34.2 C
Hyderabad
Wednesday, April 22, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 149

పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏబివిపి ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో..

పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏవిపి ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో..

సిద్దిపేట జిల్లా కేంద్రంలో గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా రాస్తారోకో చేపట్టినారు. అంబేద్కర్ చౌరస్తా ప్రధాన కూడలి కావడంతో. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులను విద్యార్థులను శాంతింప చేసే ప్రయత్నం చేసిన విద్యార్థులు సస్య మీరా అంటూ వినకపోవడంతో పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు

తూర్పుగోదావరి జిల్లా ఒమిక్రాన్ కేసు..!

తూర్పుగోదావరి జిల్లా ఒమిక్రాన్ కేసు..!

కోనసీమలోని అయినవిల్లి మండలం నేదునూరి సావరం గ్రామంలో మొదటి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్దారణ… సోమవారంన19వ తేదీన కువైట్ వచ్చిన మహిళ పి.గన్నవరం ఎయిర్ పోర్టులో సాధారణ కరోన శాంపిల్ సేకరణ, అక్కడ కోనసీమ వైద్యులకు సమాచారు.బుదవారం అర్ధరాత్రి ఒమిక్రాన్ నిర్దారించిన వైద్యాధికారులు.రెండు వాక్సిన్లు వేయించుకుని కువైట్ వెళ్లి వచ్చిన మహిళ…అప్రమత్తం అయిన అధికారులు, కుటుంబ సభ్యులకు మరోసారి కరోనా పరీక్షలు చేస్తున్నారు. భయాందోళనలో కోనసీమ పరిసర గ్రామా ప్రజలు.

ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందలి..

ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందలి..
సిద్దిపేట 21 డిసెంబర్ 2022
తెలంగాణలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించి ప్రజాల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ కోరారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం సీనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం అందజేశారు.. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తు, రాష్ట్రంలో పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన సామాన్య ప్రజలకు ఉండడానికి ఇల్లు లేక బిక్కుబిక్కుమంటూ జీవనం గడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిజమైన అర్హులను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు అర్హులను గుర్తించి ఉండడానికి ఇల్లు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది, అధికారుల సహాయంతో అర్హులను గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సొంత స్థలాలలో ఇల్లు నిర్మించుకోవడానికి ఆరు లక్షల ఇచ్చి, ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. ఆసరా పెన్షన్ ఆసరాగా తీసుకొని గద్దెనెక్కినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన వారికి కొత్తగా పెట్టుకున్న అసరా పెన్షన్లు అవి కాగితాలకే పరిమితమైన తప్ప ఇప్పటివరకు ఏ ఒక్క లబ్ధిదారునికి ఇవ్వలేనటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్నికల మేనిఫెస్టో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని గొప్పలు చెప్పి ఇప్పటివరకు కూడా రైతుల రుణమాఫీ చేయకపోవడం చాలా సిగ్గుచేటుతన్నారు. రైతులు బ్యాంకులలో తెచ్చుకున్న క్రాప్ లోన్ ప్రతి ఏటా రెన్యువల్ చేసుకోవడానికి అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నారని, కొత్త రేషన్ కార్డు, ప్రభుత్వం ఇస్తానన్న దళిత బంధు, దళితులందరికీ వర్తింప చేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల అండ లేకుండా ప్రభుత్వ అధికారుల ద్వారానే ఎంపిక చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజులలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు కిష్టపురంలక్ష్మణ్, శంకర్, బన్సీలాల్, ఎస్కె ఆరిఫ్ పిట్ల మల్లేశం, కర్నాల చంద్రం తపనపల్లి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

ముమ్మరంగా తిరుపతి రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణం పనులు..

ముమ్మరంగా తిరుపతి రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణం పనులు..

