36.2 C
Hyderabad
Friday, May 3, 2024
హోమ్తెలంగాణకరాటేల్లో విజేతగా నిలిచిన గురుకుల బాలికలు

కరాటేల్లో విజేతగా నిలిచిన గురుకుల బాలికలు

కరాటేల్లో విజేతగా నిలిచిన గురుకుల బాలికలు

* ప్రధానోపాధ్యాయుని ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్న విద్యార్థినీలు

దుబ్బాక మార్చి 11 యదార్థవాది ప్రతినిధి:

రెండవ జాతీయస్థాయి ఓపెన్ కరాటే కుంగ్ పూ ఛాంపియన్షిప్ కరాటే  పోటీల్లో  సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ రామక్కపేట సాంఘిక సంక్షేమ గురుకుల  బాలికల పాఠశాల విద్యార్థులు పథకాలు సాధించారని యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు అండ్ స్టైల్ చీఫ్ మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపారు. సన్ షైన్  షోతోకన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం 10 మెదక్ జిల్లా మనోహరాబాద్ లోని శ్రీ శుభం ఫంక్షన్ హాల్లో జాతీయస్థాయి కరాటే కుంగ్ పూ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ కరాటే పోటీలకు  తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, చెన్నై తదితర రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా డిసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ నియోజకవర్గం ఇన్చార్జి తుంకుంట నర్సారెడ్డి చేతుల మీదుగా  బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆత్మరక్షణ విద్య కరాటే నేర్చుకోవడం వల్ల మానసికంగా శరీరకంగా  దృఢంగా ఉంటారని ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను దృష్టిలో పెట్టుకుని, ప్రతి మహిళ ఆత్మరక్షణ విద్యా కరాటేను నేర్చుకొని తమను తాము కాపాడుకునే ఒక ఆయుధంలా కావాలని అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ, మండల పరిధిలోని రామక్కపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 34 మంది విద్యార్థులు 5,గోల్డ్ మెడల్స్, 17,సిల్వర్  మెడల్స్, 12బ్రౌంజ్ మెడల్స్ సాధించారు. గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్,  బ్రౌంజ్ మెడల్స్ సాధించిన విద్యార్థులను అలానే మాస్టర్ బురాని  శ్రీకాంత్ ని  అభినందించారు. పథకాలు సాధించిన విద్యార్థులను డిఇఓ శ్రీనివాస్ రెడ్డి, జి ఈ సి ఓ ముక్తేశ్వరి మాస్టర్ బురాని శ్రీకాంత్, నగేష్ అశోక్, సాయికుమార్, మల్లేష్ సురేందర్,  దుబ్బాక పట్టణ రామక్కపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్. ఉషా కిరణ్, పిడి పద్మ, పిడి మమత, కీర్తి రవి, వరలక్ష్మి, లత, సరిత, సాగరిక, నందిత, మంజుల పాఠశాల సిబ్బంది  అభినందించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్