రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఐదో రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర చేపట్టారు. తిక్కిరెడ్డిపాలెం నుంచి ఐదో రోజు పాదయాత్ర ప్రారంభమైంది. ఇవాళ పెదనందిపాడు వరకు యాత్ర సాగనుంది. ప్రత్తిపాడు నియోజకవర్గం లో 5వ రోజు పాదయాత్ర కొనసాగనుంది. నాలుగు రోజులుగా యాభై నాలుగు కిలోమీటర్ల వరకు రైతులు పాదయాత్రలో నడిచారు.
కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభం…
కార్తీక మాసం మొదటి రోజు నదీతీరాలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచి మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు . నదీతీరాల వద్ద పూజలు చేసి దీపాలను నదుల్లో వదులుతారు. శ్రీశైలంలో నేటి నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీక మాస ఉత్సవాలు నిర్వహించబోతున్నారు . గంగాధర మండపం వద్ద భక్తులు కార్తీక దీపారాధనలు చేస్తున్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు.
టీం ఇండియాతో ఫైనల్స్ ఆడాలని ఉంది షోయబ్ అక్తర్ …
టీమిండియాతో ఫైనల్స్ ఆడేందుకు ఎదురుచూస్తున్నట్లు పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు అక్కడ కూడా మరోసారి కోహ్లీ సేనను ఓడించాలని ఉందన్నాడు. అందు కోసం భారత్ ఫైనల్స్ కు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అక్కడ టీమిండియా తమని ఓడించడానికి మరో అవకాశం వస్తుందన్నారు . తాజాగా వీడియోలో మాట్లాడారు.
అర్ధరాత్రి వేళ కాల్పుల మోత…
అర్ధరాత్రి ఇ వేళ అ ఆ గ్రామంలో కాల్పుల మోత మోగింది వివరాల్లోకి వెళితే హర్యానా మనేసర్ జిల్లాలో కాసిం పూర్ గ్రామంలో ఒక కుటుంబం పై దుండగులు కాల్పులు జరిపారు కాల్పుల్లో ఒకరు మృతి చెందారు మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆస్పత్రికి తరలించారు దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది..
కరోనా చికిత్సకు కొత్త మాత్ర…
కరుణ చికిత్సకు తాజాగా టాబ్లెట్ల రూపంలో మరో కొత్త మందు అందుబాటులోకి వచ్చింది మలనుపిరవీర్ పేరుతో తయారైన ఈ ఈ యాంటీ వైరల్ మెదక్ రిడ్జ్ బ్యాక్ బయో సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి ఈ పాత్ర వినియోగానికి బ్రిటన్ దేశం నుంచి ఆమోద ముద్ర వేసింది 4.80 లక్షల కోట్ల మాత్రలను కొనుగోలు చేసేందుకు గత నెలలోనే ఒప్పందం చేసుకుంది ఈ బిల్లుకు ఆమోదం తెలపడంపై అమెరికా ఈ నెలలో నిర్ణయం తీసుకుంది.
స్మితం హితం ఫౌండేషన్ గురించి మీకు తెలుసా…
మనకు తెలిసింది ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శి హోదాలో స్మితా సబర్వాల్ పనిచేస్తున్నారని. కానీ ఆమె స్మితం హితం పేరిట తాను ఏర్పాటుచేసిన ఫౌండేషన్ లో కూడా చురుకుగా పని చేస్తారు. చిన్న పిల్లల కోసం ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేశారు. తక్కువ కాలంలోనే మంచి అధికారిగా పేరు సంపాదించుకున్న స్మితాసబర్వాల్ తన పనితీరు ద్వారా తనదైన మార్క్ తో ముందుకు వెళ్తారు. కరీంనగర్ కలెక్టర్ గారు ఎన్నో సేవలు అందించారు. ఆ తర్వాత మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఆమె పనితీరుతో ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శి పదోన్నతి లభించింది.
భయంతోనే పెట్రోల్ ధరలు తగ్గించింది…
పెట్రోల్ డీజిల్ పై సుఖాన్ని తగ్గించడంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. భయంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రజలపై ప్రేమతో ఈ నిర్ణయం తీసుకోలేదని ఈ దోపిడీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రియాంక గాంధీ కేంద్రంపై నిప్పులు కక్కారు.
సజ్జనార్ దీపావళి.. ఇలా కూడా ట్రేండింగ్…
ఆర్టీసీ ఎండి సజ్జనార్ దీపావళిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు తాజాగా దీపావళి నేపథ్యంలో తన ట్విట్టర్ ఖాతాలో ఆర్టిసి ఎండి చూస్ టి ఎస్ ఆర్ టి సి… అని పోస్టులు పెట్టకు నెటిజన్లు మద్దతుగా వారి దీవెన ఫోటోలు పోస్ట్ చేసి ఇ ఆర్ టి సి అని పెడుతున్నారు.
విద్యుత్ కాంతులలో కేదారినాథ్…
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ విద్యుత్ కాంతులతో దగదగ మెరిసిపోతున్న ఉంది. దీపావళి పండగ సందర్భంగా కేదార్నాథ్ సర్వాంగ సుందరంగా చేశారు. ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ కేదారినాథ్ సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో లో ఎనిమిది వందల కిలోల పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. రంగురంగుల కాంతులను వెదజల్లే లైట్లను ఏర్పాటు చేయడంతో ఆలయం కలర్ఫుల్గా మెరిసిపోతుంది.
జై భీమ్ కు స్టాలిన్ ప్రశంసలు…
స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన జై భీమ్ అందరితో శభాష్ అనిపించుకుంది. తాజాగా ఈ సినిమాను చూసిన తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు. సినిమా చూసిన తర్వాత తన హృదయం బరువెక్కింది, స్టాలిన్ పేర్కొన్నారు. అద్భుతంగా సినిమాను తెరకెక్కించిన దర్శకనిర్మాతలకు నటీనటులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సినిమా తన పై ఎంతో ప్రభావం చూపిందని అన్నారు.

















