మంత్రి హరీష్ రావు యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయానికి బంగారం విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కార్యకర్తల సమావేశంలో బంగారం ప్రకటించే వారి పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పడంతో ఒక్కరోజులోనే 30 కిలోల బంగారాన్ని కార్యకర్తలు విరాళంగా ప్రకటించారు. బంగారం సేకరణకు సిద్దిపేటలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేయనున్నట్లు తెలిపారు. సిద్దిపేట ప్రజల పక్షాన బంగారం లక్ష్మీ నరసింహ స్వామికి ఇద్దామని మంత్రి తెలిపారు.
రామన్న రాజ్యం వస్తేనే అందరి కి సంక్షేమ ఫలాలు.. వైఎస్ షర్మిల…
తెలంగాణలో లో రాజన్న పాలన వస్తేనే అందరి బ్రతుకులు బాగుపడతాయని వైయస్సార్ టి పి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దేవరకొండ నియోజకవర్గం లో పాదయాత్ర చేస్తున్న ఆమె రాష్ట్రంలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీయడమే తన లక్ష్యం అన్నారు. వైఎస్ హయాంలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోలేదని గుర్తు చేశారు. కెసిఆర్ కు బుల్లెట్ ప్రూఫ్ ఇండ్లు పేదలకు మట్టి ఇండ్ల అని ప్రశ్నించారు.
భూముల వివరాల కోసం కలెక్టర్లకు ఆదేశాలు…
తెలంగాణ జిల్లాలలోని భూముల వివరాలను క్యాబినెట్ సబ్కమిటీ పంపించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది జీవో నెంబర్16658,59 కింద వచ్చిన దరఖాస్తులను అసైన్డ్ ల్యాండ్, ప్రభుత్వ భూములు ఎండోమెంట్, భక్తులు భూములు కోర్టు కేసులో ఉన్న భూముల వివరాలను సమర్పించాలని పేర్కొంది. కాగా ఇండ్ల స్థలాల కోసం సబ్ కమిటీని వేసింది.
జనాల పైకి దూసుకొచ్చిన దున్న…
హైదరాబాద్ సదర్ ఉత్సవం అప్ప శృతి జరిగింది. ఖైరతాబాద్ కూడలిలో దున్నపోతుని రెడీ చేస్తుండగా అది ఒక్కసారిగా తాడు తెంచుకుని జనాల పైకి దూసుకెళ్లింది. భయంతో ప్రజలు పరుగులు తీశారు. ఈ సంఘటనలో నలుగురికి గాయాలయ్యాయి .
పలు వాహనాలు ధ్వంసమయ్యాయి ఎట్టకేలకు నిర్వాహకులు దున్నపోతును శాంతింపజేశారు.
కొరడాతో కొట్టించుకున్న సీఎం…
చత్తీస్గడ్ ముఖ్యమంత్రి కొరడాతో కొట్టించుకున్నాడు. దర్గ జిల్లా గ్రామంలో గోవర్ధన పూజ కు హాజరైన ఆయన సొంట సంప్రదాయం లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. కొరడాతో కొట్టించుకుంటే కష్టాలను ఎదుర్కొనే సహనం పెరుగుతుందని స్థానికులు విశ్వసిస్తారు.
కన్నీటిపర్యంతమైన సూర్య…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలకు హాజరు. కాని నటుడు సూర్య ఇవాళ బెంగళూరులోని పునీత్ సమాధిని సందర్శించాడు. పునీత్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు పునీత్ అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం…
బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలోని కుమారిన్ ఏరియా లో అల్పపీడనం ఏర్పడిందని ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ తీరం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొద్దిగా బలహీనపడింది. దీంతో దాదాపు మూడు రోజులుగా తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆంధ్రాలో ఆదివారం వరకు మూడు రోజుల పాటు వర్షాలు కురియనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది
గుత్తా సుమన్ కు మరోసారి రిమాండ్..
మంచిరేవుల పేకాట కేసులో కీలక నిందితుడు గుత్తా సుమన్ చౌదరి కి ఉప్పరపల్లి కోర్టు మరోసారి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో సుమన్ నర్సింగ్ పోలీసులు ఉప్పరపల్లి కోర్టు నుంచి చర్లపల్లి జైలు తరలించారు.
ఇస్రోలో రిక్రూట్మెంట్…
బెంగళూరు ఇస్రో హ్యూమన్ స్పేస్ రీసెర్చ్ ఫ్లైట్ సెంటర్ తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది మొత్తం పోస్టులు 6 ఉండగా హిందీ ఇంగ్లీషు సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ ఉండాలి హిందీ నుంచి ఇంగ్లీష్ ఇంగ్లీష్ నుంచి హిందీ ట్రాన్స్లేట్ చేయడం వచ్చి ఉండాలి.
మరోమారు ఎం సి బి ముందుకు ఆర్యన్…
బాలీవుడ్ స్టార్ ఆర్ ఆర్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ శుక్రవారం ఎం సి బి ముందు హాజరయ్యాడు. మధ్యాహ్నం రెండు లోపు హాజరు కావాల్సి ఉండడంతో కార్యాలయానికి వచ్చారు ముంబైలోని క్రూజ్ నౌకా డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే బెయిల్ సమయంలో కోర్టు 14 విధించింది చేతుల్లో భాగంగా ఇవాళ ఆర్యన్ ఎన్సీపీ కార్యాలయానికి వచ్చాడు.

















