ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో చాప కింద నీరులా వ్యాపిస్తోంది బుధవారం కొత్తగా ఆరుగురు వాయుసేన సిబ్బంది సహా 25 మందికి ఈ వైరస్ సోకిన ట్లు తెలిసింది. దీంతో కాన్పూర్ లో వైరస్ బాధితుల సంఖ్య 36 కు చేరింది కొత్తగా నమోదైన కేసులో 14 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు.
పెరిగిన మద్యం అమ్మకాలు…
తెలంగాణలో మద్యం అమ్మకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్లో గరిష్టంగా రూపాయలు 2653 3.07 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇది గత ఏడాది అక్టోబర్ తో పోలిస్తే చాలా ఎక్కువ. అంటే గత ఏడాది అక్టోబర్లో దాదాపు రెండు 2623 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది రూపాయలు 30 కోట్ల మేర అమ్మకాలు పెరిగాయి.
నర్సింగ్ విద్యార్థులకు శుభవార్త…
నర్సింగ్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది దీపావళి సందర్భంగా నర్సింగ్ విద్యార్థులు వెలుగులు నింపే ప్రకటన చేసింది ఆ విద్యార్థుల మూడు గంటలకు పైగా పెంచింది ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. స్టైఫండ్ పెంపుదల వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు ఈ పెంపుదల నర్సింగ్ స్కూల్ నిమ్స్ లో చదువుతున్న జిఎన్ఎమ్, బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు వర్తించనుంది.
ఓకే నెంబర్ తో మూడు ఆర్టీసీ బస్సులు-వ్యవహారంపై ఆరా తీస్తున్న ఆర్టీఏ అధికారులు…
ఓకే నంబర్తో రెండు వాహనాలు సాధారణంగా రిజిస్ట్రేషన్ కావు అంటే ఓకే నెంబర్ తో రెండు వాహనాలు ఉండడం అనేది తప్పే సాధారణంగా నేరస్తులు తప్పుడు ఉద్దేశం ఉన్నవారు లేదా తప్పు చేయాలనుకునే వారు పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ఇలాంటి పనులు సాధారణంగా చేస్తుంటారు ఒకే నంబర్ తో రెండు లేదా మూడు వాహనాలు ఉన్నాయి అంటే అవి సరైన రిజిస్టేషన్ కాదని స్పష్టం ఎక్కువగా ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు ఇలాంటి పనులు చేస్తుంటారు కానీ ఈ సంఘటనలో ఏకంగా ఆర్టీసీ లోనే ఈ వ్యవహారం వెలుగుచూసింది గరుడ ప్లస్ ఎక్స్ప్రెస్ సహా మరో ఏసీ బస్సు కు ఓకే నెంబర్ ఉంది ఈ విషయం ఎలా బయటకు వచ్చింది అంటే ఈ మూడు బస్సుల మీద ఫైన్ లు ఉన్నాయి ఈ బస్సు నంబర్ తో ఈ చలాన వెబ్సైట్లో వెతకగా ఏకంగా మూడు బస్సులు వివిధ చోట్ల ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన నట్లు తెలిసింది వీటికి సంబంధించిన ఫోటోలు కూడా ఆ వెబ్సైట్లో ఉన్నాయి హైదరాబాద్ వన్ డిపోలో టీఎస్ 08 జెడ్ 0208 ఎయిట్ 9280 నెంబర్ తో ఉన్న బస్సు ఎక్స్ప్రెస్ సర్వీస్ గా నడుస్తోంది హైదరాబాద్ 3 డిపో లో గరుడ ప్లస్ సర్వీస్ కూడా ఇదే నెంబర్ పై తిరుగుతోంది అంతే కాక మరో స్కానియా కంపెనీ కి చెందిన మరో ఏసీ బస్సు కూడా ఇది నెంబర్ పై ఉంది. ఒకే నెంబర్ పై ఉన్న ఈ మూడు బస్సులకు హైదరాబాద్ పరిధిలో 2 ట్రాఫిక్ చాలన్ సైబరాబాద్ పరిధిలో మరో రెండు చాలా ఉన్నాయి. రాచకొండ, ఆదిలాబాద్, సిద్దిపేట, కరీంనగర్ పరిధిలో ఒక్కో చాలాను చొప్పున చొప్పున ఉన్నాయి. మొత్తం ఒకే నెంబర్ పై ఉన్న ఈ మూడు బస్సులపై 8 చాలాసార్లు ఉన్నాయి. అయితే బస్సులు మాత్రం మూడు ఉండడం గమనించిన ఆర్టీవో అధికారులు దీనిపై ఆరా తీస్తున్నారు.
