29.2 C
Hyderabad
Wednesday, April 22, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 150

బైండోవర్ నిబంధనలు అతిక్రమిస్తే మల్లి జైలుకే..

బైండోవర్ నిబంధనలు అతిక్రమిస్తే మల్లి జైలుకే..

మంచిర్యాల 20 డిసంబర్2022

నిబంధనలు అతిక్రమించి మళ్లీ నేరం చేసినందుకు 2,00,000 రూపాయలు జప్తు చేయించిన మంచిర్యాల ఇన్స్పెక్టర్ నారయణ నాయక్ మంచిర్యాల లోని చున్నంబట్టివాడ ఏరియ కు చెందిన పురాణం రమేష్ తండ్రి పెంటయ్య పాత సామాను దొంగ సొత్తు అని తెలిసి కూడా వాటిని నిల్వ చేసుకొని అక్రమంగా తరలిస్తున్నాడని పురాణం రమేష్ పై కేసు నమోదు చేయశారు. మరొకసారి ఇలాంటి నేరం చేయొద్దని అతన్ని మంచిర్యాల ఎమ్మార్వో దగ్గర 30/11/2022 రోజున 2,00,000 రూపాయలు జప్తుకు బైండోవర్ చేయడం జరిగిందని తెలిపారు. బైండోవర్ చేసిన నిబంధనలు ధిక్కరించి 13.12.2022 రోజున మళ్ళీ నేరం చేసినందుకు మంగళవారం మంచిర్యాల ఎమ్మార్వో ముందు పురాణం రమేష్ తండ్రి పెంటయ్య, వయస్సు 45 సంవత్సరాలు, కులం: బెడ బుడగ జంగం, వృత్తి: స్క్రాప్ బిజినెస్, చున్నంబట్టివాడ అను అతనిని ని హాజరుపరచగా రెండు లక్షల రూపాయలు కట్టవలసిందిగా నోటీసు ఇవ్వడం జరిగింది. ఇకనుండి మంచిర్యాల లో ఎవరైనా దొంగ సొత్తు అని తెలిసి కొన్న, అక్రమ రవాణా చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇదివరకు బైండోవర్ అయినవారు మళ్లీ నేరం చేసినట్లయితే వారి నుండి రెండు లక్ష రూపాయలు జప్తు చేయించడం, వారి మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుందని ఇన్స్పెక్టర్ నారాయణ తెలిపారు.

లేచిపోయి..ఒకటైయారు

లేచిపోయి..ఒకటైయారు

రాజన్న-సిరిసిల్ల 20 డిసెంబరు 2022

రాజన్న-సిరిసిల్ల జిల్లలో యువతి కిడ్నాప్‌ కేసులో భారీ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తాను జ్ఞానేశ్వర్‌ (జానీ) అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది షాలిని. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని పేర్కొంది. ఇష్టపూర్వకంగానే జానీతో వెళ్లినట్లు తెలిపింది. ఈ మేరకు పెళ్లి దుస్తులతో ఉన్న, ఫోటోలను, వీడియో విడుదల చేసింది.‘జానీ నేను నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారనే జానీతో వెళ్లా. రహస్య ప్రదేశంలో జానీని పెళ్లి చేసుకున్నా. నా తల్లిదండ్రుల నుంచి ప్రాణహానీ ఉంది’ అని వీడియోలో తెలిపింది. కాగా జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో శాలిని అనే యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. శాలినికి సోమవారమే ఎంగేజ్‌మెంట్ అవ్వగా .. మంగళవారం తెల్లవారుజామున  తండ్రి చంద్రయ్యతో కలిసి శాలిని  హనుమాన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా నలుగురు యువకులు ఆమెను లాక్కెళ్లారు. గుడి ముందు  కాపుకాసి యువతి తండ్రిని కొట్టి ఆమెను తీసుకెళ్లారు. అయితే అందరూ యువతిని కిడ్నాప్‌ చేశారని భావిస్తుండగా.. తానే స్వయంగా వెళ్లిన్నట్లు షాలిని వేలదించింది.

