సదరన్ సమావేశాల నేపథ్యంలో తిరుమలలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో వి ఐ పి బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ మేరకు సదరు తేదీలో సిఫారసు లేఖలు తీసుకోమని టీటీడీ తెలిపింది. నవంబర్ 14న సదరన్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ భేటీ ఉంటుంది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ , కేరళ , తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు పాల్గొంటారు. ఈ కారణాల దృష్ట్యా దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయించింది . సీఎం జగన్ ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ప్రస్తావించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తేవాలనే విషయాన్ని చర్చకు పెట్టాలని నిర్ణయించారు. తమిళనాడు నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన పోలవరం ప్రాజెక్టు, రెవెన్యూ లోటు పై చర్చించాలని నిర్ణయించారు. ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలు ప్రస్తావించాలని నిర్ణయించారు.
కాలుష్యంతో తగ్గుతున్న ఆయుష్.. వైద్య నిపుణుల వెల్లడి…
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోంది. ఢిల్లీలో హెయిర్ క్వాలిటీ ఇండెట్స్ (AQI) 530కి చేరడంతో గాలి పీల్చడం ప్రమాదకరంగా మారింది. దీనిపై వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి కాలుష్యానికి మానవలి నిర్లక్ష్యణమే కారణమని అంటున్నారు. ఏ ఎన్నో ప్రముఖ పర్యావరణ విమ్లేద్ మాట్లాడుతూ. వాయు కాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం 15 లక్షల మంది మృత్యువాత పడ్డారని తెలిపారు.
ఢిల్లీ ఎన్ సీఆర్ లో నివసిస్తున్న ప్రజల ఆయుష్షు 9.5 సంవత్సరాలు తగ్గుతోందని ఒక నివేదికలో తెలిసిందన్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఆస్తమా ( ఉబ్బసం ) తో బాధపడుతున్నారని లంగ్ కేర్ ఫౌండేషన్ పరిశోధనలో వెల్లడైందని విమ్లేద్ తెలిపారు.
విహారయాత్ర కు సర్వం సిద్ధం.. పాపికొండల్లో బోటు యాత్ర ప్రారంభం…
ఆంధ్ర రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఆంధ్రాలో అతి ముఖ్యమైన పర్యాటక ప్రాంతం పాపికొండలు. కొంతకాలంగా పాపికొండల యాత్ర నిలిచిపోయింది. అయితే తే.గీ గోదావరి నదిలో బోటు షికారు చేయాలనుకునే పర్యాటకులకు.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఆదివారం నుండి ఇ బోర్డ్ ప్రారంభం కానుంది. టూరిజం పోలీస్ అధికారులతో జిల్లా కలెక్టర్ హరి కిరణ్ సమావేశం నిర్వహించారు. బోటు ఆపరేటర్లు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. యాత్రికుల భద్రత, బోట్ రూట్ ఆపరేటర్లు పాటించాల్సిందే నిబంధనలు కలెక్టర్ వివరించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా.. శనివారం ట్రయల్ రన్ చేశారు. యాత్రకు పేరంటలపల్లి నుండి స్థానిక లాంచీలు ఆదివారం నుండి బయలుదేరి వెళ్లనున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం గొందురద మాతృశ్రీ గండి పోచమ్మ టెంపుల్ నుండి విహార యాత్ర కు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రామాణిక ఆపరేషన్ నిబంధనలపై విశ్వాసం పెంపొందించే దిశగా డ్రై రం ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ తెలిపారు. పర్యాటకుల భద్రత, భరోసా కల్పించాలని అధికారులకు ఆదేశించారు. నిబంధనలు పాటిస్తూ, పరిమితికి మించి బోటు లో ఎక్కించుకో కూడదని.. బోట్లో ఎల్లప్పుడు లైవ్ జాకెట్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. నిబంధనలు పాటించండి బోటు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని. అలాగే లైసెన్సులు రద్దు చేస్తామని అన్నారు.
కుచ్చు లూరు బోటు ప్రమాదం తర్వాత దాదాపు రెండేళ్ల అనంతరం ఈ యాత్ర ప్రారంభం చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
భాగ్యనగరంలో మరో భారీ మోసం.. బ్యాంకులో నగదు ఫ్రీజ్…
భాగ్యనగరంలో రోజు రోజుకి సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సామాన్యుల ఆశలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఎంత అందుతే అంత దోచేస్తున్నారు. బిట్ కాయిన్ క్రిష్టోకరెన్సీ పేరుతో మోసాలు చేస్తున్నారు. భారీ లాభాలు వస్తాయని చెప్పి డబ్బులు వసూలు చేసిన మరో ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. క్రిష్టోకరెన్సీ పేరుతో భారీ మోసం పాల్పడిన ముఠా అరెస్టు చేశామని సీపీ తెలిపారు. క్రిష్టోకరెన్సీ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఈ ముఠా మాయమాటలు నమ్మి నార్కట్పల్లి కి చెందిన ఒక వ్యక్తి 85 లక్షలు పోగొట్టుకున్నారని తెలిపారు. 14 సేల్ కంపెనీల ద్వారా ఈ ముఠా మోసాలకు పాల్పడి నట్లు గుర్తించామన్నారు. వారి చేతిలో మోసపోయిన మరో బాధితుడు బానోత్ కిరణ్ కుమార్ ఫిర్యాదుతో ప్రత్యేక టీం తో దర్యాప్తు చేశామన్నారు.