ప్రజలతోనే ఉండి సమస్యల సాధనకు కష్టపడతాం – హుజరాబాద్ లో ఓటమి పై మంత్రి స్పందన.
హుజూరాబాద్ లో టిఆర్ఎస్ ఓటమి పాలైనప్పటికీ ప్రజలతోనే ఉండి ప్రజల పక్షాన ప్రజల సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆయన సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ హుజరాబాద్ లో ఓటమిపై స్పందించారు. ప్రజల పక్షాన టిఆర్ఎస్ నిలిచి ఉంటుందని అన్నారు. టిఆర్ఎస్ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీకి ముందస్తు దీపావళి -హుజురాబాద్ లో బీజేపీ ఘన విజయం ..
బీజేపీకి ముందస్తు దీపావళి
-హుజురాబాద్ లో బీజేపీ ఘన విజయం
– 23865 వేల ఓట్ల ఆధిక్యత
– 7వ సారి ఈటెల గెలుపు
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. అధికార పార్టీ టిఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన ఈటెల రాజేందర్ కు, అలాగే అధికార పార్టీ కి మధ్య హోరాహోరీ సాగినప్పటికీ ప్రజలు మాత్రం ఒకవైపే మొగ్గు చూపారు. బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ వైపే ప్రజలు నిలిచారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన ఎన్నికల లో చివరకు గెలుపు బీజేపీకి దక్కింది. ముందు నుంచి అందరూ ఊహించినట్టుగానే ఓటర్లు బీజేపీ వైపు నిలిచారు. నువ్వా నేనా అన్నట్లు ఉత్కంఠగా సాగిన ఎన్నికల ను ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించాయి. తన మంత్రి పదవికి శాసన సభ్యత్వానికి గుడ్ బై చెప్పిన రాజేందర్ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొంది పరువు కాపాడుకోవాలని ఈటెల రాజేందర్ ఒకవైపు, మరోవైపు గెలిచి తీరాలని అధికారంలో ఉన్నందున ఈ ఎన్నికల ఫలితాలు టిఆర్ఎస్ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని భావించడం తో ఎన్నికల పై అన్ని పార్టీల వారు ఎంతో కాన్సన్ట్రేషన్ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఆసక్తి ఏర్పడింది. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో తర్వాత జరిగే ఎన్నికల పై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని భావించిన టిఆర్ఎస్ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేసి నప్పటికీ విఫలమైంది.
పోస్టల్ బ్యాలెట్ తో పాటు
మరో రౌండ్ మినహా ప్రతి రౌండ్లోనూ బీజేపీదే ఆధిక్యం.
మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల అధికారులు పూర్తి చేసినప్పటికీ రెండు రౌండ్లు మినహా అన్ని రంగాల్లోనూ బిజెపి తన ఆధిక్యతను ప్రదర్శించింది. ఒక్క పోస్టల్ బ్యాలెట్ తో పాటు మరో రౌండ్ లో టిఆర్ఎస్ మెజార్టీ చూపినప్పటికీ మిగిలిన 20 రౌండ్లోనూ బిజెపి కి హుజురాబాద్ ప్రజలు ఆధిక్యతను ఇచ్చారు. మొదట వెలువడిన పోస్టల్ బ్యాలెట్ ఫలితాలతో ఒకింత అధికార పార్టీ వైపే ప్రజలు ఉంటారేమో అని అనిపించినప్పటికీ వాస్తవానికి ప్రజలు టీఆర్ఎస్ వైపు నిలిచారు.
ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అధికార టిఆర్ఎస్ పార్టీ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టమవుతుంది. అలాగే ఆ పార్టీ నాయకుడు ఇచ్చే హామీలు అమలు చేయడనే అభిప్రాయం, ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇవ్వకపోవడం తదితర కారణాలు చెప్పుకోవచ్చు అది విశ్లేషకులు భావిస్తున్నారు.
