36.2 C
Hyderabad
Tuesday, April 21, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 162

కేంద్రం తగ్గించింది – రాష్ట్రం కూడా తగ్గించాలి…

పెట్రోల్ ధరలపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్…
పెట్రోలు డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్ను తగ్గించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఇన్ని రోజులు పెట్రోలు డీజిల్ ధరల పెరుగుదలను అడ్డంపెట్టుకుని టిఆర్ఎస్ విమర్శించింది అన్నారు. కానీ ఆచరణలో పెట్టడానికి బలం ఉండాలని అన్నారు పెట్రోల్ పై 41% పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రం కనీసం పెట్రోల్ ధరలను రూపాయల నుంచి 10 వరకు తగ్గించాలని అన్నారు.

కత్తులతో దాడి-ఇరువురికి తీవ్ర గాయాలు…

జగిత్యాలలో అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. పట్టణంలోని తీన్ కానీ చౌరస్తాలో ముగ్గురు యువకుల పై కొంతమంది కత్తులతో దాడి చేశారు . ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాగా ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది . ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంగ్లాండ్ క్రికెట్ పై ఈ సి బి నిషేధం…

జాత్యహంకార వ్యాఖ్యలు చేసినందుకు గాను క్రికెటర్ గ్యాలరీ బ్యాలెన్స్ పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. ఇదే విషయంలో అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వకుండా యార్క్ షైర్ క్రికెట్ క్లబ్ ను కూడా సస్పెండ్ చేసింది. జాత్య హంకారాన్నీ సహించేది లేదని ఇంగ్లాండ్ బోర్డ్ సిస్టం చేసింది. కాగా అంతర్జాతీయ మ్యాచ్ లతో పాటు దేశవాళి ప్రధాన మ్యాచులు నిర్వహించే అవకాశాన్ని యార్క్ షైర్ క్లబ్ కోల్పోయింది.

చెరుకు రైతుల జీవితాల్లో చేదు…

విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ఎన్ సి సి ఎస్ చక్కెర కర్మాగారం వద్ద నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో సమస్య తీవ్రమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కర్మాగారం నుంచి రైతులకు రావలసిన రూపాయలు 16.38 కోట్లు ఇప్పించేలా చూడాల్సిన పాలనా యంత్రాంగం ఈ సమస్యను శాంతి భద్రతల అంశం గా చూడటం భావ్యం కాదని అన్నారు. రైతులకు వారి జీవితాల్లో దీనికి బదులు చేదు నిండిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫ్యూయెల్ ఇంజిన్లన తయారు చేస్తే- మరింతగా తగ్గనున్న పెట్రోల్ ధరలు…!

కేంద్ర ప్రభుత్వం దీపావళి రోజున వాహనదారులకు తీపికబురు అందించింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించేసింది. దీంతో దేశవ్యాప్తంగా దేశీ ఇంధన ధరలు దిగొచ్చాయి. పెట్రోల్ పై 5రూ, డీజిల్ పై 10రూ మేర తగ్గింది. కొని రాష్ట్రాల్లో ఇంకా ధరలు ఎక్కువగానే తగ్గాయి. ఇంధన ధరలను మరింత తగ్గించడానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. నివేదికల ప్రకారం చూస్తే .. లీటరు పెట్రోల్ 60 కే దొరక వచ్చని, ముడిచమురు దిగుమతులపై ఆధారపడట్టాని తగ్గించుకోవాలని కేంద్రప్రభుత్వం ప్రయసుస్తోంది. దీని కోసం ఇథనాల్ బ్లెండింగు పెంచాలని, దీని ద్వారా దేశంలో ఫ్లెక్స్ ఫ్యూయెల్ తీసుకురావాలని భావిస్తోంది. దీంతో వాహనదారులకు ఊరట కలుగుతుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ డ్రాఫ్ట్ తయారు చేసినట్లు తెలుస్తోంది. కంపెనీలు కూడా ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజిన్లన తయారు చేయాల్సి ఉంటుంది.ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కన్నా ఈ ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజిన్ల తయారీ తక్కువ ఖర్చుతో కూడుకున్నది. వీటిల్లో ఇథనాల్, మిథనాల్, గ్యాసోలిన్ వంటి మిక్సింగ్ చేసిన ఫ్యూయెల్స్ కూడా ఉపయోగించొచ్చు. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఈ అంశానికి సంబంధించి కొత్త బంధనలు తీసుకురనున్నట్లు తెలుస్తుంది.

