34.2 C
Hyderabad
Tuesday, April 21, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 163

వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దీపావళి సందడి…

చరిత్రలో తొలిసారి న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనం పై దీపావళి వెలుగులు అక్కడ పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. ఈ దృశ్యాలను వీక్షించేందుకు భారతీయులతో పాటు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు సమీపంలో ఉన్న నది దగ్గర ప్రజలు నిలబడి ఈ దృశ్యాలను వీక్షించారు.

ఇలా కూడా సారీ చెప్తారేమో…

వింత పోస్టర్లు రాజమండ్రిలో తీవ్ర చర్చకు కారణమయ్యాయి. సారీ మోసం చేయలేదు అని రాసి ఉన్న పోస్టర్లను సిటీ లోని పలు ప్రాంతాల్లో అతికించారు. అలాగే అందులో బాధపడుతూ ఉన్న కూడా ఉంది అయితే రాత్రికి రాత్రే ఈ పోస్టులు వెళ్లడంతో ఎవరు అంటించారు. తెలియడం లేదు ఇస్తూ ప్రియుడే అంటించి ఉండాలని కొందరు ప్రియురాలే ప్రియుడిని బుజ్జగించేందుకు ఈ పని చేసి ఉంటుందని కొందరు స్థానికులు చర్చించుకుంటున్నారు.

హీరో రాజశేఖర్ తండ్రి మృతి…

హీరో రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ 93 మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని వాసు పత్రి లో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు. గోపాల్ చెన్నైలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రిటైర్ అయ్యారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు కాగా రాజశేఖర్ రెండో కుమారుడు వరదరాజన్ అంత్యక్రియలు చెన్నైలో నిర్వహించనున్నారు.

వాట్సాప్ మెసేజ్ డిలీట్ టైం పెరుగుతోంది…

వాట్సాప్ తన వినియోగదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇప్పటివరకు ఉన్న మెసేజ్ డిలీట్ ఫర్ ఎవరీ వన్ టైం లిమిట్ ను పెంచనుంది. దీని ప్రకారం వినియోగదారులు మెసేజ్ పంపిన నెల రోజుల తర్వాత కూడా అవతలి వ్యక్తి చాట్ పేజీ నుంచి మెసేజ్ డిలీట్ చేసే అవకాశం కల్పించనుంది. అయితే ఇది ట్రయల్స్ దశలో ఉండగా త్వరలోనే అందుబాటులోకి రానుంది. కాగా ప్రస్తుతం గంటల లోపు మాత్రమే డిలీట్ ఆప్షన్ ఉంది.

బెంగాల్ మంత్రి కన్నుమూత…

పశ్చిమ బెంగాల్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సభ్రత ముఖర్జీ కన్నుమూశారు. గుండెపోటుతో కాసేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచారు. ఈరోజు సాయంత్రం ఆయనకు కార్డియాక్ అరెస్ట్ కాగా బాత్రూంలో కుప్పకూలారు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయం తెలియగానే సీఎం మమతా బెనర్జీ ఆస్పత్రికి వెళ్లారు 1971లో 25 ఏళ్ల వయసులోనే సభ్రత తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు 1972లో మంత్రి అయ్యారు.

ఎక్సైజ్ శాఖ మంత్రిని – పరామర్శించిన హోంమంత్రి మహమ్మద్ అలీ…

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను గురువారం రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పరామర్శించారు. ఇటీవల శ్రీనివాస్ గౌడ్ మాతృ వియోగం జరిగిన నేపథ్యంలో హోం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వచ్చారు. మంత్రి మాతృమూర్తి శాంతమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫామ్ హౌస్ వద్ద శాంతమ్మ సమాధిపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అంతకుముందు ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి, జడ్చర్ల మూవీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మి రవీందర్ ముదిరాజ్, జిల్లా నేతలు గోపాల్,కురూముర్తి, గోపాల్ యాదవ్, శాంతం అని యాదవ్, శైలు యాదవ్,
విశ్రాంత ఉద్యోగ సంఘాల నేతలు తదితరులు శాంతమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఈ ఫి ఎఫ్ డబ్బుల కోసం లంచం …

ఈ ఫి ఎఫ్ డబ్బుల కోసం లంచం …
– అయినా కానీ పని
– విసిగివేసారిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు
– జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు

ఈ పీ ఎఫ్ డబ్బులు కోసం అధికారులను ఆశ్రయిస్తే లంచం ఇవ్వనిదే పిఎఫ్ ఇచ్చేది లేదని ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడ్ని కొంతకాలంగా ఇబ్బందులు పెట్టడంతో విసిగివేసారి కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అయినా తనకు న్యాయం దక్కకపోవడంతో చివరికి తన గోడును మీడియాకు వెళ్లబోసుకున్నారు. వివరాల్లోకి వెళితే…

