ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఏపీఎన్జీవోల మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డిని నియమించింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు విడుదల చేశారు. చంద్రశేఖర్ రెడ్డి దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యకు ఉపాధ్యక్షుడిగా పని చేశారు . ఉద్యోగుల విషయంలో ప్రభుత్వానికి సలహాలు అందించడానికి ప్రభుత్వం సలహాదారుగా నియమించింది . చంద్రశేఖర్ రెడ్డిది కడప జిల్లా .. ఆ తర్వాత ఉద్యోగ రీత్యా హైదరాబాద్ .. ఆ తర్వాత అమరావతికి వచ్చారు .రెండేళ్ల పదవీ కాలంతో ప్రభుత్వ సలహాదారుగా ( ఉద్యోగుల సంక్షేమం ఉద్యోగులు , ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం జగన్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది .ఉద్యోగులతో సత్సంబంధాలు ఉన్న చంద్రశేఖర్ రెడ్డిని ఉద్యోగులు , ప్రభుత్వం మధ్య సమన్వయ కర్తగా ప్రభుత్వం సలహాదారు పదవిలో నియమించాలని సీఎం జగన్ నిర్ణయించారని తెలిసింది. . ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా గతంలో వెల్లడించారు .
హజ్ యాత్ర కు దరఖాస్తు చేసుకోండి…
హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇ అంజాద్బాష ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల 1 నుంచి 2022 జనవరి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు తెలిపారు 65 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చని పాస్పోర్టు కాలపరిమితి 2022 డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు అయ్యేలా ఉండాలని చెప్పారు పూర్తి సమాచారం భారత్ హజ్ కమిటీ వెబ్సైట్ హజ్ కమిటీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ లో లో పొందవచ్చు అని సూచించారు.
పొట్టి శ్రీరాములు పై త్వరలో సినిమా…
తెలుగు జాతి కి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర పై సినిమా రానుంది. కళ్యాణి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కూచిపూడి రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు. సాలూరి వాసు దేవరావు మ్యూజిక్ ఇస్తుండగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెలువడనున్నాయి.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు…
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగిన 29 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దాద్రా నగర్ హవేలీ , మండి , ఖాండ్వా లోకసభ స్థానాలకు తాజాగా ఉప ఎన్నికలు జరుగగా అస్సాంలో 5, బెంగాల్లో నాలుగు, మధ్యప్రదేశ్లో 3, మేఘాలయాలో 3, హిమాచల్ ప్రదేశ్ లో మూడు, బీహార్లో రెండు , కర్ణాటకలో 2 , రాజస్థాన్లో 2 అసెంబ్లీ స్థానాల్లో బై ఎలక్షన్ జరిగింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, మిజోరం లలో ఒక్క స్థానానికి ఉప ఎన్నిక జరిగింది
హుజరాబాద్ లో పోస్టల్ బ్యాలెట్ లో టిఆర్ఎస్ దే పై చెయ్యి ..
హుజురాబాద్ బై ఎలక్షన్ పోస్టల్ బ్యాలెట్ల ఫలితం వెల్లడైంది. మొత్తం 753 ఓట్లకు గాను మెజారిటీ ఓట్లు టిఆర్ఎస్ కు వచ్చాయి. టిఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ ఆదిక్యత కనబరిచారు. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ముగియడంతో ఈవీఎంల ఓట్ల లెక్కింపు పనిలో సిబ్బంది ఉన్నారు.
హుజురాబాద్లో కులగణన..
హుజురాబాద్ ఎన్నికలలో రాజకీయ పార్టీలు కుల సమీకరణాలను ప్రధానంగా భావించాయి. ఈ క్రమంలో నియోజకవర్గంలోని మెజార్టీ కుల గణన పరిశీలిస్తే ఎస్సీలు 46 000, మున్నూరు కాపు 29,000 , పద్మశాలీలు 26,000, గౌడ్స్ 24000 , ముదిరాజులు 23000 , యాదవులు 22000, ఇతర కులాల వారు 35,000 ఉన్నారు.
వీరమల్లు షూటింగ్ మళ్లీ ప్రారంభం…
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. క్రిష్ డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్లో నిలిచిపోయింది. ఈరోజు నుంచి హైదరాబాదులో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కాగా దాదాపు 50 శాతం షూటింగ్ ఇంతకు ముందే పూర్తయింది 2022 ఏప్రిల్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
నేడు మీకోసం ఎమ్మెల్యే పద్మ కార్యక్రమం..
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం మే లక్ష్యంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మీ కోసం ఈ నెల 2న క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 నుంచి రెండు గంటల వరకు మీకోసం ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 93 8386 6666 ఫోన్ నెంబర్ ద్వారా కూడా తమ సమస్యలు చెప్పవచ్చు. అధికారులు మెదక్ పట్టణ కౌన్సిల్ సభ్యులు సర్పంచులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని కార్యాలయ వర్గాలు తెలిపాయి.
డిగ్రీ పీజీ ప్రవేశాలకు గడువు పెంపు…
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గడువు పొడిగించింది. ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు ఈ విషయాన్నీ తెలిపారు. బీఏ , బీకాం , బీఎస్సీ, ఎంబీఏ, బి ఎల్ ఐ సీ,ఎం,ఎల్, ఐ సీ , పీజీ డిప్లమా సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడానికి నవంబర్ 11 వరకు లేట్ ఫీ 200 చెల్లించి ప్రవేశం పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 7382 929570 నెంబర్ లో సంప్రదించాలని కోరారు.
















