30.2 C
Hyderabad
Wednesday, April 22, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 155

ఎట్టకేలకు మల్లన్నకు బెయిల్ మంజూరు…

క్యూ న్యూస్ అధినేతకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయింది. తీన్మార్ మల్లన్న హైదరాబాదులోని ఒక జ్యోతిష్యుడి ని బ్లాక్ మెయిల్ చేసి.. డబ్బులు డిమాండ్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆ కారణంగా ఆయనను ఆగస్టులో అరెస్టు చేశారు. అప్పుడు క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించి. కొన్ని ఆర్డిస్కలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మల్లన్న పై ఇప్పటి వరకు 38 కేసులు నమోదు కాగా అందులో హైకోర్టు ఆరు కేసులను కొట్టి వేసింది. మిగితా 32 కేసుల్లో 31 కేసుల్లో ఇదివరకే బేలు మంజూరు అయింది. పెండింగ్లో ఉన్న 1 కేసులో సోమవారం నాడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీన్మార్ మల్లన్న ఇప్పటివరకు డెబ్భై నాలుగు రోజులుగా జైల్లోనే ఉన్నారు. బేలు మంజూరు కోసం మల్లన్న దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేసింది. ఈమేరకు న్యాయస్థానం అం బెయిలు మంజూరు చేసింది. సోమవారం మల్లన్న జైలు నుండి విడుదల అయ్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను తీన్మార్ మల్లన్న భార్య, సోదరుడితో కలిసి తెలంగాణ ప్రభుత్వం పై ఫిర్యాదు చేసినారు. అక్రమ కేసులు పెట్టి ఇ నా భర్తను వేధిస్తున్నారని అని ఆరోపించారు కేసు మీద కేసు పెడుతూ జైలుకు పంపే కుట్ర చేస్తున్నారని చెప్పారు. కేసు మీద కేసు ఒక కేసుకు బేలు తీసుకుంటే మరొక కేసు పెడుతున్నారని చెప్పారు. ఇటీవలే మల్లన్న బిజెపిలో చేరుతున్నట్లు క్యూ న్యూస్ ఛానల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు అమలు…

తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ నుండి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 2216 మద్యం షాపులు ఉండగా తాజాగా రెండు వేల ఆరు వందలు 20 కి పెంచారు. ఇప్పటినుండి మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ అమలు కానుంది. మద్యం దుకాణాల్లో గౌడ్స్ కు 363, ఎస్సీలకు 262, ఎస్ టి లకు 131 ఓపెన్ కేటగిరీలో 1864 కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త మద్యం దుకాణాలకు మంగళవారం నుండి ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 20న డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నట్లు తెలిపారు.

ఆంధ్రకు పాలు సరఫరా నిలిపివేత ….

