29.7 C
Hyderabad
Wednesday, April 22, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 154

విమానాశ్రయంలో భారీగా పట్టుబడిన విదేశీ కరెన్సీ…

హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో సోమవారం భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళుతున్న ఓ ప్రయాణికుడి నుండి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది విదేశీ కరెన్సీ ని స్వాధీనం చేసుకుంది. సయ్యద్ అలీ అనే ప్రయాణికుడు వద్ద సుమారు 12 లక్షల 87 వేలు విదేశీ కరెన్సీ రియల్స్ ను సీఐఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.

ముఖేష్ అంబానీ కి బెదిరింపు కాల్స్.. ఇంటి వద్ద హై అలర్ట్…

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కి బెదిరింపు కాల్స్ రావడంతో ముంబై పోలీసులు ఆయన ఇంటి వద్ద అలర్ట్ ప్రకటించారు. అయితే ఫోన్ కాల్ చేసింది టాక్సీ డ్రైవర్ అని తేల్చారు. ఇద్దరు వ్యక్తులు ముకేష్ ఇంటికి తీసుకెళ్లాలని తనను ఆదేశించారని డ్రైవర్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రస్తుతం డి సి పి స్థాయి అధికారి అంబానీ ఇంటి వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఆలస్యంగా టవల్ ఇచ్చినందుకు భార్యను చంపేసిన భర్త…

ఆలస్యంగా టవల్ ఇచ్చినందుకు భార్యను తల పై గట్టిగా కొట్టి చంపేశాడు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ లో చోటు చేసుకున్న ఈ దారుణ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అటవీ శాఖలో తాత్కాలిక ఉద్యోగిగా ఉన్న రాజ్కుమార్ స్నానం చేసి భార్య నీ టవల్ తెమ్మని అడిగాడు. పనిలో ఉన్నాను కాసేపు ఆగాలని ఆమె సమాధానం చెప్పడంతో కోపం లో ఉన్న భర్త రాజ్ కుమార్ అక్కడే ఉన్న పారతో భార్య తలపై గట్టిగా కొట్టాడు.పుష్ప అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ నే…!

టీ20లో టీమ్ ఇండియా తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అని విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు ఆ సమయంలో కోహ్లీ మాట్లాడుతూ అద్భుత ఆటగాళ్లు ఉన్న ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తర్వాత కెప్టెన్ కొన్ని రోజులుగా విషయాలు తెలిపాడు చెట్టు గురించి తాను గర్వంగా ఉన్నానని చెప్పాడు

నేను కరెంటు కారు కొన్న.సీఎం కేసీఆర్…

ప్రపంచంలో ఎలక్ట్రిక్ మోటార్స్ రంగం వేగంగా ఇస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు ఎల్జి కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ నేను ఇటీవలే తీసుకున్న. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది పోటీలు మూడు నెలల ముందే బుక్ చేసుకోవాల్సిన నా పరిస్థితి వస్తోంది కొన్నేళ్లలో పెట్రోల్ బంకులు పోయి స్టేషన్లు వస్తాయి ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పారు.

29 నుంచి పార్లమెంట్ సమావేశాలు…

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సిఫార్సు చేసింది. కాగా ఉబయసభలు తేదీని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే మొత్తం 19 రోజులు సమావేశం నిర్వహిస్తారు. డిసెంబర్ 23న ముగింపు ఉంటుంది. కరోనా కారణంగా గత శీతాకాల పార్లమెంట్ శీతాకాల జరగలేదు.

11130 గెస్ట్ లెక్చరర్ లకి ఛాన్స్…

తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ లను నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు 1130 లెక్చరర్ల ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నియామకాల్లో నెట్ పీహెచ్డీ అభ్యర్థుల కు మొదటి ప్రాధాన్యం ఇవ్వనుండగా, తర్వాత పీజీ పూర్తి చేసినవారికి ఉంటుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు విద్యా శాఖ ఇవ్వనుంది.

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల…

రాష్ట్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖలో 22 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది స్త్రీ శిశు సంక్షేమ శాఖలో 22 విస్తరణాధికారి గ్రేడ్ వన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నెల 18 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు ఆన్లైన్లో ఆస్తులు స్వీకరించనున్నారు. ఈ వివరాలను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.

తిరుమల నుంచి తిరుపతికి ఎలక్ట్రిక్ బస్సులు…

హైదరాబాద్కు చెందిన గ్రీన్ టెక్ లిమిటెడ్ ఛాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియం సంస్థలకు ఏపీఎస్ఆర్టీసీ వంద బస్సులు కాంట్రాక్టు ఇచ్చింది. ఈ బస్సులను కాంట్రాక్ట్ మోడల్ ప్రాతిపదికన అందించింది. పన్నెండేళ్లు నిర్వహించాలి ఇందులో లో మిగిలిన 50 బస్సులను తిరుపతి నుంచి నెల్లూరు కడప మదనపల్లి పట్టణాలకు ఇంటర్సిటీ సర్వీస్ గా నడుపుతారు.

ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం నలుగురు పిల్లలు సజీవ దహనం…

మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్ లోని కమలా నెహ్రూ ఆసుపత్రి లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది చిన్న పిల్లల వార్డులో మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు సజీవదహనం అయ్యారు ప్రమాద సమయంలో వార్డులో మొత్తం 40 మంది చిన్నారులు ఉండగా 36 మందిని సురక్షితంగా కాపాడారు కుటుంబాలకు రూ నాలుగు లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంఘటనపై విచారణకు ఆదేశించారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...