క్రీడలను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్..
నర్సాపూర్ 19 డిసెంబరు 2022
క్రీడలతో మానసిక వికాసంతో పాటు శారీరక దారుడ్యం లభిస్తుందని, విద్యార్థులు చదువులతో పాటు క్రీడలలో ముందుండాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. దివంగత వాకిటి లక్ష్మారెడ్డి 60 వ స్మారక జయంతి సందర్భంగా నర్సాపూర్ లోని బి.వి.ఆర్.ఐ.టి కళాశాలలో ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చైర్మన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి తో కలిసి ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సెల్ఫోన్ రాకతో యువత మొత్తం ప్రభావానికి గురయ్యారని.. ఆటలు, పాటలు మర్చిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు… తమ చిన్ననాటి కాలంలో కబడ్డీ, వాలీబాల్ , క్రికెట్, కోకో చిర్రగోనే, చెట్టిరిక తదితర ఆటలు ఆడే వారమని ఆయన గుర్తుచేసుకున్నారు.క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నారని, గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం జరిగిందని,యువత చదువులతోపాటు క్రీడలపై దృష్టి సారించాలని, లేని పక్షంలో ఊబకాయంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు..రోడ్లు ప్రమాదాల్లో 90 శాతం హెల్మెట్ ధరించకపోవడం మూలంగా ప్రాణాలు కోల్పోవాల్సి వొస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు..బైక్ మీద వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ,సెల్ఫోన్లో మాట్లాడొద్దనిఅన్నారు. ఆయన ఈసందర్భంగా కాసేపు ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చైర్మన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి లతో కలిసి వాలీబాల్ ఆట ఆడుతూ..యువతను ఉత్సాహ పరిచారు..
క్రీడలను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్..
తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ 2022-23
తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ 2022-23
తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ 2022-23 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింలు , సిక్కులు , పార్సీలు , బౌద్ధులు & జైనులు , అర్హులైన & ఆసక్తిగల మైనారిటీ కమ్యూనిటీల నుండి రాయితీ ద్వారా ఆర్థిక సహాయం అందించడం కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది . రాష్ట్రంలోని మైనారిటీ కమ్యూనిటీల ఆర్థికాభివృద్ధి మరియు సాధారణ అభ్యున్నతి కోసం వ్యాపార యూనిట్లు మరియు వ్యాపార విభాగాల ఏర్పాటు మరియు అభివృద్ధి కోసం కార్పొరేషన్ యొక్క ఆర్థిక మద్దతు పథకం కింద బ్యాంక్ లింక్డ్ మరియు నాన్ – లింక్డ్ రుణంతో జీవించుట కొరకు . > అర్హత ప్రమాణం : 1 ) అభ్యర్థి మైనారిటీ వర్గానికి చెందినవారై ఉండాలి . 2 ) అభ్యర్థి 21 నుండి 55 సంవత్సరాల వయస్సులో ఉండాలి . 3 ) గ్రామీణ ప్రాంతాల వారి వార్షిక ఆదాయం రూ.150000- మరియు పట్టణ ప్రాంతాల వారి వార్షిక ఆదాయం రూ .200000 కంటే తక్కువ ఉండాలి . 4 ) అభ్యర్థి ఆధర్ కార్డు కాపీ . 5 ) తెల్ల రేషన్ కార్డు / ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగి ఉండాలి . అభ్యర్థులు ఆన్ లైన్ Website : http://tsobmms.cgg.gov.in లేదా TSMFC Website : tsmfc.in లో తేది : 19-12-2022 నుండి 05-01-2022 వరకు దరఖాస్తు చేసుకోవాలి . దరఖాస్తు చేసుకున్న వారు ( గ్రామీణ ప్రాంతాల వారు సంబంధిత మండలంలోని MPDO కార్యాలయం లో మరియు పట్టణ ప్రాంతాల వారు సంబందిత మున్సిపాలిటీ కార్యాలయం లో ) పైన తెలిపిన ప్రతులను జతపరిచి సమర్పించాలి . ఇతర వివరాలకు అన్ని జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించగలరు
ప్రజావాణిలో సత్వరమే పరిష్కరం..కలెక్టర్ అనురాగ్
ప్రజావాణిలో సత్వరమే పరిష్కరం..కలెక్టర్ అనురాగ్
సిరిసిల్ల, 19 డిసెంబర్, 2022
ఫిర్యాదుల పరిష్కారంపై సంబంధిత విభాగాల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ తో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సర్వారమే పరిష్కరించడంపై దృష్టి సారించాలని అన్నారు. ప్రజల సమస్యలపై స్పందించి సత్వర న్యాయం చేయాలని, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల వినతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు, పవన్ కుమార్, అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు.
