర మంత్రి నామకు..క్షమాపణ..!
న్యుడిల్లి 22డిసంబర్2022
నామా నాగేశ్వరరావు కు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నామా నాగేశ్వరరావు కు లేఖ పొరపాటును అంగీకరిస్తూ లేఖ వ్రాసిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయ “బల్క్ డ్రగ్ పార్క్” ను తెలంగాణ కు కేంద్రం కేటాయుంచిందని లోకసభలో మౌఖికంగా సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి మనసుఖ్ మాండవీయ. లోకసభ లో “భారత రాష్ట్ర సమితి” ( బిఆర్ఎస్) నాయకుడు నామా నాగేశ్వరరావు “బల్క్ డ్రగ్ పార్క్”ల కేటాయింపు ల విషయంలో ఈ నెల 16 వతేదీన ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి సభాముఖంగా తెలంగాణ కు కేటాయించామని చెప్పిన కేంద్ర మంత్రి అయుతే, ఇచ్చిన సమాధానం వాస్తవం కాదని తర్వాత కేంద్ర మంత్రి కి దృష్టికి తీసుకెళ్లిన నామా నాగేశ్వరరావు. వాస్తవం తెలుసుకుని నామాకు క్షమాపణలు కోరిన కేంద్ర మంత్రి. గురువారం తానిచ్చిన సమాధానాన్ని సరిచేసుకుంటున్నట్లు లిఖిత పూర్వకంగా నామాకు లేఖ వ్రాసిన కేంద్ర మంత్రి మనసుఖ్ మాండవీయ.

అంతర్జాతీయ క్రీడా పోటీల్లో ఆర్టీసీ కి పతకాల పంట్ట

అంతర్జాతీయ క్రీడా పోటీల్లో ఆర్టీసీ కి పతకాల పంట్ట
హైదరాబాదు 22డిసంబర్2022

అంతర్జాతీయ క్రీడా పోటీల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు అభినందించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మలేషియాలోని కౌలాలంపూర్లో ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2022 పోటీల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని ఉద్యోగులు 9 పతకాలను గెలుపొందారు. మంజుల తివారీ హైజంప్ లో సిల్వర్, మిడ్ రిలేలో గోల్డ్, రిలే 4X100 సిల్వర్, సోమశ్వేర్ రావుకు లాంగ్ జంప్, ట్రిబుల్ జంప్ లో,స్వరాజ్య లక్ష్మికి 400, 800 మీటర్లలో సిల్వర్ లు, మిడ్ రిలేలో గోల్డ్, రిలే 4X100 సిల్వర్ పతకాలను కైవసం చేసుకున్నారు.వివిధ కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో లభించాయి. అంతర్జాతీయ అథ్లెటిక్ పోటీల్లో ఆర్టీసీ ఉద్యోగులు సత్తా చాటి 9 పతకాలు సాధించడంపై సజ్జనర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పతకాలు సాధించిన మంజుల తివారీ, సోమేశ్వర్ రావు, స్వరాజ్య లక్ష్మిలను హైదరాబాద్ లోని తన కార్యాలయంలో గురువారం ఆయన అభినందించారు. నిరంతర కృషితోనే క్రీడల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కృష్ణకాంత్, స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకట్ నారాయణ, కోచ్ లక్ష్మణ్ రావు, ఫిజియో హిమాన్షు కుమార్, తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష కట్టింది..

