వైద్యులు నిర్లక్ష్యం చేశారని అందువల్లనే పాప మృతి చెందింది అంటూ మెదక్ ఏరియా ఆసుపత్రి సిబ్బందిపై బాధితులు దాడి చేశారు బాధితుల కథనం ప్రకారం వెల్దుర్తి మండలం పంతుల పల్లి గ్రామానికి చెందిన మాధవి నిన్న రాత్రి రెండు గంటలకు కు డెలివరీ చేసి సమయంలో పాప ఉమ్మనీరు మింగి మరణించింది వైద్యుల నిర్లక్ష్యం వల్లనే పాప మరణించిందని వైద్యుల పై దాడి చేశారు.
మళ్లీ కోవిడ్ ఉద్ధృతిపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన…
యూరప్ లో కరోణ మళ్లీ విజృంభిస్తుండడం తో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరి నాటికి 5 లక్షల మంది మరణించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. యూరప్ లోని 53 దేశాల్లో కోవిడ్ తీవ్రస్థాయికి చేరే ప్రమాదముందని హెచ్చరించింది. మరో వైపు జనవరి 4 లోగా వాణిజ్య సంస్థల్లో పని చేసేవారికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అమెరికా ప్రభుత్వం ఆదేశించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన బాక్స్ జాబితాలో- భారత్…
వ్యాక్సిన్ కి ప్రపంచ స్థాయి గుర్తింపు దేశీయంగా తయారైనా vaccine అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతినిచ్చింది అడ్వైజరీ గ్రూప్ సిఫార్సులను పరిశీలించి డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది ఈ విషయాన్ని బుధవారం ప్రకటించింది దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన బాక్స్ ఇలా జాబితాలో భారత్ కు చెందిన వ్యాక్సిన్ స్థానం సంపాదించింది.
బాలీవుడ్ బాద్షకి బుర్జ్ ఖలీఫా స్క్రీనింగ్….
షారుక్ ఖాన్ ధన 56 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఖాన్ కు భారీగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దుబాయ్ బుర్జ్ ఖలీఫా సాక్షిగా షారుక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దుబాయ్ కి చెందిన మొహమ్మద్ అల్ అlaబర్ అనే షార్క్ అభిమాని ఈ ప్రదర్శనను షారుక్ కి బర్త్ డే గిఫ్ట్ గా అందించారు.
ఎయిర్ గన్ పేలి వ్యక్తి మృతి- ఉలిక్కిపడ్డ ప్రజలు…
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాఖపూర్‌లో ఎయిర్‌గన్ పేలి వ్యక్తి మృతిచెందాడు. బుధవారం రాత్రి జరిగిన ఆకస్మిక ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్ పూర్ లో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రమాదవశాత్తు చేతిలో గన్ పేలడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడిని హైదరాబాద్ లంగర్‌హౌస్‌కు చెందిన ముసాఫ్‌గా గుర్తించారు. ఇతను స్నేహితులతో కలిసి సలాఖపూరూర్‌లోని బంధువుల ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. సంఘటనపై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
పంజాగుట్టలో బాలిక మృతదేహం గుర్తింపు…
హైదరాబాద్ పంజాగుట్టలోని ద్వారకపురి కాలనీ లో ఐదు ఏండ్ల
బాలిక మృతదేహం వెలుగు చూసింది. ఓ దుకాణం ముందు బాలిక మృతదేహం పోలీసులకు సమాచారం రాగా వెంటనే వారు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. బాలిక సాధారణమైన మరణమా హత్య అని దర్యాప్తులో అనేది దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.
కానిస్టేబుల్ ఆత్మహత్య…
మచిలీపట్నంలో ఏఆర్ కానిస్టేబుల్ ప్రశాంతి బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న తన ఇంట్లో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలే బలవన్మరణానికి కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్…
రాష్ట్ర గవర్నర్ తమిలిసై చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం గవర్నర్ కు అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. మరోవైపు ఈ రోజు ఉదయం బీజేపీ నేత లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకున్నారు. దీపావళి పురస్కరించుకొని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.
నటి త్రిష కు అరుదైన గుర్తింపు…
ప్రముఖ హీరోయిన్ త్రిశకు అరుదైన గుర్తింపు లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం జారీ చేసే గోల్డెన్ వీసా లభించింది. ఫలితంగా తొలి వీసా పొందిన నటి గా తమిళ నటి త్రిష గుర్తింపు పొందింది. 2019 నుంచి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు జారీ చేయడం ప్రారంభించింది. ఈ వీసాలు కలిగిన వారు యు ఏ ఈ దీర్ఘకాలం నివాసం ఉండవచ్చు వ్యాపారవేత్తలు, సైన్స్, క్రీడలు, తెలివితేటలు, వంటి ప్రత్యేక నైపుణ్యం కలిగినవారు. ప్రొఫెషనల్స్ ఈ గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గోల్డెన్ విజాలను ఐదేళ్లు లేదంటే పదేళ్ల కాలపరిమితిలో జారీ చేస్తారు. కాలపరిమితి ముగిశాక వాటంతట అవే రెన్యువల్ అవుతాయి. యూఏఈ గోల్డెన్ వీసా పొందిన విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ లో తెలిపింది. యూఏఈ నుంచి అందుకున్న తొలి నటి తానే కావడం ఆనందంగా ఉందన్నారు. గతంలో లో ఫర్ ఖాన్ , షారుక్ ఖాన్, బోనికపూర్, అర్జున్ కపూర్ , జాన్వి మోహన్ , లాల్ దుల్కర్ సింగర్ చిత్ర వంటివారు గతంలో గోల్డెన్ వీసా అందుకున్నవారు అయితే తమిళ చిత్ర పరిశ్రమ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటి మాత్రం త్రిషనే.
తగ్గిన బంగారం ధరలు…
హైదరాబాద్ బంగారం మార్కెట్లో ఇవాళ బంగారం ధర 44,550 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం అం 48 వేల ఆరు వందలు ఉంది. స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలో రూపాయలు 67,610 ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నేడు తగ్గాయి దీపావళి రోజు ధరలు ఆ మరుసటి రోజు కంటే కాస్త ఎక్కువగానే తగ్గాయి మరోవైపు వెండి కిలో రూ 13 వందల వరకు తగ్గింది దీంతో 22 క్యారెట్ బంగారం ధర ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో 44,500 50 గా ఉంది 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూపాయలు 8600 గా ఉంది ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలో రూపాయలు 67 వేల 600 గా ఉంది ముందు రోజులతో పోలిస్తే ఈ ధర రూపాయలు 1300 తగ్గింది తెలంగాణవ్యాప్తంగా నగరాల్లోనూ అమల్లో ఉన్నాయి.

















