తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ vice admiral బహుదూర్ సింగ్ సీఎం జగన్ ను కలిశారు డిసెంబర్ 4న విశాఖలో జరిగిన వేడుకలకు ఆయనను ఆహ్వానించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ పేరుతో ముంబైలో నావికాదళ ఐ ఎం ఎస్ విశాఖపట్టణం త్వరలో ప్రారంభం కానుందని సీఎం జగన్కు వివరించారు. అనంతరం ఫ్లాగ్ ఆఫీసర్ రాజేంద్ర బహదూర్ సింగ్ ను సీఎం జగన్ సన్మానించారు.
మార్కెట్లోకి అధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు…
పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో చల్లని కబురు వారికి చెప్పింది మారుతి సుజుకి ఇండియా కంపెనీ. డీజిల్ కార్లు మించి మైలేజీ అందించే కొత్త కారు ని మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఎంట్రీ లెవల్ హచ్ బ్యాక్ మోడల్ గా ఉన్నా ఫేస్లిఫ్ట్ వెర్షన్ మార్కెట్లోకి తెచ్చేందుకు మారుతి సిద్ధమైంది. నవంబర్ 10 నుంచి కొత్త సెలెరియో మోడల్ అడ్వాన్స్ బుకింగ్ లు ప్రారంభం కానున్నాయి
బంజారాహిల్స్ లో దారుణం…
బంజారాహిల్స్ లోని ఓ బట్టల దుకాణంలో దారుణం చోటుచేసుకుంది. బట్టల షాపులో యువతి బట్టలు మార్చుకుంటుఉండగా ఇద్దరు యువకులు వీడియో తీశారు. ఇది గమనించిన యువతి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు చేరుకొని ఆ ఇద్దరు యువకులతో పాటు స్టోర్ మేనేజర్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు వారి నుంచి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
ముందే మొదలైన కోడిపందాలు…
తెలంగాణ ఆంధ్ర సరిహద్దు గ్రామా అడవీప్రాంతంలో పెద్ద మొత్తంలో పందెం రాయుళ్లు కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు తెలంగాణ ప్రాంతం వారితో కలిసి ఈ కోడిపందాలకు నాయకత్వం వహిస్తునట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా సాగుతుండటంతో పోలీస్ లు విశ్వసనీయ సమాచారంతో స్థావరాల పై పెద్ద మొత్తంలో దాడి చేశారు. ఇరు ప్రాంతాల నిర్వాహకులు ఇక్కడ నుండి తప్పించుకున్నారు.
కోడిపందాలలో పాల్గొనేదుకు వచ్చిన వారి కోడి పుంజులు మోటార్ సైకిల్స్ పెద్ద మొత్తంలో పట్టుబడ్డాయి. ములకలపల్లి మండలం, మంగలిగట్టు శివారు ఆంధ్ర సరిహద్దులో కొద్దిరోజులుగా కోడి పందాలు నిర్మావహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ములకలపల్లి- పాల్వంచ పోలీస్ లు, స్థావరాలపై దాడి నిర్వహించి 15 కోడిపుంజులు, 46 మోటార్ సైకిళ్ళు, ఆరుగురు పందెంరాయుళ్ల తో పాటు రూ. 14970 నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ నీ ఎన్నికలు…
రాష్ట్రంలో మరోసారి స్థానిక సంస్థల కోటాలో MLC స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అటు, శాసనసభ కోటాలో ఖాళీగా ఉన్న 6 స్థానాలకు ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. మిగితా అసెంబ్లీ కోట జరుగుతున్నయి. అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం ఈ 6 స్థానాలను టిఆర్ఎస్ ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకునే అవకాశం ఉంది.
కంటి ఆసుపత్రి లో దీపావళి ఎఫెక్ట్ …
దీపావళి సందర్భంగా టపాసులు కాల్చిన సందర్భంలో జరిగిన ప్రమాదాలతో పలువురు ఆసుపత్రుల్లో చేరారు. హైదరాబాదులోని సరోజిని దేవి కంటి ఆసుపత్రి వద్ద గాయాలతో పదుల సంఖ్యలో బాధితులు, చిన్నారులు క్యూకట్టారు. స్వల్పంగా గాయపడిన వారికి చికిత్స చేసి ఇంటికి పంపించగా.. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చుకున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
ఇండియా సెమీస్.. ఆఫ్ఘనిస్తాన్ గెలవాలి. సిన్నర్ అశ్విన్…
ఆఫ్ఘనిస్తాన్ జట్టు గెలవాలి అశ్విన్ టీమ్ ఇండియా సెమీస్ చేరాలంటే ..
అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ జట్టును ఓడించాలని సీనియర్ స్పిన్నర్ అశ్విన్ చెప్పాడు. ఆ మ్యాచ్ పై తాము భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలిపాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు భారత్ అభిమానుల పూర్తి మద్దతు ఉంటుందన్నాడు. అఫ్గాన్ టీమ్ బాగా ఆడుతోందని .. న్యూజిలాండ్ తో పోరు ఆసక్తిగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. నాలుగేళ్ల తర్వాత టీ 20 జట్టులోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు.
ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించిన – మోదీ ప్రధాని…
మంత్రి నరేంద్రమోదీ … ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించారు . ఆయనకు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసిన మోదీకి తీర్థప్రసాదాలు అందించారు . హారతి అనంతరం మోదీ .. ఆదిశంకరాచార్య సమాధి స్థలన్ని ప్రారంభించారు. 12 అడుగుల ఎత్తు, 35 టన్నుల బరువు గల ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.
భారీగా రెమ్యునరేషన్ పెంచిన సమంత…
టాలీవుడ్ నటి సమంత భారీగా రెమ్యునరేషన్ పెంచినట్లు సమాచారం. ఆమె నటించిన శాకుంతల షూటింగ్ పూర్తి చేసుకోగా మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. వాటితో పాటు కొత్త సినిమాలు ఓకే చెబుతోంది. తాజాగా సినీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం సమంత ఓ సినిమాకు ఏకంగా రూ.3కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. శాకుంతలం తో పాటు సమంత నటించిన కా తువాకుల రెండు కాదు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
కేదారినాథ్ సందర్శనలో ప్రధాని…
శాసనసభ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ఉదయం చేరుకున్న మోదీకి రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలుత కేదారినాథ్ వెళ్ళిన మోదీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

















