24.7 C
Hyderabad
Sunday, April 19, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 167

బద్వేలులో వైసీపీ ఆధిక్యం..

బద్వేలు ఉపఎన్నిక పోస్టల్ బ్యాలెట్ లో వైసిపి ఆధిక్యత కనబరిచింది 253 ఓట్లకు గాను మెజారిటీ ఓట్లు వైసీపీ అభ్యర్థి దాసరి సుధా కు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు కూర్చోవడంతో ఈవీఎం ఓట్ల లెక్కింపు పనిలో సిబ్బంది ఉన్నారు

పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది..

హుజురాబాద్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఎన్నికల సిబ్బంది లెక్కిస్తున్నారు. 753 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించే పనిలో సిబ్బంది ఉన్నారు.

చిరుకు జోడిగా తమన్నా …

మెగాస్టార్ చిరంజీవి తో డైరెక్టర్ మెహర్ రమేష్ బోలా శంకర్ మూవీ తీస్తున్నాడు.
వేదాళం తమిళ సినిమా కి వర్జినల్ రీమేక్ మూవీలో లో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుండగా హీరోయిన్ గా తమన్నా ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలో దీనిపై ప్రకటన వెలువడనుంది. సైరా లో ఓ ప్రత్యేక పాత్రలో నటించిన తమన్నా ఇప్పుడు చిరు సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

విరాట్ కోహ్లీ కూతురుకి రేప్ వార్కింగ్ …

క్రికెట్ ఫాన్స్ గా చెప్పుకునే కొందర తీరు షాక్ కి గురి చేస్తుంది. తాజాగా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుష్క చిన్నారి కి అత్యాచార బెదిరింపులు రావడం సంచలనం కలిగిస్తుంది. బౌలర్ మహమ్మద్ షమీ కి కోహ్లీ మద్దతుగా నిలబడడం, ట్రోల్ చేసిన వారిపై విరుచుకుపడడంతో విరాట్ కూతురిని టార్గెట్ చేశారు కొందరు. సపోర్ట్ చేస్తే చిన్నారిపై అత్యాచారం తప్పదంటు పోస్టులు పెట్టారు. దీనిపై సెలబ్రిటీలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ క్రీడా అవార్డులు ప్రధానం…

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ జాతీయ క్రీడా పురస్కారాలను ప్రధానం చేశారు.
ఐదుగురికి ఖేల్ రత్న సహా 74 అవార్డులను బహుకరించారు. హాకీ క్యాప్టెన్ రాణి రాంపాల్, రెజ్లర్, వినేష్, తంగా వీలు వేలు మరియప్పన్ ఏ రత్న అవార్డు పొందారు. టోక్యో ఒలింపిక్స్ కాంస్యా పాత్ర విజేత లవ్ లీ నా, క్రికెటర్ ఇషాంత్ శర్మ,, స్ప్రింటర్ ద్యుతి చంద్, ఆర్చర్ అతను దాస్, షట్లర్ సాత్విక్, చిరాజ్ అర్జున్ అవార్డులు అందుకున్నారు.

అతి త్వరలో హైదరాబాద్ లో ఆక్సిజన్ పార్క్ …

హైదరాబాద్ లో ఆక్సిజన్ పార్క్ గాజుల రామారం లో ఏర్పాటు కానుంది. ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. వంద 42 ఎకరాలలో 16 కోట్లతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ పార్కును అభివృద్ధి చేసుస్తుంది. మరో మూడు వారాల్లో గా ఈ ఆక్సిజన్ పార్క్ ను ప్రారంభించనున్నారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు పార్క్ లో అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశారు. వన భోజనాలకు కూడా ఈ పార్కు అనువుగా ఉంటుంది.

ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) గ్లింప్స్‌ వీడియో రిలీజ్‌…..

దిగ్గజ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌.ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) ప్రమోషన్స్‌ షురూ అయ్యాయి. ఇందులో భాగంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ సినీ ప్రేమికులందరికీ సోమవారం ఉదయం ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. 45సెక్లన పాటు కొనసాగిన ఈ వీడియో రిలీజ్‌ అయిన కాసేపటికే ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పటివరకూ వచ్చిన సర్‌ప్రైజ్‌లకు భిన్నంగా రామ్‌చరణ్‌-తారక్‌ కలిసి ఉన్న సన్నివేశాలతో ఈ వీడియో రూపొందించారు.

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. ఈ ప్రతిష్టాత్మక చిత్రం 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది.

ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నీట్ రిజల్స్ రిలీజ్…

నీట్ 2021 ఫలితాలు వెల్లడయ్యాయి.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. సుప్రీంకోర్టు గురువారం ఫలితాల వెల్లడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం రాత్రి నీట్‌ ఫలితాలు విడుదల చేసింది. ఫలితాలను http://neet.nta.nic.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‎లోని విజయవాడకు చెందిన రుషీల్‌ నీట్‌లో ఐదో ర్యాంకు సాధించాడు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన శరణ్య 60వ ర్యాంకుతో సత్తా చాటారు.

మెడికల్ డెంటల్ ఆయుష్ విభాగాలలో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 12న నిర్వహించిన దేశవ్యాప్త పరీక్షల ఫలితాలను వెల్లడించారు. సుమారు 16 లక్షల మంది నీట్ రాశారు.

ఏసీబీ చిక్కిన అవినీతి తిమింగలాలు…

సంగారెడ్డి కలెక్టరేట్ లో సర్వే అండ్ ల్యాండ్స్ శాఖ కార్యాలయంలో సోమవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ అధికారులు అధికారులు సోదాలు నిర్వహించారు. 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు.
తనిఖీలు చిక్కిన వారిలో సర్వే రికార్డ్ అధికారులు అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్, జూనియర్ అసిస్టెంట్ ఆసిఫ్ ఉన్నారు.

పునీత్ కళ్ళతో నలుగురికి చూపు…

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజకుమార్ మరనిస్తూ కూడా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు. ఆయన దానం చేసిన కళ్లు తో నలుగురికి కంటిచూపు దక్కింది. సాధారణంగా ఇలా దానం చేసిన కళ్లు ఇతరులకు ట్రాన్స్ లాంటి చేస్తారు. ఒక వ్యక్తి కళ్ళతో మహా అయితే ఇద్దరికీ చూపు దక్కుతుంది. అయితే కళ్ళలోని కారనియలను వేరు చేసి నలుగురికి శస్త్రచికిత్స చేశారు వైద్యులు. దీంతో మొత్తం నలుగురికి చూపు దక్కింది.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...