  • ముమ్మరంగా కొత్త స్టేషన్ భవన నిర్మాణం
  • 60% మేర భవన నిర్మాణం పనులు పూర్తి.
    తిరుపతి రైల్వేస్టేషన్‌ అప్‌గ్రేడేషన్‌ కోసం ఈ పి.సి విధానంలో సుమారు 300 కోట్ల వ్యయంతో, నిర్ణిత గడువు ఫిబ్రవరి 2025 నాటికి పూర్తి చేసి రాబోయే 40 సంవత్సరాలకు అనుగుణంగా ప్రయాణీకుల అవసరాలను దృష్టితో స్టేషన్ పనులు జరుగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఇప్పటికే తిరుపతి రైల్వేస్టేషన్‌కు దక్షిణం వైపున పనులు, కొత్త స్టేషన్‌ భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. జియోలాజికల్ సర్వే పూర్తయిన తర్వాత, క్యాంప్ ఆఫీస్, కాంక్రీట్ ల్యాబ్, స్టోరేజ్ షెడ్‌ల పనులు జరుగుతున్నారు. భూగర్భ పార్కింగ్, బేస్మెంట్ నిర్మించేందుకు పనులు దాదాపు పూర్తయ్యాయి.తిరుపతి స్టేషన్ పునరాభివృద్ది కి సంబందించిన ప్రతిపాదిత నమూనాను స్టేషన్ ప్రవేశద్వారం వద్ద సాధారణ ప్రజలకు ప్రదర్శన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. బుధవారం విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్‌ని సందర్శించారు. రైల్లో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తిరుపతి స్టేషన్‌ను అప్‌గ్రేడేషన్ పనులపై ప్రత్యేక దృష్టి సారించామనరు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రతి దశలో పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నమని, నిర్మాణ సంస్థకు పూర్తి సహకారం అందించాలని రైల్వే అధికారులకు, సిబ్బందిని ఆదేశించారు

ఆర్థికంగా ఎదగడానికి..దళిత బంధు..

ఆర్థికంగా ఎదగడానికి..దళిత బంధు..
సిద్దిపేట 21 బుధవారం 2022.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు రాష్ట్ర అడ్వైజర్ వి.లక్ష్మారెడ్డి పథకాన్ని బుధవారం చిన్నకోడూరు మండలం చెల్కకలపల్లి, నారాయణరావుపేట మండలం బంజేరుపల్లి గ్రామాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దళిత బంధు ద్వారా వచ్చిన పౌల్టిఫామ్స్, డైరీ ఫార్మ్స్,ఇతర పథకాలను సందర్శించి,లబ్ధిదారులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు పథకమును లబ్ది పొందిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు అందుకున్న దళిత బంధు లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడి రామాచారి, మండల స్థాయి అధికారులు, నాయకులు పాల్గొన్నారు

తెలంగాణ లో గర్భిణీలకు వరంగా మరో అద్భుతమైన పథకం..

తెలంగాణ లో గర్భిణీలకు వరంగా మరో అద్భుతమైన పథకం…


తొమ్మిది జిల్లాలోని సుమారు 1.25 లక్షల మంది గర్భిణీలకు ఉపయోగపడే విధంగా కేసిఆర్ న్యూట్రిషన్ కిట్లు నేటి నుంచి పంపిణీ ,ఆయా జిల్లాలో జరిగే కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రులు ప్రజాప్రతినిధులు
కామారెడ్డి కలెక్టరేట్ నుంచి ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తో కలిసి వర్చువల్ మోడ్ లో ప్రారంభిస్తారు, ఇదే సమయంలో మిగతా 8 జిల్లాలలో జరిగే కార్యక్రమంలో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. అత్యధికంగా రక్తహీనత ప్రభావం ఉన్న తొమ్మిది జిల్లాలు కొమరం భీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్, అదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, లలో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది.

బాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం…

బాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం..

చలో ఖమ్మం బహిరంగ సభ నేపథ్యంలో వనస్థలిపురం పనామా చౌరస్తాలో పూల మాలతో ఘన స్వాగతం పలికిన  టిడిపి నేతలు. పూల మాల జారీ పక్కన పడడంతో నారా చంద్రబాబు నాయుడుకు తప్పిన  ప్రమాదం

బాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం..