ఆంధ్ర తక్షణమే రూ.130 కోట్ల రూపాయలు చెల్లిస్తేనే అంగన్వాడీలకు పాల సరఫరా చేస్తామని కర్ణాటక పాల ఫెడరేషన్ సోమవారం తేల్చి చెప్పిది. ఆంధ్రాలో సంపూర్ణ పోషణ పథకం కింద అంగన్వాడీలకు అందించే పాలు ఏపీ ప్రభుత్వం 2020 జూన్ లో కర్ణాటక పాల ఫెడరేషన్ తో ఒప్పందం చేసుకుంది. అంగన్వాడీ లలో సంపూర్ణ పోషణ పథకం ద్వారా చిన్న పిల్లలకు పాలు అందిస్తున్నారు. లీటర్ పై ఐదు రూపాయలు తగ్గించేందుకు గతములో కర్ణాటక పాల ఫెడరేషన్ ఒప్పుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి నెలకు 110 లక్షల లీటర్ల పాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కర్ణాటక పాల ఫెడరేషన్ సరఫరా చేస్తోంది. గత నాలుగు నెలల నుండి ఆంధ్ర ప్రభుత్వం కర్ణాటక పాల ఫెడరేషన్ కు ఏలాంటి చెల్లింపులు చేయడం లేదు. దీంతో నిలిచిపోయిన రూ. 130 కొట్లకు చేరుకుంది. ఈ బకాయిలు విడుదల చేయాలని ఆంధ్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అయినా కూడా ఏపీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో కర్ణాటక పాల ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బీసి సతీష్ పాల సరఫరా నిలిపి వేయాలని నిర్ణయించారు. మరోవైపు డీజిల్ పెట్రోల్, ధరలు పెరగడం ఇతర ఖర్చులతో ఆంధ్ర ప్రభుత్వానికి ఇచ్చే ఐదు రూపాయల సబ్సిడీని కూడా తొలగించాలని కర్ణాటక అలా ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. పాల పై సబ్సిడీ నీ పై కూడా ఆంధ్ర ప్రభుత్వం స్పందించలేదని డైరెక్టర్ తెలిపారు. పెట్టుబడి, ఇంధనం ఖర్చులు పెరగడంతో కర్ణాటక పాల యూనిట్లు నష్టాల్లో కూరుకుపోయిదని తెలిపింది. అందువల్ల పాల పై సబ్సిడీలు ఇవ్వలేకపోతున్నామని స్పష్టంచేసింది. పాత దొరలకు పాలు సరఫరా చేయడం కుదరదని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అం ఉత్పత్తిదారులకు రూపాయలు చెల్లించలేక పోతున్నామని, అందువల్ల ఏపీ ప్రభుత్వం వెంటనే రూ.130 చెల్లించాలని, అలాగే పాల ధరలను లీటరుకు రూ. 5 పెంచితేనే పాల సరఫరా చేస్తామని కర్ణాటక పాల ఫెడరేషన్ ఎండి ఏపీ ప్రభుత్వానికి కి లేఖ రాశారు.

విద్యార్థులపై లాఠిచార్జ్ …

అనంతలో విద్యార్థులపై లాఠీచార్జీ చేసిన పోలీసులు. అనంతపురం లోని ఎస్ ఎస్ బి ఎన్ ఎయిడెడ్ కళాశాలల విలీనం ఆపాలని విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. కళాశాల ఎదుట రోడ్డుపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠఛార్జి చేశారు. విద్యార్థులకు పోలీసులు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో విద్యార్థుల చెదరగొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులపై విద్యార్థులు రాళ్లు వేశారు. దీంతో విద్యార్థులపై పోలీసుల లాఠిచార్జ్ చేయగా ఓ విద్యార్థి తనకు గాయమైంది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళన మరింత ఉదృతం చేశారు. విద్యార్థులను అరెస్టు చేయాలని పోలీసు నుంచి కిందకు విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థులను అరెస్టు చేసిన వాహనంలో తరలిస్తుడగా విద్యార్థి అడ్డుకున్నారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేస్తారా..? అంటూ విద్యార్థి నాయకులు. విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్క్ తరలించారు. ఈ గందరగోళం లో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడం తో జయలక్ష్మి అనే విద్యార్థిని తలకు గాయమైనది. పోలీసులు మాత్రం లాఠీఛార్జ్ చేయలేదని, విద్యార్థుల గుంపును చదరగోటమని డి.ఎస్.పి వెల్లడించారు.

లక్ష్యం నెరవేరిందా..! బ్లాక్ మనీ వెలికి తీశారా…?

– నోట్ల రద్దు నేటికీ ఐదు సంవత్సరాలు
– మద్దతు చలామణి తగ్గిందా
– బ్లాక్ మనీ వెలికి తీశారా
ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయం తో వందకోట్ల మంది జనం మరిచిపోలేదు. 5 సంవత్సరాల క్రితం నవంబర్ 8వ తేదీనాడు డిమనిటైజేశన్. బ్లాక్ మనీ అరికట్టడానికి, నగదు చలామణీ తగ్గించడానికి అని ప్రభుత్వం చెప్పింది. దీర్ఘకాలిక ఫలితాలు ఇలా ఉంటాయని అని చెప్పి ఇప్పటికీ ఐదేళ్లు అయింది.
మరి డిమనిటైజేశన్ కనిపిస్తుందా..? వందకోట్ల ప్రజలు అనుభవిస్తున్నారా..?

