41.2 C
Hyderabad
Friday, May 3, 2024
హోమ్జాతీయఓటరూ భద్రం..!

ఓటరూ భద్రం..!

ఓటరూ భద్రం..!

* చూస్తున్నావా నీ నేత బాగోతం..

* తెలుసు కదా.. అతగాడి గతం..

* ఎంచి నిర్ణయించుకో..నీ భవితవ్యం..!

ముంచేటోడు మునగడు..

వ్యాపారంలోనైనా..

వ్యవహారంలో అయినా..

రాజకీయంలోనైనా…!

ఎంతో మంది..

ఎన్నోసార్లు 

రుజువు చేసిన నిజం..

అయినా నమ్మడం 

మానవనైజం..

అలా నమ్మినోన్ని

ముంచుతూ ఉండడమే

మోసగాళ్ళ ఇజం..

ఇది ముమ్మాటికీ నిజం..

అందుకే రాజకీయాల్లో

గెలుస్తూ ఉంది రౌడీయిజం..!

ఇంతకాలం గెలిపించినోడు

నిజాయితీగా ఉంటే..

నీకు నచ్చదే..

నీ పని చేసి పెట్టలేదని..

పోలీస్ స్టేషన్లో

సిఫార్సు చెయ్యలేదని..

నీ అక్రమాలకు వత్తాసు పలకలేదని అలిగి..

ఓసారి అటు చూద్దామని..

అవతలోడు ఊడబొడుస్తాడని..

ఆడూ మనలాంటి అక్రమార్కుడే కదాని

నమ్మి గెలిపిస్తావు..

గెలిచాక..

సీన్ రివర్సు..

నీ నేత దృష్టిలో 

నువ్వో బేవార్సు..

నీకెందుకు చేస్తాడు సిఫార్సు

గుడినీ..అందులో లింగాన్ని..

నీ వ్యాసంగాన్ని 

మొత్తం మింగేసే

నీ నేత విశ్వరూపం..

తాను మునక్కుండా

నిన్ను ముంచేస్తున్నా

తెలియడం లేదా

అతగాడి నిజరూపం..!

వస్తున్నాయి మళ్లీ ఎన్నికలు

ఈసారైనా ఆలోచించు..

నీ అభ్యర్థి 

అసలు రూపం

గ్రహించు..

ఆపై నిగ్రహించు..

మళ్లీ తప్పుడు హామీలు..

మందు సీసాలు..

రూపాయి నోట్లు

పట్టుకు వస్తే ఆగ్రహించు..!

నిజాయితీగా ఓటు వెయ్యి..

నువ్వు గెలిపించినోడు 

పని చెయ్యకపోతే నిలదియ్యి..

లేదూ..కాదూ..

మళ్లీ అదే మొహాన్ని..

అదే మోసగాన్ని ఎన్నుకుంటే

నీ బ్రతుకు ముందు నుయ్యి

వెనక గొయ్యి..

ప్రజాస్వామ్యం అప్పుడు

మీద పాత్ర లేక

మండే పొయ్యి..

అవినీతే దానిని 

మండించే నెయ్యి..!

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్