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష కట్టింది..
హైదరాబాద్ 22 డిసెంబర్2022
తెలంగాణ ఖర్చు చేసిన రూపాయలు1.50 కోట్లు రూపాయలు కేంద్ర ప్రభుత్వం వెనకకు పంపాలని ఆదేశించాలు ఇవ్వడం సరికదాని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించి పత్రిక సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రిసింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.ఉపాధి హామీ చట్టంలో పోస్ట్ ఆఫీస్ సౌకర్యం చట్టంలోని పారా 4(1) (iii) ప్రకారం అనుమతించబడిన పని అని స్పష్టంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా రాష్ట్రాలలో ఉపాధి హామీ కింద కల్లాల నిర్మాణం పనులు జరుగుతున్నవి ఒక తెలంగాణ విషయంలో కేంద్రం కక్ష కట్టిందనిఅన్నారు. తెలంగాణలో నీటివనరులు పెరగడంతో గ్రామీణ ప్రాతలలో కల్లాలు లేక రైతులు రోడ్లమీద పోస్తున్నారు.. ఉపాధి హామీ పథకం గూర్చి పార్లమెంటులో మోదీ చులకనా చేశారు..విధిలేని పరిస్థితుల్లో ఉపాధి పనిని కొనసాగిస్తున్నానరు. వ్యవసాయ రంగంలో కూలీల కొరత వస్తుందని గ్రహించి మొట్టమొదట వ్యవసాయ రంగానికి మాత్రమే ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని,2014,2019 బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో ఉపాధి హామీ ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయినదని, ఈ విషయంపై టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రణాళికం సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పలుమార్లు గుర్తు చేశారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ 2022నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి డిజిల్ పెట్రోల్ ఎరువుల ధరలు అమాంతం పెంచిందన్నారు. స్వామినాథన్ సిఫారసులకు భిన్నంగా కొత్త ఫార్ములాను అమలు చేస్తూ మద్దతు ధర ఇస్తున్నామని చెప్పడం విడ్డూరం కనీస మద్దతు ధర అమలుకు చట్టం తెస్తామని చెప్పిన ప్రధాని మోదీ పక్కన పెట్టారు. ప్రతి రైతు కు లక్ష వడ్డీ లేని రుణాల ఇస్తామని ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చిన దాకరం లేవు, బిజెపి, కాంగ్రెస్ రైతు వ్యతిరేకతతో పంజాబ్ రైతులు ఆప్ కు పట్టం కట్టారు, దేశ వ్యవసాయ రంగాన్ని కుందేలు చేయడం వెనక ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు, తెలంగాణలో రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, రైతాంగాన్ని చైతన్యం చేసి ఆత్మవిశం విశ్వాసం పెంచామని తెలిపారు. లక్ష కోట్లు ఎగ్గొట్టిన కార్పొరేట్ రుణాలు మాఫీ చేస్తున్నారు కానీ రైతులకు మాత్రం మొండి చెయ్యి చూపుతున్నారు. తెలంగాణ రైతుల కల్లాల విషయంలో కేంద్ర వైఖరిని రేపు నిర్వయించే ధర్నాలో పెద్ద ఎత్తున నిరసన తెలుపాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెస్ ప్రభాకర్ రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

నారా చంద్రబాబు నాయుడు పై ఆసక్తికరమైన కామెంట్స్…కవిత

నారా చంద్రబాబు నాయుడు పై ఆసక్తికరమైన కామెంట్స్…కవిత

తెలంగాణలో చంద్ర బాబు వచ్చి మళ్లి ఇక్కడ పార్టీ ని బలోపేతం చేయాలని చూస్తున్నాడు కానీ చుక్కలు ఎన్ని ఉన్న చంద్రుడు ఒక్కడే అన్నట్లు తెలంగాణ లో కేసీఆర్ ఒక్కడే.. టిడిపి రాజకీయాలు తెలంగాణాలో చెల్లవు.. ఇక్కడి ప్రజలు ఆలోచనాపరులు,ఆంద్ర పెత్తనం చేయాలని చంద్ర బాబు మళ్లి ఇక్కడ పార్టీని రివైవ్ చేయాలి అనుకుంటున్నాడు వాళ్లు తెలంగాణ బాగును కోరిన వాళ్ళు కాదు. టిడిపి వాళ్ళను తెలంగాణ ప్రజలు ఎప్పుడో రిజెక్ట్ చేసారు,ఇప్పుడు వచ్చి రాజకీయం చేద్దాం అనుకున్న మళ్లి రిజెక్ట్ చేస్తారు

సెస్ ఎన్నికల బ్యాలెట్ బాక్స్ ల డిస్ట్రిబ్యూషన్ కు తగిన ఏర్పాట్లు..జిల్లా కలెక్టర్

సెస్ ఎన్నికల బ్యాలెట్ బాక్స్ ల డిస్ట్రిబ్యూషన్ కు తగిన ఏర్పాట్లు..జిల్లా కలెక్టర్