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. అన్ని రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ విధించారు. ముందస్తుగానే పోలీసులు ఎలాంటి విజయోత్సవ సంబరాలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ ఈటెల హిస్టరీ…
2004లో కమలాపూర్ నియోజకవర్గం నుండి బరిలో ఉన్న ఈటెలరాజేందర్ కు తన సమీప ప్రత్యర్థి ముదశాని దామోదర్ రెడ్డి పై 19,619 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 2008లో ఇదే నియోజకవర్గం నుండి
ఈటెల 22,284 ఓట్ల మెజారిటీ తో ఇదే ప్రత్యర్థి ముద్దసాని దామోదర్ పై గెలుపొందారు. అనంతరం వచ్చిన ఎన్నికల్లో 2009లో హుజూరాబాద్ నియోజకవర్గం నుండి రాజేందర్ సమీప ప్రత్యర్థి కృష్ణమోహన్ వకులాభరణంపై 15,035 మెజారిటీ తో గెలుపొందారు. తదనంతరం జరిగిన 2010 ఎన్నికల్లో
హుజూరాబాద్ నియోజకవర్గం నుండి ఈటెల రాజేందర్ (93026) కు ప్రత్యర్థి
ముద్దసాని పై 13799 మెజారిటీ వచ్చింది. కాగా 2014 లో జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ (95315) కు కేతిరి సుదర్శన్ రెడ్డి(38278) పై మెజారిటీ 57,037 లభించింది. అనంతరం 2018 ఎన్నికల్లో హుజూరాబాద్ నుండి
ఈటల రాజేందర్( 104840) కు
కౌశిక్ రెడ్డి (61121) పై 43719
మెజారిటీ దక్కింది.
2004:
కమలాపూర్ నియోజకవర్గం:
ఈటెలరాజేందర్ : 68393.
ముద్దసాని దామోదర్ రెడ్డి: 48774.
మెజారిటీ: 19619.
2008:
కమలాపూర్ నియోజకవర్గం:
ఈటెలరాజేందర్ : 54092
ముద్దసాని దామోదర్ రెడ్డి: 31808.
మెజారిటీ: 22,284.
2009 :
హుజూరాబాద్ నియోజకవర్గం :
ఈటెలరాజేందర్ : 56752
కృష్ణమోహన్ వకులాభరణం: 41717.
మెజారిటీ: 15,035.
2010:
హుజూరాబాద్ నియోజకవర్గం :
ఈటెల రాజేందర్: 93026
ముద్దసాని: 13799
మెజారిటీ: 79227.
2014:
హుజూరాబాద్:
ఈటెల రాజేందర్: 95315
కేతిరి సుదర్శన్ రెడ్డి : 38278
మెజారిటీ: 57,037.
2018
హుజూరాబాద్:
ఈటల రాజేందర్ : 104840
కౌశిక్ రెడ్డి: 61121.
మెజారిటీ: 43719.
బద్వేల్ లో వైయస్సార్ పార్టీ భారీ ఆధిక్యతతో గెలుపు..
బద్వేల్ లో అధికార పార్టీ వైఎస్ఆర్సిపి అభ్యర్థి డా. సుధ భారీ ఓట్ల ఆధిక్యతతో గెలిపొందారు. అధికార వైసీపీ పార్టీ అభ్యర్థి డా. సుధకు 1,12,211 ఓట్లు పొలవగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సురేష్ కు 21,678 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి కమలమ్మకు 6,235 ఓట్లు వచ్చాయి. చివరి రౌండ్ ముగిసే సరికి వైసీపీ అభ్యర్థి డా.సుధ 90,533 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
సిద్దిపేట కలెక్టర్ పై హైకోర్ట్ సీరియస్ -వివరణ ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ కు ఆదేశం…
వరి సాగు విషయంలో సిద్ధిపేట కలెక్టర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ఘాటుగా స్పందించి కలెక్టర్ తీరును తప్పుపట్టింది . వచ్చే సంవత్సరం యాసంగికి వరి సాగు వద్దని , ఏ డీలర్ కూడా వరి విత్తనాలను అమ్మవద్దంటూ హెచ్చరించడాన్నీ సవాల్ చేస్తూ అదే జిల్లాకు చెందిన రైతు బత్తుల నారాయణ చేసిన పిటిషన్ పై హైకోర్టులో మంగళవారం విచారణ చేపట్టింది. విత్తనాలు అమ్మితే దుకాణాలు సీజ్ అంటూ కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు , హైకోర్టు , సుప్రీంకోర్టు చెప్పినా దుకాణాలను తెరవడానికి అనుమతి ఇవ్వబోనని చేసిన కామెంట్లు పిటిషర్ కోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషనర్ వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సిద్దిపేట కలెక్టర్ తీరు , ప్రభుత్వ విధానంపై ఆగ్రహం వ్యక్తం చేసింది . మధ్యాహ్నం విచారణకు అడ్వొకేట్ జనరల్ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.















