31.2 C
Hyderabad
Tuesday, April 21, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 158

బస్సును డ్రైవర్ దొంగిలించాడు…

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిర్వాహకులు ఘరానా మోసానికి పాల్పడ్డారు.
నల్గొండ జిల్లాలో శుక్రవారం రాత్రి నార్కెట్ పల్లి వద్ద భోజనం కోసం
హోటల్ వద్ద డ్రైవర్ బస్సును నిలిపాడు. దీంతో ప్రయాణికులు హోటల్ లోకి వెళ్లి భోజనం చేస్తుండగా
బస్సుతో డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. బస్సులోనే 64 మంది ప్రయాణికులు లగేజ్ ఉండటం గమనార్హం. ప్రయాణికులు తమ లగేజ్ పోయిందని లబోదిబోమంటుడగా, బస్సు యజమాని బాధపడుతు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సచివాలయంలో.. బాలికపై ఆకృత్యం…

సచివాలయంలో బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా నడుకూరు గామ సచివాలయంలో ఓ బాలికపై వాలంటీరు బొత్స హరిప్రసాద్ ఓ బాలికకు మాయమాటలు చెప్పి సచివాలయంలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తాత్కాలిక ఉద్యోగి గుగ్గిలాపు రాంబాబు ఆ వాలంటీరుకు సహకరించాడు. ఈ నెల 3 న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయినది.

మంత్రి కుమారుడి కారు ఢీకొని వ్యక్తికి గాయాలు…

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి యాదవ్ కారు ఢీకొని ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. హైదరాబాద్ ఖైరతాబాద్ లో సదర్ ఉత్సవాలో పాల్గొనేందుకు సాయి యాదవ్ వచ్చారు. తిరిగి వెళ్తుండగా ఆయన కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతని కాలుకి గాయాలయ్యాయి స్థానికులు సాయి కారును అడ్డుకొని వాగ్వాదానికి దిగారు పోలీసులు జోక్యం చేసుకుని గాయపడ్డ వ్యక్తి కుటుంబానికి సర్దిచెప్పారు. పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

పునీత్ కు బసవ శ్రీ అవార్డు…

కన్నడ పవన్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం అభిమానులను ఇంకా వెంటాడుతూనే ఉంది. అయితే ఆయనకు బసవ శ్రీ అవార్డు 2021 అందజేయనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది బసవ జయంతి రోజున ఈ అవార్డులు పునీత్ కుటుంబానికి అందజేయనున్నారు. కాగా అక్టోబర్ 29న రాజ్ కుమార్ కార్డిక్ అరెస్టటి తో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే.

డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలను సీజ్ చేయవద్దని హైకోర్టు ఆదేశం…

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాగి నడిపిన వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది. అయితే మద్యం సేవించిన వ్యక్తికి వాహనం నడిపేందుకు అనుమతి ఇవ్వవద్దని, అతని వెంట తాగని వ్యక్తి ఉండి లైసెన్స్ ఉంటే వాహనం అప్పగించాలని తెలిపింది. ఎవరు రాకుంటే పోలీస్ స్టేషన్ కు తరలించాలని తెలిపింది.

భారత్ నుంచి అధిక వికెట్లు తీసుకున్న వారిలో టాప్ లో బుమ్రా…

అంతర్జాతీయ టి-20లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ బూమ్ర్ నిలిచాడు. ఈ మ్యాచ్ కంటే ముందు 62 వికెట్లతో ఉండగా రెండు వికెట్లు పడగొట్టి టాప్ ప్ కి వెళ్ళాడు. 63 వికెట్ల తో చాహల్, 55 వికెట్లతో అశ్విన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు

చెలరేగిన భారత్ బౌలర్లు-టీం ఇండియా విజయం…

టీం ఇండియా తో జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ కుప్పకూలింది. భారత్ బౌలర్ల ధాటికి 17.4 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌట్ అయ్యింది. షమీ, జడేజా మూడేసి వికెట్లతో సత్తా చాటరు. ఈ లక్ష్యాన్ని భారత్ 6.3 ఓవర్లలో 89 పరుగులు చేసి చేదించింది. దీనితో నెట్ రన్ రేట్ భారీగా పెంచుకుంది.

శ్రీశైలంలో గర్భాలయ దర్శనాలు నిలిపివేత…

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం లో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వచ్చే నెల 4 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. అయితే అప్పటి వరకూ గర్భాలయ దర్శనాలు పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

టిఆర్ఎస్ సభ కు భూములు ఇచ్చేది లేదన్న రైతులు…

హనుమకొండలో ఈనెల 29న టిఆర్ఎస్ నిర్వహించే విజయ గర్జన సభకు భూములు ఇచ్చేది లేదని సిద్దన్నపేట రైతులు స్పష్టం చేశారు సభా స్థలం కోసం వచ్చిన అధికారులు పంటలు పండే భూములను ఎలా ఇస్తామని ప్రశ్నించారు. రైతు అధికారులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. భూములు ఇవ్వకుంటే ధరణి నుంచి తొలగిస్తామని వేరే వారి పేరు మీద అ చేస్తామని టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు.

ఆర్యన్ ఖాన్ కేసు లో విచారణ అధికారిగా ఉన్న వాంఖడే తొలగింపు…

ముంబాయి డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కేసులో విచారణ అధికారి గా ఉన్న సమీర్ వాంఖడే ను తొలగిస్తున్నట్టు తెలిసింది. ఇకపై ఈ కేసును సెంట్రల్ యూనిట్ విచారిస్తుందని తెలిసింది. కాగా ఆర్యన్ కేసులో విచారణ అధికారి వాంఖడే పై అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...