పెద్ద నోట్లు వద్దు చేసిన రోజు రూ. 1000, 500 నోట్ల రూపంలో ఉన్న పెద్దలు దోచుకున్నారని.. వాటినన్నిటిని వెలికితీస్తామని మోదీ అన్నారు. ప్రతి ఒక్కరు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాంకులో జమ చేశారు. బ్లాక్ మనీ లెక్క తేలుతుందని ప్రభుత్వం భావించింది. సుప్రీంకోర్టులో విచారణలో రూపాయలు మూడు లక్షల కోట్ల వరకు బ్లాక్ మనీ ఉంటుందని అవి బ్యాంకు రావని చెప్పారు. రూ. 15 లక్షల కోట్ల పెద్ద నోట్లు ఉంటే.. రూ. 12 లక్షల కోట్లు మాత్రమే వస్తాయని లెక్కలు చెప్పారు. కానీ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ప్రకారం రూ. 15 లక్షల 41వేల కోట్లు, బ్యాంకులకు తిరిగి వచ్చింది రూ. 15 లక్షల 31వేల కోట్లు. అంటే.. సుమారు 99.3 శాతం వచ్చాయి. నల్లధనం పై ఇప్పటికీ స్పష్టత లేదు. బ్యాంకులో డిపాజిట్ అయినా అదంతా బద్ధమైన డబ్బులు కాదని అందులో నల్లధనం ఉంది.. పట్టుకుంటామని అని కేంద్రం ప్రకటించి. కానీ ఇప్పటికీ ఐదేళ్లు గడిచినా నల్లధనం ఎంత అనే దానిపై స్పష్టత రాలేదు. ఎవరిని పట్టుకున్నారు.. ఎంత నల్లధనాన్ని పట్టుకున్నారు.. ఫలానా వాళ్ళు బ్లాక్ మనీ డిపాజిట్ చేశారు అని గుర్తించారు.. అన్న అంశాలపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. మనదేశంలో బ్లాక్ మనీ లేదని ఎవరు కూడా నమ్మరు.. నేటికీ లెక్కలు లేకుండా లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రతి ఎన్నికల్లో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు లెక్కలు లేకుండా కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. అంటే బ్లాక్ మనీ అధికారికంగా వైట్ మనీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా నగదు చలామణీ ఉండడం వల్ల నల్లధనం పెరిగిందని. అందుకే నగదు చలామణి తగ్గించడానికి నోట్ల రద్దు చేశామని తెలిసింది. నిజానికి ఏమాత్రం ప్రజల నగతు చలామణి ఐదేళ్లలో ఏమాత్రం తగ్గలేదు సరి కదా.. 50 శాతం పెరిగింది. నవంబర్ 4 2016న రూ. 17.97 లక్షల కోట్లుగా ఉన్న ప్రజల వద్ద రూపాయలు, అక్టోబర్ 8 20 21 నాటికి రూ. 28.30 లక్షల కోట్లకు చేరుకుంది ఈ లెక్కన చూస్తే ఏకంగా 57 పాయింట్ 48 శాతం గా ఉంది. అంటే నోట్ల రద్దు ముందు కన్నా ఇప్పుడే ఎక్కువ నోట్లు చలామణి అవుతున్నాయి. నగదు చలామణీ తగ్గిస్తామని నోటు రద్దు చేస్తే అది కాస్త.. ఇవాళ ఎక్కువైంది.

ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు…?

తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు టిఆర్ఎస్ తన అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఏడుగురు అభ్యర్థుల పేర్లు ఖరారు అయినట్లు సమాచారం.. కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనా చారి, రవీందర్రావు, ఎల్ రమణ, ఎం సి కోటిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి పేర్లు ఉన్నాయని తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా లో కౌశిక్ రెడ్డి ని, గవర్నర్ కోటాలో గుప్తాను తీసుకోనున్నట్లు సమాచారం.

