40.2 C
Hyderabad
Friday, May 3, 2024
హోమ్తెలంగాణఅవని నుండి అంతరిక్షం వైపు ప్రయాణం చేస్తున్నారు.

అవని నుండి అంతరిక్షం వైపు ప్రయాణం చేస్తున్నారు.

అవని నుండి అంతరిక్షం వైపు ప్రయాణం చేస్తున్నారు.

* మహిళా మూర్తులు దేశాభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తారన్నారు.

మెదక్ మార్చ్ 11,  యదార్థవాది ప్రతినిధి:

మెదక్ జిల్లా కేంద్రం స్థానిక ఆటోనగర్ లోని చంద్ర భవన్ కాలనీ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని స్థానిక చంద్ర భవన్ కాలనీలో సోమవారం  మహిళా మూర్తులకు చంద్రబవన్ కాలనీ అసోసియేషన్ తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చంద్ర భవన్ కాలనీ అధ్యక్షులు ఎల్.దేవుల మాట్లాడుతూ మహిళలు అవని నుండి అంతరిక్షం వైపు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్న రోజులు ఇవి. నేటి ఆధునిక యుగంలో అన్ని రంగాలలో మహిళలదే పై చేయి ఉండటం గర్వకారణం. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి, సమాజం పటిష్టంగా ఉండడానికి, దేశం పరిష్టంగా ఉండడానికి మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనది కొనియాడారు. మన దేశం ఆడ మగ తేడా లేకుండా అన్ని రంగాలలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించినందుకు గాను, మహిళా మూర్తులు దేశాభివృద్ధిలో తమ వంతు కృషి అందిస్తున్నందుకు మహిళమూర్తులందరి కూడా ధన్యవాదాలు తెలిపారు. మహిళలు వంటగదిలకే పరిమితం కాకుండా విద్యాబోధనలో, వైద్య సేవలో, సమాజ సేవలో, విద్యారంగంలో పురుషుల కంటే ముందు స్థానంలో ఉంటూ గొప్ప పేరు తెచ్చుకుంటునందుకు నేను చాలా గర్వపడుతున్నానని అన్నారు. భారత దేశ మహిళలందరూ  భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడు తూ భారత దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని, విద్య అన్నిటికీ మూలం కాబట్టి అమ్మాయిల అక్షరాస్యత శాతాన్ని పెంచాలని, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు కాబట్టి దేశంలో ఎవ్వరు కూడా అమ్మాయిలు నిరక్షరాస్యులు  ఉండొద్దని రాజకీయ రంగంలో 33 శాతం రిజర్వేషన్లు ఉపయోగించుకొని, రాజకీయ రంగంలో కూడా నేను ఉండాలని దేశం గర్వపడేలా దేశ అభివృద్ధి చేయాలని కోరుకుంటూ భారతదేశం మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు అశోక్ కుమార్, శ్రీనివాస్, నరేందర్, వేణుమాధవ్, శ్రీధర్, నాగరాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్