26.7 C
Hyderabad
Wednesday, April 22, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 153

11 గవర్నర్ల సదస్సు…

ఈనెల 11న రాష్ట్రపతి భవన్లో 51వ గవర్నర్ల సదస్సు జరగనుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటారు. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో జరుగుతున్న నాలుగవ సదస్సు ఇది.

చిన్నారుల టీకాకి రూ.265…

12 ఏళ్ల పైబడిన పిల్లల కోసం అనుమతి పొందిన తొలి టీకా జైకోవ్ డి. zydus cadila రూపొందిన ఈ టీకా కోటి డోస్ ల కోసం కేంద్రం ఆర్డర్ చేసింది. మూడురోజుల్లో తీసుకోవాల్సిన ఈ టీకాను కేంద్ర ప్రభుత్వానికి ఒక డోసు కు రూ.265 ఇచ్చేందుకు ఆ సంస్థ అంగీకరించింది. సూది అవసరం లేకుండానే పంపిణీ చేసే ఈ టీకా కోసం ప్రత్యేకంగా ఓ పరికరాన్ని వాడనున్నారు. దీని ధర 93 కలుపుకొని ఒక డోసు ధర 358 అవుతుంది.

కాలుష్య కోరల్లో జలాల్లోనూ స్నానాలు…

దేశరాజధాని కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంది. కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. వీటికి తోడు జల కాలుష్యం కూడా తీవ్ర స్థాయిలో ఉంది పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యం యమునా నదిలో కలిసి నీటిని కలుషితం చేస్తున్నాయి. నగలు ఏర్పడి కాలుష్యానికి సంకేతంగా కనిపిస్తుంది. కార్తీక మాసం సందర్భంగా కాలుష్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా జనాలు స్నానాలు ఆదరిస్తున్నారు.

అట్టహాసంగా పద్మ అవార్డులు…

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ ప్రధానోత్సవం లో తెలంగాణ నుంచి చింతల వెంకట్ రెడ్డి వ్యవసాయ రంగంలో పద్మశ్రీ అందుకున్నారు. చింతల హైదరాబాద్ కు చెందిన అభ్యుదయ రైతు. వ్యవసాయంలో ఆయన చేస్తున్న కృషికి అభినందించారు. సంప్రదాయ పద్ధతిలో గుర్తించి కేంద్ర వ్యవసాయ రంగంలో పద్మశ్రీ ప్రకటించింది.

కేంద్రానిది రూపాయి ఉన్నా రాజీనామా చేస్తా సీఎం కేసీఆర్…

గొర్రెల పైసలో కేంద్ర ప్రభుత్వానిది రూపాయి ఉన్నా తాను రాజీనామా చేస్తా అని సీఎం కేసీఆర్ సవాల్ చేశారు. గొర్రెల కోసం రుణం తీసుకున్న బాధ్యతగా తీరుస్తున్న అన్నారు. రాష్ట్రాల్లో తెలంగాణ పథకాల్లో ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. బిజెపి అనేక దొంగ లెక్కలు చేసిందని కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన వచ్చిందని విమర్శించారు.

ఫిబ్రవరి 16 నుంచి మేడారం.. జాతర రూ. 75 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం…

ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసి జాతర దక్షిణ కుంభమేళా గా పేరు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ జాతర కోసం రూ 75 కోట్లు విడుదల చేసింది. నిధులు విడుదల పట్ల స్త్రీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కెసిఆర్ నేతృత్వంలో అత్యంత వైభవంగా ఈ జాతర సాగనుందని తెలిపారు. కరోన కష్ట కాలం లో బడ్జెట్ సమస్యలు ఉన్నప్పటికీ సమ్మక్క-సారలమ్మ జాతరకు 75 కోట్లు విడుదల చేయడం పట్ల ఆదివాసీలపై సీఎంకు ఉన్న ప్రేమ నిదర్శనం అన్నారు.

