36.2 C
Hyderabad
Friday, May 3, 2024
హోమ్తెలంగాణదుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు.

దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు.

దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు.

* కాంగ్రెస్ పార్టీలో చేరిన దుబ్బాక బిఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి, పిఎసిఎస్ వైస్ చైర్మన్.

దుబ్బాక మార్చ్ 11 యదార్థవాది ప్రతినిధి:

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో బి.ఎస్.పి ఎమ్మెల్యే అభ్యర్థి సల్కం మల్లేష్ యాదవ్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ దుబ్బాక కాంగ్రెస్ పార్టీ బాధ్యులు  చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారితో పాటు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు భూంపల్లి భీమ్ రావు, రామక్కపేట మాజీ సర్పంచ్ రాచకాట్ల మైసరాజు, మిద్దె భూపాల్, పొన్నాల యాదగిరి పటేల్, వివిధ మండలాల గ్రామాలకు చెందిన  బిఆర్ఎస్, బిజెపి పార్టీ ల నుండికార్యకర్తలు మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన మల్లేష్ యాదవ్, కాల్వ నరేష్ శుభాకాంక్షలు తెలిపారు. దుబ్బాకను గత పది సంవత్సరాల క్రితం దివంగత నేత ముత్యంరెడ్డి వేసిన శంకుస్థాపనలే కనబడుతున్నాయే తప్ప దుబ్బాక నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు త్వరలోనే దుబ్బాక నియోజకవర్గం లో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తానన్నారు   ప్రతిఒక్క కార్యకర్త సైనికుల్లాగా పని చేయాలని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిపించలని కాంగ్రెస్ పార్టీకి  అండగా ఉండి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం కాల్వ నరేష్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలను నాయకులను  పట్టించుకునే నాధుడు లేడని గెలిచిన నాయకుడు కోట్ల  రూపాయలు ఖర్చుపెట్టి కార్పొరేట్ ఎమ్మెల్యేను గెలిపిస్తే డల్లాస్, అమెరికా దేశ విదేశాలు తిరగడం తప్ప దుబ్బాక ప్రాంతం ప్రజలకు చేసేదేమిలేదని పార్టీలో పనిచేసిన వారికి ఉద్యమం సమయంలో కష్టపడ్డ వారికి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక పట్టణ అభివృద్ధికి ఏ కోసనా దృష్టి పెట్టడం లేదని  ఎమ్మెల్యే మాకు అవసరం లేదంటూ పార్టీని విడం జరిగిందని, కాంగ్రెస్ అమలు చేస్తున్నా అరు గ్యారెంటీలతో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఇందుకు రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షులు కొంగర రవీందర్,పట్టణ అధ్యక్షుడు యేసురెడ్డు, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి మంద శ్రీనివాస్,మున్సిపల్ పట్టణ యూత్ అధ్యక్షుడు కరాటే మాస్టారు బూరని శ్రీకాంత్,నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ఆకుల భరత్,మట్ట కిషన్ రెడ్డి,నియోజకవర్గం స్థాయి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్