ఐక్యతకే మన బలం..కొండ దేవయ్య
యదార్థవాది సిద్దిపేట 18 డిసెంబర్ 2022.
రాష్టంలో అత్యధికం శాతంలో ఉన్న మున్నూరు కాపుల్లో ఐక్యత రావాలి.. హక్కుల సాధన కోసమే చైతన్య యాత్ర చేపడుతున్నమని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన జిల్లా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షలకు పైగా ఉన్నమని, రాష్ట్ర జనాభాలో 24 శాతం ఉన్నా ఆశించిన ప్రయోజనాలు లేవన్నారు. వాస్తవానికి మున్నూరుకాపుల్లో ఐక్యతలేకనే నష్టపోతున్నామన్నారు. తెలంగాణలోని అన్ని కులాలకు ప్రభుత్వం ఏదో ఒక సంక్షేమ పథకం అమలుచేస్తూ లబ్ది చేకూరుస్తోందన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని దేవయ్య ప్రభుత్వాన్ని కోరారు. మున్నూరుకాపులు ఆర్థికంగా ఎదగాలంటే రాష్ట్ర బడ్జెట్ లో ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని తెలిపారు. కార్పొరేషన్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం, పేదలకు ఆర్థికాభవృద్ధికి చేయూత నివ్వాలని, వచ్చే సాధారణ ఎన్నికల్లో బీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యే స్థానాలలో పోటీకి మున్నూరు కాపులకు అవకాశం ఇవ్వాలని తెలిపారు. మున్నూరుకాపుల్లో ఐక్యత.. హక్కుల సాధనకోసం రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య యాత్రలను చేపట్టడం జరుగుతోందన్నారు. ఈనెల 19 సోమవారం నుండి వేములవాడలో చైతన్య యాత్ర ప్రారంభమై.. భద్రాచలం వరకూ కొనసాగుతోందనిన్నారు. వచ్చే మార్చిలో హైదరాబాద్ లో మున్నూరు కాపు గర్జన సభను భారీ ఎత్తున నిర్వహించనున్నట్టు తెలిపారు. చైతన్య యాత్రను విజయవంతం చేయడానికి రాజకీయాలకు అతీతంగా మున్నూరుకాపులు కదిలి రావాలన్నారు.జిల్లా అధ్యక్షులు నాయకం మల్లయ్య, రాష్ట్ర జర్నలిస్ట్ ఫోరం కొత్త లక్ష్మణ్, రాష్ట్ర ఉద్యోగ విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ సొప్ప పూర్ణ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కన్నుల పండుగగా కొమురవెళ్లి మల్లన్న కల్యాణోత్సవం
ఆద్యంతం మల్లన్న శరణు నామస్మరణతో తన్మయత్వం
ప్రభుత్వం తరపున బంగారు కిరీటం, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు
యదార్థవాది కోమురవెళ్లి 18 డిసెంబరు 2022 :
కోరిన వారి కోర్కెలు తీర్చే కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. కన్నుల పండువగా జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులుతీరారు. శివ శక్తులు శివాలెత్తి పోయారు. ఒగ్గు పూజారులు ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లన్న పెళ్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు మల్లన్న కల్యాణోత్సవానికై స్వామి వారికి బంగారు కిరీటం, పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను వెండి పల్లెంలో నెత్తిన పెట్టుకుని సంప్రదాయ బద్దంగా మేళ, తాళలతో వచ్చి సమర్పించారు.
