40.2 C
Hyderabad
Friday, May 3, 2024
హోమ్తెలంగాణసింగరేణి ఉద్యోగాలకు ఉమ్మడి నాలుగు జిల్లాలు: మంత్రి పొన్నం

సింగరేణి ఉద్యోగాలకు ఉమ్మడి నాలుగు జిల్లాలు: మంత్రి పొన్నం

సింగరేణి ఉద్యోగాలకు ఉమ్మడి నాలుగు జిల్లాలు: మంత్రి పొన్నం

* ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి సిద్దిపేట జిల్లాల్లో కలిసిన 4 మండలాల నిరుద్యోగులకు న్యాయం..

హుస్నాబాద్ మార్చ్ 11 యదార్థవాది ప్రతినిధి: 

ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పరిధిలో అదిలాబాద్ కరీంనగర్, వరంగల్,  ఖమ్మం నాలుగు ఉమ్మడి జిల్లాలు సింగరేణి స్థానికత ను కలిగి ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జిల్లాల పునర్విభజన లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్ అక్కన్నపేట్ కొహెడ బెజ్జంకి లు నాలుగు మండలాలు సిద్దిపేట జిల్లాలో కలపడం వల్ల హైదరాబాద్ జోన్ లోకి రావడంతో సింగరేణి ఉద్యోగాలకు స్థానికత కోల్పోవడం జరిగిందనీ దీంతో ఈ మండలాలకు సంబంధించిన పలువురు నిరుద్యోగులు నిన్న మంత్రి దృష్టికి తీసుకురావడంతో పాత కరీంనగర్ మండలాలను సిద్దిపేటలో కలపడం వల్ల సింగరేణి ఉద్యోగాలకు అర్హత కోల్పోతున్న నిరుద్యోగుల సమస్యను డిప్యూటీ సిఎం ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క  దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే బట్టి సింగరేణి సిఎండి తో మాట్లాడారు. జిల్లాల పునర్విభజన సమయంలో సింగరేణి ఉద్యోగాల కోసం స్థానికత కోల్పోయిన మండలాల పై చర్చించారు ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలని సిఎండి ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. దీంతో సింగరేణి పరిధిలో ఉన్న పాత ఉమ్మడి 4 జిల్లాలు అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం సింగరేణి పరిధిలోకి వస్తాయని ఆయ జిల్లాలో ఉన్న నిరుద్యోగులు సింగరేణి స్థానికత వస్తుందని బట్టి పొన్నం  తెలిపారు. దీంతో కరీంనగర్ నుండి సిద్దిపేట జిల్లాలో కలిసిన నాలుగు మండలాలు అందులో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన 3 మండలాలైన హుస్నాబాద్, అక్కన్నపేట్, కొహెడ మండలాలకు న్యాయం జరిగిందని మంత్రి పొన్నం తెలిపారు. ఇక నుండి సింగరేణి కాలరీస్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఉమ్మడి నాలుగు జిల్లాల నిరుద్యోగులకు అర్హత ఉంటుందని వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ చూపిన డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క కు మంత్రి పొన్నం ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్