చాలాకాలంగా ఈ వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ విషయం ఆమె ధ్రువీకరించారు. పరిశ్రమకు చెందిన చాలామంది హీరోలు నటించాలని సలహా ఇచ్చినట్లు ఓ వీడియోలో ఆమె తెలిపారు దీంతో తాను వెండితెర రీ ఎంట్రీకి సిద్ధమైనట్లు వెల్లడించారు. నేడు ఆమె ప్రధాన పాత్రలో మూవీ ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
తొక్కిసలాటలో 8 మంది మృతి…
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర బోస్టన్లో దుర్ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి నిర్వహించిన మ్యూజిక్ షో లో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. 17 మంది గాయపడ్డారు. వీరిలో 11 మంది కార్డియాక్ అరెస్ట్ ఎదుర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆస్ట్రో వరల్డ్ పేరుతో ప్రముఖ ట్రావెల్స్ నిర్వహించిన ఈ షోకు సుమారు 50 వేల మంది వచ్చి ఉంటారని ఒక అంచనా.
ఘోర ప్రమాదం ఆయిల్ ట్యాంకర్ పేలి 21 మంది మృతి…
ఆఫ్రికా లోని సియెర్రా లియోన్ లో ఘోర ప్రమాదం సంభవించింది ఫ్రీ నగరంలో రెడీగా ఉండు కూడలి వద్ద పేలుడు జరిగింది ఆయిల్ ట్యాంకర్ను మరో వాహనం ఢీకొట్టడంతో ఈ పేలుడు జరిగి మంటలు చెలరేగాయి ప్రమాదంలో 21 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఆయిల్ కోసం స్థానికులు ఎగబడ్డారు ఘోర ప్రమాదానికి సంబంధించి ప్రెసిడెంట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
న్యూ ట్విస్ట్ తెరపైకి జయలలిత కూతురు …
తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెను అంటూ ప్రేమ అనే మహిళ తెరపైకి వచ్చారు. ఇవాళ చెన్నై మెరీనా బీచ్ లో ని జయలలిత సమాధి వద్ద ప్రేమ నివాళులు అర్పించారు. తాను జయలలిత కూతుర్ని అని అనేందుకు కు అన్ని ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు . గతంలో తాను మైసూర్ లో ఉండే దాన్ని ,గత 30 ఏళ్లుగా చెన్నైలోని పల్లవారం లో నివసిస్తున్నానాని ప్రేమ తెలిపారు. త్వరలో శశికళ ను కలవనున్నట్లు పేర్కొన్నారు.
ఢిల్లీ ప్రజలకు సీఎం శుభవార్త…
ఢిల్లీ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2022 మే వరకు ఉచిత రేషన్ పథకాన్ని పొడగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. సామాన్య ప్రజానీకం కనీసం రెండు పూటలా తిండి దొరకని పరిస్థితి ఉందని, పేద ప్రజలకు ఉచిత రేషన్ సరఫరా పథకాన్ని మరో ఆరు నెలలు తొలగించాలని ప్రధాని మోదీ నీ కోరారు.
డిజిపి కి చంద్రబాబు లేఖ…
విశాఖ జిల్లా విద్యుత్ లైన్ మెన్ బంగార్రాజు హత్యపై డీజీపీ గౌతమ్ సవాంగ్ కు టిడిపి అధినేత చంద్రబాబు లేఖరాశారు మంత్రి బొత్స మేనల్లుడు లక్ష్మణ్ రావు అతిథిగృహం పక్కనే బంగార్రాజు మృతదేహం లభ్యమైంది అని నాలుగైదు రోజులైనా పోస్టుమార్టం నిర్వహించక పోవడం నిందితులను అరెస్టు చేసి ఇ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు.
గాంధీభవన్లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం…
గాంధీ భవన్ లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టి పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ,పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ, ఏఐసిసి కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ,ఇ ఎస్ ఐ సి సి కార్యదర్శి చిన్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మానందానికి రామినేని అవార్డు…
టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం చేసి మరింత పెరిగింది ఆయన ఖాతాలో మరో పురస్కారం చేరింది ఈ ఏడాది డాక్టర్ ఫౌండేషన్ అవా iuర్డుకు ఎంపిక అయినట్లు ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం తెలిపారు ఈ పురస్కారానికి ఎంపికైన వారిలో సినీ జర్నలిస్ట్ ఎస్.వి.రామారావు భారత్ బయోటెక్ సి.ఎం.డి సుచిత్ర ఎలా ఫిలిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గా పద్మజ ఉన్నారు త్వరలోనే ఈ అవార్డులను ఇవ్వనున్నారు.
ఎల్లుండి మహాపాదయాత్ర కు సెలవు…
అమరావతి రైతుల మహా పాదయాత్రకు సోమవారం సెలవు ప్రకటించారు శనివారంతో పాదయాత్ర ఆరవ రోజుకు చేరింది ఆదివారం రాత్రికి ప్రకాశం జిల్లా ఇంకొల్లు మహాపాదయాత్ర చేరుకోనుంది కార్తీక సోమవారం కావడంతో పాదయాత్రకు సెలవు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు మంగళవారం ఉదయం ఇంకొల్లు నుంచి యధావిధిగా పాదయాత్ర కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
వేసవిలో వరి వేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వం మరోసారి కీలక ప్రకటన…
వేసవిలో వరి పంట వేయొద్దని తెలంగాణ ప్రభుత్వం మరోసారి అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు. విత్తనం కోసమే వరి వేయాలని, రాష్ట్రంలో వరి కొనే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. వానాకాలం లో వేసే వరి పంటను ఖచ్చితంగా కొంటామని స్పష్టం చేసిన ఆయన యాసంగి పంట కొనమని చెప్పారు. బీజేపీకి దమ్ముంటే కేంద్రం వరి కొంటుందని లెటర్ ఇవ్వాలని అన్నారు.

