నరకాసుర పాలన ఇలాగే ఉండేదేమో.. !

ఆంధ్రలో డీజిల్, పెట్రోల్ ధరలు బాదుడు ఆపేది ఎన్నడని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కొంత సామాన్యులపై భారం తగించిదని.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారని ఆయన సూచించారు. వసూల్ రెడ్డి నిద్రలేచేది ఎప్పుడు..? పెట్రోల్, డీజిల్ పై బాదుడు ఆపేది ఎప్పుడు..? అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ని ఉద్దేశించి ఆయన సెటైర్లు వేశారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించడానికి నిర్ణయించిందని ఆయన తెలిపారు. కేంద్రం, ఇతర రాష్ట్రాలన్నీ తగ్గించినా వసూల్ రెడ్డికి మాత్రం పెట్రోల్, డీజిల్ పై పన్నుల భారం తగ్గించి ప్రజలకు మంచి చేయడానికి మనస్సు రావడం లేదున్నారు. ఆస్తిపన్ను పన్ను, కరెంట్ బిల్లు, నిత్యావసరాల,చివరికి చెత్తపైనా పన్నులేసిన మీ బాదుడుకు ధరలు ఆకాశాన్ని అందాయని అన్నారు.దేశమంతా పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గిస్తున్న నేపథ్యంలో జనంపై సీఎం జగన్మోహన్ కరుణ చూపాలని అన్నారు. అంతకుముందు రాష్ట్ర ప్రజలకు నారా లోకేశ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపం వెలిగించుకుందామంటే నూనె ధర మండుతోంది, లైట్లు వేద్దాం అంటే కరెంటు చార్జీలు షాక్ కొడుతున్నాయి. ఆంధ్రలో దీపావళి పండగ పుట ప్రజల పరిస్థి ఇలా ఉందిన్నారు. నరకాసుర పాలన ఇలాగే ఉండేదేమో.. ! అని అన్నారు.

కార్తీక శోభకు ముస్తాబైన యాదాద్రి…

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం. హరిహరులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం నేటి నుండి మొదలవుతుంది . కార్తీక మాసం సందర్భంగా యాదాద్రిలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రిలో దోపోత్సవాలతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతాలు కోసం భక్తులు తరలివస్తారని .. అందుకు తగినట్లుగా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నేటి నుండి నెల రోజులపాటు నిత్యం ఆరు దఫాలుగా సత్యనారాయణ వ్రతాలు జరగనున్నాయి. ప్రస్తుతం రోజూ నాలుగు సార్లు మాత్రమే వ్రతాలు జరుగుతున్న కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మరో రెండుసార్లు అదనంగా మొత్తం ఆరుసార్లు సత్యనారాయణ వ్రతాలు జరుగనున్నాయి. ఉదయం 6.30 గంటల నుంచి ప్రతి రెండు గంటల కోసారి సాయంతం 5.30 వరకు వ్రతాలు కొనసాగుతాయి. కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక కార్యక్రమాలు జరుగును.

సెలబ్రిటీల దీపావళి…

దీపావళి సందర్భంగా సెలబ్రిటీలు సంప్రదాయ దుస్తులతో కనువిందు చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఇద్దరు కుమారులు అభయ్ రామ్ , భార్గవ్ రామ్ దీపావళి జరుపుకున్నారు. సాయి పల్లవి పసుపురంగు చీరలో ఆకట్టుకుంటోంది . రాశి, క్రికెటర్ పుజారా, దినేష్ , కార్తీక్ కుటుంబ సభ్యులతో కలిసి సందడిగా గడిపారు.

దీపావళి గిఫ్ట్ గా ఎలక్ట్రిక్ బైకులు…

దీపావళి సందర్భంగా గుజరాత్ సూరత్ లోని. అలయన్స్ కంపెనీ తన ఉద్యోగస్తులను సర్ ప్రైజ్ చేసింది. ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైక్ లను ఇచ్చింది. భారీగా పెరిగిన పెట్రోల్ ధరల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ డైరెక్టర్ సుభాష్ ద్దవారు తెలిపారు.

బాలయ్య సరసన శృతి హాసన్…

నందమూరి నట సింహం బాలకృష్ణ తదుపరి సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య 105వ సినిమా రాబోతుండగా ఇందులో హీరోయిన్ ను దీపావళి సందర్భంగా ప్రకటించారు. ఈ మూవీలో బాలయ్య పక్కన శృతిహాసన్ మెరవనున్నటు గోపీచంద్ ట్వీట్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో వస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...