అభివృద్ధిని చూసి ఆకర్సితులైన ప్రజలు

అభివృద్ధిని చూసి ఆకర్సితులైన ప్రజలు

రాజన్న-సిరిసిల్ల 20 డిసెంబరు 2022

అభివృద్ధిని చూసి ఆకర్షితులైన ప్రజలు మంగళవారం సిరిసిల్ల జిల్లా వేములవాడలో రూ. 20 కోట్లతో చేపట్టనున్న VTDA, TUIFDC పనులకు, రూ.52 కోట్లతో చేపట్టనున్న ఆర్ అండ్ బి, పంచాయితీ రాజ్ రెన్యువల్ పనులకు డా సినారె కళా మందిరం అవరణలో మంత్రి కే తారక రామారావు శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మనము అన్ని రకాల అభివృద్ధిని సాధించుకున్నాం అది చూసి సరిహద్దు గ్రామాల ప్రజలు మన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మహారాష్ట్ర కు చెందిన 14 గ్రామాల సర్పంచ్ లు, కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ ప్రజలు తమ గ్రామాలను తెలంగాణ లో విలీనం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి నీ పదే పదే కోరుతున్నారనీ మంత్రి కే తారక రామారావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇక్కడేమో కొందరు విమర్శకులు పొద్దున లేస్తే కేసీఆర్‌ను తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాయి.. వారు శాప‌నార్థాలు పెడితే.. మీరే కాపాడాలి. మీ ఆశీస్సులు ఉంటే.. కేసీఆర్‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ రావుల శ్రీధర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.

కేంద్ర బీజేపీపై మంత్రి హరీశ్ ధ్వజం

కేంద్ర బీజేపీపై మంత్రి హరీశ్ ధ్వజం

సిద్దిపేట 20 డిసెంబరు 2022

సిద్ధిపేట జిల్లా పరిషత్ సమావేశంలో కేంద్ర బీజేపీపై మంత్రి హరీశ్ ధ్వజంమేతారు మంగళవారం జిల్లా కేంద్రమైన రెడ్డి సంక్షేమ సంఘం భవన్ లో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య నిర్వహించారు  ఈసమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిర్మిచిన రైతు కల్లాలపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం కయ్యం పెడుతున్నదని రాష్ట్రంలో ఈజీఏస్ ద్వారా నిర్మించిన రైతు కల్లాల డబ్బులు 150 కోట్లు తిరిగి వెనక్కి ఇవ్వాలని పేచీ పెడుతున్నదని కేంద్రం ప్రభుత్వం కోడిగుడ్డు పై ఈకలు పీకేలా కేంద్రం వ్యవహరిస్తోందని మంత్రి విమర్శించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లాలోని అన్నీ మండలాల ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరయ్యారు.