వేములవాడ, 22 డిసెంబర్, 2022

ఈ నెల 24 న జిల్లా వ్యాప్తంగా జరగనున్న సెస్ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్స్ ల డిస్ట్రిబ్యూషన్ కు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ తో కలిసి వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల అవరణలో బ్యాలెట్ బాక్స్ ల డిస్ట్రిబ్యూషన్ కు చేపడుతున్న ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెస్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 252 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. దీనికోసం వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బ్యాలెట్ బాక్స్ ల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని, శుక్రవారం ఉదయం 8 గంటల నుండి బ్యాలెట్ బాక్స్ ల డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుందని తెలిపారు. మొదటగా ఎవరికి ఏ బూత్ కేటాయించారో తెలపడానికి సరిపడా సిబ్బంది అందుబాటులో ఉన్నారని, బూత్ స్థాయిలో మొత్తంగా 750 మంది సిబ్బందిని కేటాయించడం జరిగిందని, వీరితో పాటు ఇతర అధికారులు, పోలీస్ సిబ్బంది కూడా ఉంటారని అన్నారు. బ్యాలెట్ బాక్స్ ల డిస్ట్రిబ్యూషన్ కోసం 40 బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 26 వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఇదే కళాశాలలో ఉంటుందని, ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ మొదలవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. నిఘా నేత్రాల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. అంబులెన్స్, ఫైర్ ఇంజన్ లు ఈ కేంద్రంలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ సందర్శనలో ఆర్డీఓ పవన్ కుమార్, జిల్లా సహకార శాఖ అధికారి బుద్ధనాయుడు, సెస్ ఎండీ రామకృష్ణ, తహశీల్దార్ రాజు, మున్సిపల్ కమీషనర్ అన్వేష్, తదితరులు ఉన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి.. కేంద్రమంత్రి

రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి.. కేంద్రమంత్రి

మాస్క్ ధరించి రాజ్యసభకు.. మోదీ

ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నడంతోమన దేశంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్ సూక్ మాండవియ లోక సభలో కోవిడ్ని ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ విమానం కేంద్రాలలో రాపిడ్, శాంపిల్స్ సేకరణ చేస్తూ, కొత్త వేరియంట్లపై ప్రత్యేక దృష్టి సారించామని, జూలై, నవంబర్ మధ్య కాలంలో మన దేశంలో బిఎఫ్ సెవెన్ రకానికి చెందిన నాలుగు కేసులు నమోదయ్యాయని తెలిపారు. రద్దీ ప్రాంతాలలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తూ, మారుతున్న కరోనా వైరస్ ప్రపంచ ఆరోగ్య రంగానికి ప్రమాదం కరంగా మారిదన్నారు. ప్రతి కోవిడి కేసును జినామ్ సీక్వెన్సింగ్ కు పంపాలని ఇదివరకే రాష్ట్రాలకు తెలిపామని తద్వారా కొత్త వేరియంట్లు గుర్తించేందుకు వీలవుతుందని, నూతన సంవత్సర వేడుకలు, పండుగలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండి, మాస్కులు సానిటైజర్ల వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పలు రాష్ట్రాలకు సూచించారు. కరుణ మహమ్మారి నియంత్రించడంలో ఆరోగ్యశాఖ చిరుగా పనిచేస్తుందా అని తెలిపారు. రాజ్యసభలో నరేంద్ర మోదీ, లోకేష్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ తో పాటు పార్లమెంట్ సభ్యులందరూ మాస్క్ ధరించి సభకు హాజరయ్యారు.

