36.2 C
Hyderabad
Friday, May 3, 2024
హోమ్తెలంగాణఎన్నికల బాండ్ల వివరాలను తక్షణమే వెల్లడించాలి.

ఎన్నికల బాండ్ల వివరాలను తక్షణమే వెల్లడించాలి.

ఎన్నికల బాండ్ల వివరాలను తక్షణమే వెల్లడించాలి.

దుబ్బాక మార్చ్ 11 యదార్థవాది ప్రతినిధి:

ఎన్నికల బాండ్ల వివరాలను తక్షణమే వెల్లడించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం సిపిఎం పార్టీ  జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్ మాట్లాడుతూ దేశంలో ఎన్నికల బాండ్ల విధానాన్ని బిజెపి మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకు వచ్చిందని ఎన్నికల బాండ్లు మోడీ బిజెపి యొక్క అతిపెద్ద అవినీతి బాగోతం అని విమర్శించారు.ఎన్నికల బాండ్లను సిపిఎం పార్టీ మొదటి నుండి వ్యతిరేకిస్తుందని గుర్తు చేశారు. ఎన్నికల బాండ్లను రహస్యంగా పార్టీలకు చెల్లిస్తారని అందులో ఏ పార్టీకి ఎంత చెల్లించారు అనే వాస్తవాలను కానీ చెల్లించిన వారి పేర్లను గాని బహిర్గతం చేయకుండా రహస్యంగా ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల బాండ్ల విషయంపై కేసు వేయగా సుప్రీంకోర్టు తీర్పు ఎన్నికల బాండ్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిస్తూ మార్చి 6 తారీకు వరకు ఎన్నికల బాండ్లను బహిర్గతం చేస్తూ 13వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మెన్ సుప్రీంకోర్టు ఆదేశాల ధిక్కరిస్తూ ఎన్నికల బాండ్లను బహిర్గతం చేయకుండా ఎన్నికలు పూర్తయ్యే వరకు రహస్యంగా ఉంచేందుకు నిర్ణయించడం సిగ్గుచేటు అన్నారు.కోర్టు ధిక్కరణ కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మెన్ పై కేసు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  బ్యాంక్ అనేది బీజేపీ పార్టీకి సంబంధించి కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ కు సంబంధించి గాని వాల్ల స్వంత  బ్యాంకు  కాదని పూర్తిగా పబ్లిక్ బ్యాంకు అనే కనీస విగ్యతను కూడా మర్చిపోతున్నారని విమర్శించారు. కావున ఎన్నికల బాండ్లలో చెల్లించిన మొత్తాలను వెంటనే బహిర్గతం చేసి సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని డిమాండ్ చేశారు. లేని యెడల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ పై కోర్టుదిక్కరన కింద కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బ్యాంకుల పైన బిజెపి పెత్తనం మానుకొవాలని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే విదంగా పని చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సోమవారం జరుగుతున్న నిరసనతో నైనా బ్యాంక్ చైర్మన్ కాని, బిజెపి కాని వాస్తవాలను బహిర్గతం చేయాలని లేని యెడల రాబోవు పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు బిజెపికి తగిన గుణపాఠం చెప్పేందుకు సంసిద్ధం కావాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు లక్ష్మి నరసయ్య, సాజిద్, రాజు, మహేష్, రవి, మల్లేశం, శివకుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్