బెంగాల్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు. పశ్చిమ బెంగాల్ కు ప్రత్యేక టీమ్ ని పంపించి అరెస్టు చేసినట్లు చెప్పారు బ్యాంకు లో ఉన్న రూ.50 లక్షల రూపాయలను ఫ్రీజ్ చేశామని తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలించామని.. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
అగ్నిప్రమాదంలో- కరోనా రోగులు10 మంది మృతి…
అహ్మద్ నగర్ జిల్లా ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా ఆస్పత్రిలో ఐసీయూలో హఠాత్తుగా మంటలు చెలరేగి పదిమంది కరోనా రోగులు మృతి చెందారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రమాదం సంభవించిన సమయంలో ఐసీయూలో మొత్తం 17 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
నాడు ఏం చెప్పాడు..? నేడు ఏం చేస్తున్నాడు…!
అధికారంలోకి రాగానే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందించలేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. దేశంలో అన్ని రాష్ట్రలు పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గిస్తూ ఉంటే ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పెట్రోల్ ధరల అంశంపై తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి
అసెంబ్లీ లో చేసిన ప్రసంగం, అలాగే పాదయాత్ర లో వివిధ సందర్భాల్లో పెట్రోల్ ధరలపై చేసిన ప్రసంగాల వీడియో క్లిప్పింగ్లు చూపించారు. అప్పట్లో పెట్రోల్ బాదుడే బాదుడు అంటూ విమర్శలు చేశారని ఆయన గుర్తు చేశారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో డీజిల్, పెట్రోల్ ధరల్ని చంద్రబాబు నాయుడు మీడియా ప్రదర్శించారు. దేశంలో పెట్రోల్ డిజిల్ అధిక ధరలు ఉన్న రాష్ట్రం రాజస్థాన్ అని, తర్వాత స్థానం ఆంధ్ర ఏం అని వివరించారు. దక్షిణాది రాష్ట్రాలలో ఒక ఆంధ్ర లో మాత్రమే అత్యధిక రేటు ఉందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న పనులకు చాడ తేడా ఉందిని, ఇది తుగ్లక్ పాలన కాక మరి ఏంటని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. దేశంలో చిన్న చిన్న రాష్ట్రాలు కూడా పెట్రోల్ రేట్లు ఏడు రూపాయలు వరకు తగ్గించాలని కానీ ఆంధ్రాలో మాత్రం ఒక్క రూపాయి కూడా తగ్గించే ఆలోచన చేయడం లేదన్నారు. ప్రజల్ని పన్నుల రూపంలో బాదడం.. అప్పులు చేయడం మినహా ఏపీలో పాలన లేదన్నారు. అరాచకం, విధ్వంసం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. ఇదేమి మీ వైయస్ జగన్మోహన్ రెడ్డి జాగీరు కాదన్నారు. పెట్రోల్ ధరల ప్రభావం అన్ని రంగాలపై ఉంటుంది. ధరలు పెరగడం వల్ల రైతులు అప్పులపాలవుతున్నారు. ఒకపక్క విధ్వంసం.. మరోపక్క ప్రజలపై పన్నుల భారం అని అన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారన్నారు.
కోడెల హౌస్ అరెస్ట్…
గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివరాం ను హౌస్ అరెస్టు చేశారు. ఆయన ఇంటి దగ్గర పోలీసులు భారీగా మొహరించారు. చంద్రన్న ఆ ఆశయ సాధన పేరిట శనివారం పాదయాత్ర చేసేందుకు కోడెల శివరాం సిద్ధమయ్యారు. అయితే పాదయాత్ర కు అనుమతి లేదని పోలీసులు చెప్తుండగా పాదయాత్ర చేసి తీరుతానని శివరాం స్పష్టం చేశారు. కాగా పలువురు టిడిపి నేతల ఇళ్ల వద్ద కూడా పోలీసులు మోహరించి ఉన్నారు
రెండు కార్లు ఢీ ఏడుగురికి గాయాలు…
కడప జిల్లా రైల్వే కోడూరు మండలం లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంత రాజు పేట వద్ద రెండు కార్లు ఢీకొని ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి వీరిని స్థానికులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముగ్గురు పదవ తరగతి విద్యార్థుల అదృశ్యం…
కడప జిల్లా బద్వేల్ లో ముగ్గురు పదవ తరగతి విద్యార్థులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. శుక్రవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పిల్లల కోసం గాలిస్తున్నారు.
నేడు ప్రకాశం జిల్లాలో కి మహాపాదయాత్ర …
అమరావతి నేర రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర శనివారం నాటికి ఆరవ రోజుకు చేరుకుంది. న్యాయ స్థానం నుండి దేవస్థానం పేరిట చేపట్టిన ఈ యాత్ర ఇవ్వాళ ప్రకాశం జిల్లాలో ప్రవేశించనుంది. మూడు రాజధానులు సి ఆర్ డి ఎ రద్దు కు వ్యతిరేకంగా చేపట్టిన ఈ యాత్ర పెదనందిపాడు లో ప్రారంభమై 14 కిలోమీటర్ల మేర సాగింది ఇవ్వాలా పర్చూరులో ముగియనుంది.

















