42.2 C
Hyderabad
Friday, May 3, 2024
హోమ్తెలంగాణకాంగ్రెస్ ప్రభుత్వం మమ్ములను పట్టించుకోవాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం మమ్ములను పట్టించుకోవాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం మమ్ములను పట్టించుకోవాలి.

* జిల్లాల పునర్విభజనతో నష్టం

* సింగరేణి ఉద్యోగాలకు అర్హత కోల్పోయిన నిరుద్యోగులు.

* స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్  చొరవ తీసుకోవాలి.

హుస్నాబాద్ మార్చ్ 9, యదార్థవాది ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జిల్లాల పునర్విభజన వలన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 4 మండలాలు నిరుద్యోగులకు అనర్హతన చోటు చేసుకున్నాయని నిరుద్యోగ యువకులు ఎం నరేష్ జై తిరుపతి ఎం రమేష్ ఆకృతి హరీష్ అరవింద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వారు ఈ నెల1న విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ లో 95 శాతం ఉద్యోగాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాను లోకల్ గా గుర్తించి మిగతా ఐదు శాతం దేశంలోని అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పించడంతో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయంతో హుస్నాబాద్ నియోజకవర్గ పరధిలోని హుస్నాబాద్ కోహెడ బెజ్జంకి అక్కన్నపేట మండలాలను జిల్లాల విభజన తర్వాత కరీంనగర్ నుండి సిద్దిపేట జిల్లాకు మార్చడంతో నాన్ లోకల్ గా పరిగణించబడుతు ఉన్నాయి. నాన్ లోకల్ గా ప్రకటించడంతో నిరుద్యోగులు చాలా నష్టపోవాల్సి వస్తుంది.. ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్ లో 139 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్ లో 18 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లో 10 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనింగ్ హైడ్రో జియో లాజిస్టులో 2 పోస్టులు ఇంకా, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ 10 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎఫ్ అండ్ ఎ 22 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనింగ్ పర్సోనేల్ 22 పోస్టులు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ 30 పోస్టులు, సబ్ ఓవర్సీస్ ట్రైనీసివిల్ 16 పోస్టులు, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ 3 పోస్టులు న్నాయని విడుదల చేశారు. ఈ విషయమై మా నాలుగు మండలలో పై ఉద్యోగాలకు అర్హత కలిగిన దాదాపు 200 మందికి అన్యాయం జరగకుండా ఉమ్మడి జిల్లాలో భాగంగా పరిగణించి సింగరేణి తో పాటు అన్ని ప్రభుత్వ రంగాలలో ఉద్యోగం అవకాశాలు కలిగేలా వెసులుబాటు కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి వినతి పత్రం అందించడం జరిగిందని, మంత్రి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాకు అవకాశం కల్పించాలని నిరుద్యోగులు పక్షాన నిరుద్యోగులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్