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అంబాల ప్రవీణ్ కుమార్ ఇటీవల కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయాడు. దీంతో తన పీఎఫ్ ఖాతా నుండి డబ్బులు డ్రా చేసుకుందామన్నా ఆలోచన కు వచ్చాడు. ప్రిన్సిపల్ చెన్నారెడ్డిని పిఎఫ్ డబ్బుల కోసం కోరగా ఆయన సూచన మేరకు సిద్దిపేట జిల్లా బాల రక్ష భవన్లో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ను కలిసి తన కుటుంబ పరిస్థితి వివరించాడు. అయితే రూ.3000 డబ్బులు ఇస్తేనే పని అవుతుందని, ఇలా చాలా మందికి పిఎఫ్ డబ్బులు ఇప్పిన్చానని, అందురు నేను ఎంత అంటే అంత డబ్బు ఇచ్చేవారని చెప్పాడని తెలిపారు. తన వద్ద అంత లేవనగా కనీసం వెయ్యి రూపాయలైనా ఇవ్వాలని డిమాండ్ చేయడం తో హుస్నాబాద్ మునిసిపల్ ఆఫిస్ సందులోకి వచ్చి ఇచ్చానని పేర్కొన్నారు. అయినా తన పని కాలేదని, దీంతో విసిగి వేసారి పోయినట్లు చెప్పారు. ఇప్పటికైనా అధికారులు విచారించి న్యాయం చేయాలని కోరారు.

దీపావళి జరుపుకున్న అగ్రజా అధ్యక్షుడు…

అమెరికా అధ్యక్షుడు జరుపుకున్నారు వైట్హౌస్లో సతీమణి దిల్ తో కలిసి పూల మధ్య అలంకరించిన దీపాలను వెలిగించారు అమెరికా ప్రపంచ వ్యాప్తంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు విభజన నుంచి ఐక్యత నిరాశ నుంచి ఆశ వస్తుందండి మనకు దీపాల వెలుతురు గుర్తు చేస్తుందన్నారు.

పెట్రోల్ రూ.50కి రాకపోతే బిజెపి ఓడిపోతుంది…

పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీ ఐదు రూపాయలు తగ్గించడం వల్ల ప్రజలకు ఎలాంటి లాభం లేదని, దాన్ని మరింత తగ్గించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. ఇటీవల ఉప ఎన్నికల్లో బిజెపి ఓడిపోవడంతో ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిందని చెప్పారు. అయితే పెట్రోల్ ధర 50 కి దిగిరాకపోతే బిజెపి కచ్చితంగా ఓడిపోతుందని రౌథ్ జోస్యం చెప్పారు.

“హరీష్ రావు గర్వానికి హుజురాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు…

నాకు టైం వస్తుంది రెడీగా ఉండు హరీష్” అంటూ ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం గురువారం హైదరాబాద్ కు పయనమైన ఆయనకు కరీంనగర్, కొత్తపల్లి, సిద్దిపేట జిల్లా బెజ్జంకి, రంగదాంపల్లి, గజ్వేల్ తదితర చోట్ల జన నీరాజనం పలికారు. సిద్దిపేటలో రంగదాంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్థూపానికి పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోసం సిద్దిపేట పిడికిలి ఎత్తితే సంబుర పడ్డదని, ఆ నినాదాన్ని తెలంగాణ ప్రజలందరూ భుజం మీద వేసుకొని రాష్ట్ర సాధనలో కదం కదిపి రాష్ట్రం తెచ్చుకున్నారని అన్నారు.
ఇప్పుడు సిద్దిపేట ప్రజలు హరీష్ రావును గెలిపిస్తే భారీ మెజార్టీ తో గెలిపిస్టే …ట్రౌబుల్ షూటర్ అంటూ ఎక్కడ ఎన్నికలు జరిగిన అక్కడ ఇన్చార్జిగా వేస్తున్నారన్నారు. నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంట, గ్రామాలను దత్తత తీసుకుంట అంటూ మాట్లాడుతూన్నారని ఇది ఎలా సాధ్యం అవుతుందని… తెలివి అతనికే ఉంది అనుకుంటున్నాడా అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలు తాము ఏది చెప్పినా నమ్ముతారని, అనుకుంటున్నాడని ఏ గర్వంతో ఇవన్ని చెప్పాడని అడిగారు.
మంత్రి హరీష్ రావు గర్వాన్ని ప్రజలు తమ తీర్పుతో తిప్పి కొట్టారని అన్నారు.
ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకుని మసలుకోవాలని ఈ గడ్డ నుండి హెచ్చరిస్తున్నాని అన్నారు. ధర్మాన్ని పాత వేయడానికి, ప్రజాస్వామ్యాన్ని చంపడానికి, మానవసంబంధాలను తుంచాడానికి హరీష్ రావు చేసిన ప్రయత్నాలను హుజురాబాద్ ప్రజలు తిప్పికొట్టారన్నారు.

హుజురాబాద్ ఎన్నికల్లో ఎలాగైతే డబ్బులు, మద్యం కుట్రలకు పాల్పడ్డారో ఆలాగే వాటికి బలి అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయని జోస్యం చెప్పారు. ఆయన నియోజకవర్గంలోని ప్రజలు ఆయనకి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. వీరిని అధికారంలోకి తెచ్చింది, అభివృద్ధి చేయడానికి, ప్రజలను చల్లగా చూడడానికి, కానీ దౌర్జన్యం చేయడానికి కాదంటూ ఘాటుగా మాట్లాడారు. దళిత బంధు ను కేవలం హుజురాబాద్ లోనే కాదు, తెలంగాణ రాష్ట్ర మంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ మరో కామెంట్ కూడా చేయడం విశేషం, సిద్దిపేటలో కూడా దళిత గర్జన సభ పెట్టె రోజు వస్తుందన్నారు. ఆ రోజున సభకు తానే నాయకత్వం వహిస్థానని ప్రకటించారు

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...