మన ఊరు మన బడి పథకం ద్వారా అభివృద్ధి పాఠశాలల ప్రారంభం..జిల్లా కలెక్టర్

మన ఊరు మన బడి పథకం ద్వారా అభివృద్ధి పాఠశాలల ప్రారంభం..జిల్లా కలెక్టర్

జిల్లా కార్యాలయంలో సమావేశ మందిరంలో గురువారం సిద్దిపేట నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథకంలో కేటాయించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎమ్ సి చైర్మన్ లు, ఎంఈవో, ఎంపిడిఒ, ఎంపిఓ, ఇంజనీరింగ్ విభాగం ఈఈ, డిఈ, ఎఈ నిర్మాణ ఎజెన్సీ, సర్పంచ్ లు అందరితో పాలనాధికారి మండలాల్లో పాఠశాలల వారిగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో కలెక్టర్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ….స్తానిక మంత్రి హరీష్ రావు జిల్లాలో మన ఊరు మన బడి పథకం ద్వారా అవసరమైన నిర్మాణాలు చేపట్టిన పాఠశాలను జనవరి మొదటి వారంలో ప్రారంభించడం జరుగుతుందని,మన ఊరు మన బడి పథకంలో ఎలక్ట్రిసిటీ, తాగునీటి వసతి, మేజర్ మైనర్ రిపేర్లుతో పాటు ఈజీఎస్ పనులు టాయిలెట్లు, కిచెన్ షెడ్, ప్రహరీ గోడ, డైనింగ్ హల్, అదనపు తరగతి గదులు ఇతర పనులు ఉన్నాయి. నంగునూరు మండలం లో ఈ పథక పనులను త్వరగా పూర్తి చేసెందుకు డీఆర్డీఏ పిడి, పంచాయతీ రాజ్ ఈఈ లు పర్యవేక్షణ చేసి వేగంగా పూర్తి చేసెందుకు తగు సూచనలు చేశారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను తొలగించి గ్రామ పంచాయతీ లో పల్లె ప్రగతి కార్యక్రమంలో చేయ్యాలని ఎంపిడిఒ, సర్పంచ్ లకు తెలిపారు. డైనింగ్ హల్ ఎస్టిమేట్ లో లోపాలు ఉంటె డిఇఓ వెరిపై చేయ్యాలన్నారు. పాఠశాలల్లో సేవింగ్స్ ఉంటే మైదానంలో సుందరీకరణ చేయ్యాలి మంచి గేట్, పైన ఆర్చ్ మైదానంలో కొంత గడ్డి కార్పెట్ పరచాలని, ఎంపిడిఒ, ఎంపిఓ లు ఈజీఎస్ పనులపై పర్యవేక్షణ చేయ్యాలి. పనులు పూర్తి అయ్యేవరకు సమావేశాలు నిర్వహిస్తూనే ఉంటాం అన్నారు. మళ్లీ సమావేశంలోపు పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పిడి గోపాల్ రావు, డిఇఓ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పలు అభివృద్ధి పనులకు ప్రారంభించి.. ఎమ్మెల్యే సతీష్ కుమార్

పలు అభివృద్ధి పనులకు ప్రారంభించి.. ఎమ్మెల్యే సతీష్ కుమార్

హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహెడ మండలం పలు అభివృద్ధి పనులకు ప్రారంభించి చేసిన హుస్నాబాద్ శాసనసభ్యులు సతీష్ కుమార్ గురువారం తంగళ్ళపల్లి నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ చేశారు. శనిగరంలో మున్నూరు మున్నూరు కాపు సంఘానికి 20గుంటల భూమి కేటాయింపు పత్రాన్ని సంఘ సభ్యులకు అందజేసి, మిని ఫంక్షన్ హాలు నిర్మాణానికి ప్రభుత్వం తరఫున నిధులు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శనిగరంలోనీ మినీ రిజర్వాయర్లో 12లక్షల 12వేల రూపాయల విలువగల 4లక్షల 94 వేల రొయ్య పిల్లలను చెరువులోకి విడుదల‌ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి,ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్, జెడ్పిటిసి నాగరాజు శ్యామల మధుసూదన్ రావు, ఫ్యాక్స్ చైర్మన్ పేరియాల దేవేందర్ రావు, వైస్ ఎంపీపీ తడకల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీసేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికై కృషి.. మంత్రి హరీష్ రావు..

మీసేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికై కృషి.. మంత్రి హరీష్ రావు హామీ…


సిద్దిపేట జిల్లా మీసేవ ఆపరేటర్ల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కి మద్దతుగా హైదరాబాద్ లో గురువారం మంత్రి హరీష్ రావు నివాసంలో విరాళం అందించారు. ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేస్తున్నమీసేవ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రికి వివరించారు. కులాలు, ఆదాయం, మరియు మీ సేవ సంబంధించిన సర్వీసులు మీసేవ దరఖాస్తు చేసి సంబంధిత డాక్యుమెంటులు ఆఫీసులకు స్కాన్ చేసి పంపడం జరుగుతుందని, అధికారులు మళ్లీ ఫిజికల్ కాపీలు కావాలి అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మంత్రి హరీష్ రావు దృష్టికితీసుకెళ్లారు. దీనికి మంత్రి స్థానుకులంగా స్పందించి, సమస్యలు పరిష్కారానికై కృషి చేస్తానని మంత్రి ఇచ్చారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా విరాళం మీసేవ ఆపరేటర్లు మంత్రి హరీష్ రావుకు ఇచ్చారు. కార్యక్రమంలో TMSA అధ్యక్షులు నాగరాజు, ఉపాధ్యక్షులు యూసఫ్, ఆడెపు మహేష్ తోట శ్రీకాంత్,వెంకట్, నవీన్ బాబు ఆంజనేయులు మంతపురి చంద్రం అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...