కోవిడ్  కొత్త వేరియంట్లపై.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక…

కోవిడ్  కొత్త వేరియంట్లపై.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక…

పలు దేశాల్లో కోవిడ్‌ కేసులు భారీగా కావడంతో ప్రపంచం కలవరపెడుతోంది. విదేశాల్లో కరోనా కేసుల పెరుగుదలపై భారత్‌ అప్రమత్తమైంది. కోవిడ్‌ కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని, పాజిటివ్‌ కేసుల నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాలని తెలిపింది.   జపాన్‌, అమెరికా, కొరియా, బ్రెజిల్‌, చైనాలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్లను ఇన్సకాగ్‌ నెట్‌వర్క్‌ ద్వారా ట్రాక్‌ చేసేందుకు పాజిటివ్‌ కేసుల నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపే ప్రక్రియను వేగవంతం చేయాలని, కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ వివరించింది, దానికి తగినట్లుగా వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురాగలుగుతాం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషన్‌కేంద్ర వివరించఋ. ప్రజాగ్రహంతో ఇటీవలే కరోనా ఆంక్షలను సడలించింది చైనా. దీంతో రోజువారి కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వచ్చే మూడు నెలల్లో ఆ దేశ జనాభాలో 60 శాతం మంది ప్రజలు కోవిడ్‌ బారినపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. జపాన్‌, అమెరికా, కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 35 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో మంగళవారం 112 కొత్త కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 3,490 ఉన్నాయి.

ట్రయల్ రన్ నిర్వహింసిన..పోలిస్ కమిషనర్

ట్రయల్ రన్ నిర్వహింసిన..పోలిస్ కమిషనర్

సిద్దిపేట కమిషనరేట్ పోలీస్ పెరడ్ గ్రౌండ్లో దేహదారుడ్య ట్రయల్ బుధవారం రన్ నిర్వహించడం జరిగిందని కమిషనర్ శ్వేతా తెలిపారు. ట్రయల్ రన్ భాగంగా నాలుగు గంటల వరకు వచ్చిన అభ్యర్థులకు రన్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ నిర్వహించారు.మోసపూరిత మాటలు నమ్మి మెసపోవద్దు, పరీక్షలకు సంబంధించి ఎవరైనా దళారులుగా ఉద్యోగం, క్వాలిఫై చేయిస్తామని మిమ్మల్ని ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తే వెంటనే చీప్ సూపర్ండెంటుకు సమాచాలన్నారు. అత్యంత పారదర్శకంగా జరుగుతున్న ఈ పరీక్షలలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదని అభ్యర్థులందరికీ తెలియజేస్తున్నాం. పోలీస్‌ ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా కొనసాగుతోందని ప్రతి అంశం టెక్నాలజీతో ముడిపడి ఉంటుందని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏఆర్ అడిషనల్ డిసిపిలు సుభాష్ చంద్రబోస్ రామచందర్రావు సిద్దిపేట ఏసీబీ దేవా రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ట్రయల్ రన్

షార్ట్ పుట్

వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య..డీసీపీ రూపేష్

వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య..డీసీపీ రూపేష్

పెద్దపల్లి 20 డిసంబర్ 2022

వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యంగా ఆపరేషన్ ధ్రువ ప్రాజెక్టు పేరుతో ధృవ పాఠశాలలు ప్రారంభించినట్లు పెద్దపల్లి డీసీపీ రూపేష్  తెలిపారు. పెద్దపల్లి మండలం గౌరెడ్డి పేట ఇటుక బట్టి లో మంగళవారం ధృవ పాఠశాలను ప్రారంభించి ఈ సందర్బంగ మాట్లాడుతూ వలస కార్మికులు పొట్ట కోటి కోసం స్వరాష్ట్రం వదిలి ఇతర రాష్టాల నుండి  ఇటుక బట్టీ లలో పని చేసేందుకు వచ్చారని, కార్మికులతో పాటు వారి పిల్లలు విద్యాభ్యాసం మాని బట్టిల్లో పని చేయడం జరుగుతోందన్నారు.  వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని యజమానులతో ఇటుకబట్టి యజమానులు సహకారంతో కార్పొరేట్ స్థాయి విద్య అందించాలని దృడ సంకల్పంతో ధృవ పాఠశాలలు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసిపి సారంగపాణి, సిఐ లు ప్రదీప్ కుమార్, ఇంద్ర సేనా రెడ్డి, అనిల్ కుమార్, ఎస్ఐ లు రాజేష్, శ్రీనివాస్, మౌనిక, బట్టి యజమానులు ప్రదీప్, వెంకన్న, శ్యామ్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...