తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారంగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఆహార సంస్థ గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు . ఈ మేరకు ఈ నెల 4 ,5 తేదీల్లో రోమ్ లో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు రాష్ట్రానికి ఆహ్వానం అందినట్లు తెలిపారు . ఏ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ గ్లోబల్ అంశంపై యునైటెడ్ నేషన్స్ ఆహ్వానంలో పేర్కొన్నట్లు తెలిపారు.
ఆంధ్రాలో వైసిపి గుర్తింపు రద్దు చేయాలి…
కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ నేతలు కలిసి వైసిపి పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై చేస్తున్న దాడులపై ఈసీకి ఫిర్యాదు చేశారు. గంజాయి సహా రాష్ట్రంలోని సమస్యలను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషను టిడిపి నేతలు కనక మేడల కిష్టప్ప కోరారు.
14 నుంచి మధుయాష్కి పాదయాత్ర…
తెలంగాణ రాష్ట్రంలో మరో నేత పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నాయకులు మధుయాష్కిగౌడ్ ఈనెల 14 నుండి 21 వరకు తెలంగాణలో ప్రజా చైతన్య యాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. జాతీయ రాష్ట్ర సమస్యలపై ప్రజలను చైతన్య పరచడానికి మొత్తం రెండు వేల మూడు వందల కిలోమీటర్ల యాత్ర చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 9న కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని మధుయాష్కి పేర్కొన్నారు .
కోవ్యాక్సిన్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్..
దేశంలో తయారైన కు వ్యాక్సిన్ టికాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. రెడ్ డోసులు తీసుకున్నవారు తమ దేశంలోకి పర్మిషన్ ఇస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా గుర్తించి అంతర్జాతీయ ప్రయాణికులు, విద్యార్థులు, నైపుణ్యం ఉన్న సిబ్బంది తిరిగి ఆస్ట్రేలియా వచ్చేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అక్కడి ప్రభుత్వం తెలిపింది.
హుజురాబాద్ బైపోల్ పోరులో విజయం ఎవరిదో….?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉప ఎన్నిక కు రేపే కౌంటింగ్… హుజురాబాద్ కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల అధికారులు… ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ బైపోల్ కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నవంబర్ 2న ఉదయం 8 గంటలకు కరీంనగర్ SRR డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ మొదలు కానుంది. మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించనున్నారు. మొత్తం 753 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. కోవిడ్ నిబంధనల మేరకు రెండు హాల్స్ లో కౌంటింగ్ జరగనుంది… ఒక్క హాళ్లో 7 టేబుళ్ల చొప్పున ప్రతి రౌండ్ కు14 టేబుల్స్ పై 14 ఈవీఎలను లెక్కిస్తారు. మొత్తం 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది.. ఇది ఇలా ఉండగా ఈ ఎన్నికలు దేశంలోనే అత్యంత కాస్ట్లీ ఎన్నికల గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో పారిన డబ్బుల వరద ఒకవైపు అధికార పార్టీకి ప్రజలు పట్టం కడతారా లేక వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇస్తారా అనేది తేలనుంది. ఏదేమైనా నా ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఒక భారీ మార్పుకు అవకాశం కల్పించే విధంగా గా ఉన్నాయి. అని అని చెప్పక తప్పదు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 121 కరోన కేసులు…
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 121 కరోన కేసులు వెలుగుచూశాయి, దీంతో కరోనా బాధితుల సంఖ్య 6,71,463 చేరింది. ఒకరు చనిపోగా మరణాల సంఖ్య 3956 చేరింది. 183 మంది కరోణ వైరస్ బారిన నుండి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4009 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 25 వేల ఇరవై ఒకటి కరోన టెస్ట్స్ చేశారు.
ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో స్వల్ప భూకంపం…
తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. బెజ్జూర్ సంగు పల్లి సులుగుపల్లి గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది, దానితో జనం భయాందోళనకు గురై రోడ్ల మీదికి పరుగులు పెట్టారు.
సంగారెడ్డి లో చిరుత….
కల్హేర్ మండలం నాగదర్ శివారులో చిరుతపులి మరోసారి కలకలం సృష్టించింది. నిన్న రాత్రి గ్రామ సమీపానికి రెండు కిలోమీటర్ల దూరంలో లేగా దూడను చంపి తిన్నది. పంట పొలాలు చేతికి రావడంతో కుప్పల దగ్గర రైతులు రాత్రి పూటా కూడా ఉండాల్సి వస్తుంది. దీంతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు, అధికారులు రక్షించాలని కోరుతున్నారు.
ఇక గాల్లో తేలిపోవడమే… బైకులు ఎగరావచ్చు….!
బైకులు ఎగరావచ్చు వాచు….! అవునండి మీరు వింటున్నది నిజమే. రానున్న రోజుల్లో బైకులు ఎగురుతాయి అంటే ఎగిరే బైకులు గాలిలో తేలే బైకులు రానున్నాయి. వినడానికి కొత్తగా ఉన్నా ఇది నిజమే స్కూటర్లు బైకులు అయ్యాయి, పెట్రోలు ధరల మోతతో బైక్లు ఎలక్ట్రిక్ బైక్ లు అయ్యాయి, ఇక త్వరలో ఎగిరే బైకులు రానున్నాయి. అవును ఎగిరే బైకులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ట్రాఫిక్ సమస్యలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లాంటి ఇ సమస్యలు ఇక ఉండవు. జపాన్ సంస్థ ఏఎల్‌ఐ టెక్నాలజీస్ రూపొందించిన ఎగిరే బైక్ పేరు ‘ట్సురిస్మో’. నాలుగు చిన్న ప్రొపెల్లర్లు (ఫ్యాన్‌లా తిరిగే మోటార్లు), మరో రెండు పెద్ద ప్రొపెల్లర్లతో ఇది గాల్లో చక్కర్లు కొడుతుంది. రైడర్ ను ఆకాశంలోకి తీసుకెళ్లే ఈ బైక్ 300 కిలోలు ఉంటుంది గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలిలో 40 నిమిషాల పాటు ప్రయాణం చేస్తుంది. ఇక ఇండియన్ కరెన్సీలో ఈ బైక్ ధర 5 కోట్ల 10 లక్షలు.
ఘాట్ రోడ్డు లో ప్రవేశం నిలిపివేత…
విజయవాడ ఇంద్రకీలాద్రి పై రేపటి నుంచి మూడు రోజులపాటు ఘాట్రోడ్డు ప్రవేశం నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఘాట్ రోడ్డుపై రాళ్లు జారిపడే ప్రాంతాల్లో పనులు చేపట్టిన నేపథ్యంలో కొండపైకి వచ్చే వాహనాలను నుంచి అనుమతిస్తారు. ఇంద్రకీలాద్రిపై నవంబర్ 5 నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీక మాసం వేడుకలు నిర్వహించనున్నారు, 6 గంటల వరకు భక్తుల దర్శనానికి అనుమతిస్తారు.

