విమానాశ్రయ నిర్మాణసమస్యను పార్లమెంటులో లేవనేత్తిన..ఎంపీ శ్రీ జీవీఎల్

విమానాశ్రయ నిర్మాణసమస్యను పార్లమెంటులో లేవనేత్తిన..ఎంపీ శ్రీ జీవీఎల్  

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.2500 కోట్ల పెట్టుబడి , భోగాపురం విమానాశ్రయం ప్రారంభం అయిన తరువాత  30 ఏళ్ల పాటు విశాఖపట్నం  ప్రస్తుత ఎయిర్‌పోర్టులో కార్యకలాపాల నిలిపివేత…ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు  కేంద్ర సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ లికితపుర్వక సమాధానం.. మంగళవారం రాజ్యసభలో ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు  భోగాపురం విమానాశ్రయంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి  జనరల్ లికితపుర్వక  సమాధానమిస్తూ  భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధికి భారత ప్రభుత్వం జనవరి, 2016లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (GoAP) నిర్మాణ ప్రాంతానికి అనుమతులు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం ‘సూత్రప్రాయంగా’  భారత ప్రభుత్వం అక్టోబర్, 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించిందనీ, భోగాపురం విమానాశ్రయాన్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  చేపట్టిందని, విమానాశ్రయం అభివృద్ధికి  సుమారు 2203 ఎకరాల భూమి అవసరమని, విమానాశ్రయం యొక్క మొదటి దశ నిర్మాణం ద్వారా సంవత్సరానికి 6 మిలియన్ల ప్రయాణీకులకు ప్రయాణ సేవలను అందించగలదని మంత్రి తెలిపారు. విమానాశ్రయ అభివృద్ధికి ప్రాథమిక అంచనా వ్యయం సుమారుగా  రూ. 2500 కోట్లు అని, విమానాశ్రయ పూర్తి నిర్మాణం  భూసేకరణ, తప్పనిసరి అనుమతుల లభ్యత, ఆర్థిక మూసివేత వంటి అనేక అంశాలపై, రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం, భోగాపురం విమానాశ్రయం ప్రారంభం తరువాత ప్రస్తుత వైజాగ్ నేవల్ ఎయిర్‌ఫీల్డ్‌లోని 373 ఎకరాల  విశాఖపట్నం విమానాశ్రయం తిరిగి AAI కి అప్పచెప్పబడుతుందని మంత్రి  తెలిపారు.

ఉచిత అంబులెన్స్ ప్రారంభం..

ఉచిత అంబులెన్స్ ప్రారంభం..

జిల్లాపరిషత్ నిధుల నుండి మంజురైన ఉచిత అంబులెన్స్ బొమ్మల రామారం మండల కేంద్రంలో మంగళవారం ప్రారంభించిన ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉచిత అంబులెన్స్ నిర్వహణ కోసం ఎంపీటీసీలు, సర్పంచులు వారి 2 నెలల, ప్యాక్స్ ఛైర్మెన్ బాలనర్సయ్య వారి 6 నెలల, ప్యాక్స్ డైరెక్టర్ కొండూజు ఆంజనేయులు రూ.10000లుఇవ్వడం అభినందనీయమని, ఇంకా ఎవరైనా దాతలు ముందుకువచ్చి ఈ కార్యక్రమంలో తమ వంతు సహాయాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్,మండలంలో ఎంపీటీసీ లు, సర్పంచులు, ప్యాక్స్ ఛైర్మెన్, డైరెక్టర్,ఇంచార్జి ఎంపీడీఓ ,వైద్య, పోలీలు తదితరులు పాల్గొన్నారు.

పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం..మల్లు రవి

పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం..మల్లు రవి

సోషల్ మీడియా లో కాంగ్రెస్ పార్టి నాయకులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే కట్టినా చర్యలు తప్పవు. పార్టీలోక్రమశిక్షణ ముక్యమని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. ఈ విషయాన్ని గతంలో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. పార్టి ఆదేశాలను, నాయకులు, క్యాడర్ తు.చ తప్పకుండా పాటించాలన్నారు. సామాజిక మాద్యమాలలో పార్టీకి, నాయకులకు వ్యతిరేకంగా ఎవ్వరు పోస్టులు పెట్టినా చట్టపరమైన, పార్టీ పరమైన చర్యలు ఉంటాయి.