బృహన్మఠాదీశుడు సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో స్వామి వారి కల్యాణం జరిగింది.
మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు మల్లన్న కల్యాణంతో ప్రారంభమయ్యాయి. యేటా మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు స్వామి వారి కల్యాణం జరగడం ఆనవాయితీగా వస్తున్నది. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం కల్యాణ మహోత్సవం జరిగింది. వధువుల తరఫున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా… వరుడి తరఫున పడిగన్నగారి వంశస్థులు కన్యాదానం స్వీకరించారు
ఈ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక జనగామ శాసన సభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి రోజా రాధాకృష్ణ శర్మ, రాష్ట్ర వైద్య సేవలు, మౌళిక సదుపాయ అభివృద్ది సంస్థ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి , ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు..
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు.. ఋణ చెల్లింపులకు సర్దుబాటు వద్దు

ప్రభుత్వ రంగ ప్రైవేట్, సహకార, చిన్న తరహా రైతులకు రుణాలు అందించే బ్యాంకులు సొమ్ము సేవింగ్ ఖాతాలో ఋణ చెల్లింపులకు సర్దుబాటు వద్దు లీడ్ జిల్లా మేనేజర్ సత్యజిత్ తెలిపారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలో తీర్మానించి జిల్లాలకు కూడా అమలుకు అదేశించినదని అన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు రైతుబంధు,దళిత బంధు, పెన్షన్, మొత్తం సొమ్ము సేవింగ్ ఖాతాల్లో జమచేసినవి ఎటువంటి ఋణ చెల్లింపులకు సర్దుబాటు చేయకూడదని..అలా జిల్లాలో ఏ బ్యాంకు వారు కానీ చేసినట్లయితే శిక్షార్హులవుతరాని తెలిపారు. అని రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ప్రాంతీయ కార్యాలయాలను అదేశించడమైనది అన్నారు.
జగన్ పులివెందుల పులి …
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు క్రీస్తు నా బిజెపితో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కు సిగ్గు లేదా అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. జనసేన పనికిమాలిన పార్టీ అని జగన్ మేక పులి పులివెందుల పులి అని అన్నారు. తమ ప్రభుత్వం పెట్రోలు డీజిల్ పన్ను పెంచలేదని అలాంటప్పుడు ఎలా తగ్గిస్తామని స్పష్టం చేశారు. ఏపీలో అధికారంలోకి రావడానికి టిడిపి బిజెపి జనసేన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.
పీజీ ఫలితాలు విడుదల…
ఏపీ పీజీ సెట్ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు ప్రవేశ పరీక్షలో 87 పాయింట్ 62 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు . గతంలో అన్ని యూనివర్సిటీల ఒకే ప్రవేశ పరీక్ష లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్న వివరించారు అర్హత సాధించిన విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సులో చేరవచ్చు అని చెప్పారు.
భారతీయ ప్రయాణికులకు శుభవార్త…
బ్రిటన్ ప్రభుత్వం భారతీయ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వ్యాక్సిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఐసోలేషన్ అవసరం లేదని అంతర్జాతీయ రాకపోకల సౌలభ్యానికి గుర్తించినట్లు వెల్లడించింది ఈ నెల 22 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని పేర్కొనగా దీంతోపాటు చైనాకు చెందిన సినో వాక్ , సినో ఫార్మ్గుకు గుర్తింపు ఇచ్చినట్లు తెలిపింది.
మెట్రో వేళల్లో మార్పు…
హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో హెచ్ ఎం ఆర్ ఎల్ మార్పులు చేసింది. రేపటి నుంచి ఉదయం ఆరు గంటలకి తొలి మెట్రో రైలు ఉదయం 6 గంటలకు ప్రారంభం కానుండగా, చివరి మెట్రో రైల్ రాత్రి 10:15 నుండి 11.15 చివరి స్టేషన్ చేరుకోనుంది.
