మంత్రులకు భాష రాదు..సీఎస్ ను మార్చండి ముఖ్యమంత్రి లేఖ…

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు మిజోరం ముఖ్యమంత్రి జోరామ్ లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామక విషయంలో ముఖ్యమంత్రి లేఖ రాస్తూ మిజోరం మంత్రులకు హిందీ అర్థం కాదని కొంత మందికి ఇంగ్లీష్ కూడా తెలియదని.. మిజో వచ్చిన అధికారిని. ప్రధాన కార్యదర్శిగా నియమించాలని కోరారు.కొత్తగా నియమించిన ప్రధాన కార్యదర్శి కి విజ్జు భాష తెలియదని ఆయనను తప్పించాలని, ముఖ్యమంత్రి అభ్యర్థించారు. ప్రస్తుత అదనపు ప్రధాన కార్యదర్శి జేసి రామ్ థంగాను ఎస్ రేణు శర్మ స్థానంలో నియమించాలని లేఖలో పేర్కొన్నారు. గుజరాత్ కేడర్ కు చెందిన చీఫ్ సెక్రెటరీ లల్నున్మవియా చువాగో పదవీ విరమణ చేసిన తర్వాత ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జేసి రామ్ థంగా ( మణిపూర్ క్యాడర్ ) ని నియమించాలని కోరారు. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రేణు శర్మను కొత్త గా ప్రధాన కార్యదర్శి గా ఇచ్చిందని లేఖ రాశారు. అరుణాచల్ ప్రదేశ్ ,గోవా, మిజోరాం కేంద్ర పాలిత ప్రాంతం (AGMUT ) ఐ ఎస్ క్యాడర్ 1988 బ్యాచ్కు చెందిన రేణు శర్మను అక్టోబర్ 28న మిజోరామ్ కు సిఎస్ గా నియమించింది. ఆమె నవంబర్ 1న సీఎస్ గా బాధ్యతలు తీసుకున్నారు, అయితే అదే రోజున జె సి జేసి రామ్ థంగా నియమిస్తూ మిజోరాం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మిజోరంలో ఇద్దరు చీఫ్ సెక్రటేరియల్ గా కొనసాగుతున్నారని లేఖలో పేర్కొన్నారు. మిజోరామ్ ప్రజలకు పెద్దగా హిందీ అర్థం కాదని, న మంత్రి మండలిలోనే ఎవరికీ హిందీ రాదని, కొందరికి ఆంగ్ల భాష తో సమస్యలు ఉన్నాయి.. ఈనేపథ్యంలో మిజోరామ్ భాష పై అవగాహన లేని చీఫ్ సెక్రటరీ, సమర్థవంతమైన ప్రధాన కార్యదర్శి కాలేరు.. మిజోరామ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి స్థానిక భాష తెలియని ప్రధాన కార్యదర్శిగా భారత ప్రభుత్వం ఎన్నడూ నియమించలేదు. ఈశాన్య రాష్ట్రాలలో మొదటి నుండి ఇప్పటి వరకు ఎన్డీఏ నమ్మకమైన భాగస్వామి గా ఉన్న వారిలో నేను ఒకరిని.. కాబట్టి, కన్నీటిని పరిగణలోకి తీసుకొని, ప్రతిపాదనను దయచేసి అంగీకరించ వలసిందిగా అభ్యర్థిస్తున్నాముఅని లేఖలో పేర్కొన్నారు.

గెలిస్తే భార్య బరువు బీరు …

అమెరికాలోని మార్నింగ్ కౌంటీలో ఓ పోటీ పెట్టారు. అందులో గెలుపొందిన వారికి వారి భార్య బరువు బీరు, ఆమె బరువు అవును డబ్బులు ఇస్తామని పోటీ పెట్టారు. దీంతో జనాలు పోటీలో పాల్గొనేందుకు పోటెత్తారు. ఇంతకీ పోటీ ఏంటో తెలుసా భార్యను భుజాల పైన వేసుకుని వాగులో పరిగెత్తడం. చాలా మంది పాల్గొని ఆనందించారు.

నేడు కామారెడ్డికి మంత్రి కెటిఆర్ రాక..

రూ.6 కోట్లు వెచ్చించి నిర్మించిన బీబీపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ప్రారంభించడానికి మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి మంగళవారం కామారెడ్డి జిల్లా బీబీపేటకు రానున్నారు.

కార్పొరేట్‌ను తలదన్నేలా ఆధునిక హంగులతో దాత తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి దీన్ని నిర్మించారు. బడి విస్తీర్ణం 2.75 ఎకరాలుండగా.. 42 వేల చ.అ.ల్లో 32 సువిశాల గదులు ఉన్నాయి. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వెంట జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ ప్రేంకుమార్, ఎంపీపీ బాలమణి ఉన్నారు.

ప్రపంచంలోని అత్యుత్తమ వైద్యులు…

1. సూర్యకాంతి 2. విశ్రాంతి 3. రోజువారీ కార్యకలాపాలు 4. మితమైన ఆహారం 5. ఆత్మవిశ్వాసం 6. కుటుంబం & స్నేహితులు వారిని జీవితంలోని అన్ని దశలలో నిర్వహించి, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించండి.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...