జగన్ పుట్టినరోజున..విద్యార్థులకు శుభవార్త

జగన్ పుట్టినరోజున..విద్యార్థులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజున డిసెంబర్ 21 పురస్కరించుకుని వైసిపి పార్టీ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. వస్త్ర దానాలు పేదలకు పండ్లు పంపిణీ వంటివాటిని చేపట్టడానికి ఇప్పటికే వైసీపీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా ట్యాబులను అందజేయనుంది. డిసెంబర్ 21వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్కు 50 ఏళ్లు నిండనున్నాయి ఈ ‘గోల్డెన్ జూబ్లీ’ సందర్భాన్ని పురస్కరించుకుని వైసీపీ ప్రభుత్వం పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ట్యాబ్లను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. జూన్లో వైసీపీ ప్రభుత్వం ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ.. బైజూస్ తో మౌలిక అవగాహన భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను అందజేయనుంది. ఈ విద్యా సంవత్సరం సగాన్ని దాటిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న దాదాపు 4.7 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థులకు ఈ ట్యాబ్ అందిస్తామని విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. విద్యార్థులకు అందించే ట్యాబ్.. శాంసంగ్ ఏ7. ఇది 8.8 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంటుంది. దీని ప్రస్తుత మార్కెట్ ధర రూ.14000 నుండి రూ.15000 వరకు ఉంటుందని చెబుతున్నారు.ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ట్యాబ్ల కోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేస్తోంది. ట్యాబ్ పొందిన ప్రతి విద్యార్థికి కోడ్ ఇస్తామని కమిషనర్ సురేష్కుమార్ తెలిపారు. “విద్యార్థి ట్యాబ్తో ఏమి చేసినా సర్వర్లో నిక్షిప్తమై ఉంటుంది. దీన్ని ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తారు. విద్యార్థులు ట్యాబ్ను గరిష్టంగా వినియోగించుకుని తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని భావిస్తున్నాం” అని కమిషనర్ సురేష్ అన్నారు.

తెలంగాణలో అన్నిమతాలు సమానమే..

తెలంగాణలో అన్నిమతాలు సమానమే..
గజ్వేల్ 19 డిసెంబరు 2022
నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ క్రైస్తవ భవన్ లో సోమవారం క్రిస్మస్ పండగా సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రైస్తవులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు బట్టలు పంపిణీ చేశారు. అన్నీ మతాలు సమానమని, అందరూ సంతోషంగా ఉండాలని, పేదలకు సాయం చేసేందుకు కులం, మతం అడ్డుకారాదనేదే సీఎం కేసీఆర్ సంకల్పం అని, ప్రభుత్వ పరంగా ఘనంగా జరుపుతున్నారని, మీరంతా బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కోరారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని క్రైస్తవ సోదర, సోదరీమణులకు విందు భోజనం నిర్వహించారు. ప్రపంచంలో అతి ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ అని, డిసెంబరు నెల క్రైస్తవులకు పవిత్ర క్రిస్మస్ మాసం అన్నారు. అనంతరం 40 మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా లైబ్రరీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, గడ ముత్యం రెడ్డి, క్రైస్తవ ప్రతినిధులు-ఫాస్టర్స్ రూబెన్, మాణిక్ రావు, బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు

క్రీడలతో మానసిక వికాసం శారీరక దారుడ్యం

క్రీడలతో మానసిక వికాసం శారీరక దారుడ్యం
సిద్దిపేట 19 డిసెంబర్ 2022
ఒక క్రీడల్లో మాత్రమే కులం, మతం, జాతి, అనుభేదం లేదు..


గెలుపుతో పొంగిపోకుండా, ఓడినప్పుడుబాధపడకుండదు..


క్రీడలతో మానసిక వికాసంతో పాటు శారీరక దారుడ్యం లభిస్తుందని, గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా విద్యార్థులు చదువులతో పాటు క్రీడలలో ముందుండాలని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. సిద్దిపేట కేంద్రీయ విద్యాలయ సెకండ్ ఆన్యూవల్ స్పోర్ట్స్ డే సందర్భంగా సోమవారం జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుందని సిద్దిపేట పట్టణంలో మరియు తదితల పట్టణాలలో స్పోర్ట్స్ గురించి స్థలాలను కేటాయించి యువతను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీష్ రావు కృషితో క్రీడలకు స్పోర్ట్స్ కు పెద్దపీట వేయడం జరుగుతుందని, వారిని ప్రోత్సహించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు కోసం రోజుకు ఒక గంట వాకింగ్ యోగ మెడిటేషన్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు. రాష్ట్రస్థాయిలో దేశస్థాయిలో ప్రపంచ స్థాయిలో చరిత్ర సృష్టించిన వారి జీవిత చరిత్రలు చదివి వారిని అనుసరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాలయ ప్రిన్సిపల్ మార్కండేయులు, అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...