41.2 C
Hyderabad
Friday, May 3, 2024
హోమ్తెలంగాణఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి

ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి

ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి

హుస్నాబాద్ మార్చ్ 10 యధార్థవాది ప్రతినిధి:

భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు బాలికల విద్యాభివృద్ధికి కృషి చేసిన సంఘసంస్కర్త భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో దేశంలో అనేక పాఠశాలలను నెలకొల్పిన మహిళా మూర్తి   3 జనవరి 1831 లో జన్మించి 10 మార్చి 1897 సంవత్సరంలో పరమపదించారని గుర్తు చేసుకుంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ పాఠశాలలో వజ్రోత్సవాల సందర్భంగా 1986-87 ఎస్ఎస్సి  పూర్వ విద్యార్థులు మిత్రమండలి 87 గా ఏర్పడి ఆవిష్కరించిన సావిత్రిబాయి పూలే పాలరాతి విగ్రహానికి ఆదివారం 127 వర్ధంతి సందర్భంగా మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ ఐలేని అనితారెడ్డి మిత్రమండలి 87 పూర్వ విద్యార్థులు  కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి, కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె చేసిన సేవలు ఆదర్శనీయమని బాలికల పట్ల ఎంతో శ్రద్ధ తీసుకొని వారికి అనేక పాఠశాలలు నిర్మించిన గొప్ప సాంఘిక సంస్కర్త అని  కులతత్వం అస్పృశ్యత పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని విద్యాబుద్ధులతో బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్ర మండలి 87 అధ్యక్షులు బూట్ల రాజమల్లయ్య ప్రధాన కార్యదర్శి గండి శ్రీనివాస్ కోశాధికారి పెరిమాల శ్రీనివాస్ గౌడ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి చిత్తారి శ్రీనివాస్ కార్యదర్శులు కానుగుల మోహన్ గుండుజు రాజేంద్రప్రసాద్ బి మహేందర్ పాఠశాల ఉపాధ్యాయులు వెంకటరమణారెడ్డి విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్