తెలంగాణలో పెరిగిన ఈటల ఇమేజ్ ఢిల్లీకి పిలుపు …

మరిన్నీ బాధ్యతలు పెంచే అవకాశం
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో లభించిన విజయంతో ఈటెల రాజేందర్ ఇమేజ్ తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిపోయిందన్నది కాదనలేని వాస్తవం. ఈ ఎన్నిక కెసిఆర్, ఈటెలకు మధ్య జరిగినట్లుగా చాలా మంది భావిస్తున్నారు. ఒకింత కొందరూ యితే ఆయన కెసిఆర్ పైనే గెలిచినట్టుగా భావిస్తున్నారు. ఇది ఇలా ఉంటే బిజెపి హైకమాండ్ కు కూడ ఈటెల రాజేందర్ విషయంలో సానుకూల అభిప్రాయం ఏర్పడిందన్నా ప్రచారం సాగుతోంది. కాగా ఈటల రాజేందర్ కు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందినట్లు గా తెలుస్తోంది. ఢిల్లీకి రాజేందర్ ను పిలిపించి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారన్నా ఆలోచన కూడా ఉంది. అయితే తే రాజేందర్ ను ఢిల్లీకి తప్పించడం వెనకాల కారణాలు ఉంటాయని విశ్లేషకులు ఆలోచిస్తున్నారు బహుశా ఆయన నొప్పి కల్పించుకొని మరిన్ని బాధ్యతలు అప్పగిస్తానని తెలంగాణాలో బిజెపి నీ విస్తరించి మరింత ముందుకు పోయే వివాహం లో ఉన్నట్లు తెలుస్తోంది తెలంగాణలో కూడా బిజెపిని బలపర్చి రానున్న ఎన్నికలకు సంసిద్ధం చేయాలని అని ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.

ఎల్లుండి రాష్ట్ర వ్యాప్త నిరసనలు…

పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని కలెక్టరేట్లో తహసిల్దార్ ఆఫీస్ ల వద్ద సోమవారం నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రకటించారు. కాగా ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం పెట్రోల్ పై రూ. 5, డీజిల్ పై రూ.10 వ్యాట్ తగ్గించడంతో రాష్ట్రం కూడా తగ్గించాలని డిమాండ్ తీవ్రమవుతోంది. అయితే తగ్గింపుపై ఇప్పటివరకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కూరగాయలు కొనండి ఆరోగ్యంగా ఉండండి..కూరగాయలు అమ్మిన సోనూ సూద్…

ఎప్పుడూ ఎవరికో ఒకరికి సహాయం చేస్తూ వార్తల్లో ఉండే సోనుసూద్ తాజాగా కూరగాయలు అమ్మి సహాయం చేశాడు. యూపీలోని లక్నోలో తోపుడు బండి పై కూరగాయలు అమ్ముతున్న ఇద్దరు యువకులతో కలిసి కూరగాయలు విక్రయించాడు. కాగా తాజా కూరగాయల కోసం నాకు ఆర్డర్ వేయండి వాటిని తిని ఆరోగ్యంగా ఉండండి అంటూ కూరగాయలు అమ్ముతున్న వీడియోను సోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అలాగే చిరు వ్యాపారులు వద్ద కూరగాయలు కొనాలని అభ్యర్థించాడు.

ప్రిలిమ్స్ పాసైతే మైన్స్ ఫ్రీ కోచింగ్…

సివిల్స్ 2021 ప్రిలిమ్స్ పాసైన వారికి ఉచితంగా మెయిన్స్ కోచింగ్ ఇస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు ఇందుకోసం నవంబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. https:/tsbcstudycircle.cgg.gov.in వివరాలకు 040 24071178 నంబర్ కు కాల్ చేయాలని అని సూచించారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...