41.2 C
Hyderabad
Friday, May 3, 2024
హోమ్తెలంగాణతొలి తెలుగు కవయిత్రి మొల్ల  జయంతిని అధికారికంగా నిర్వహించాలి.

తొలి తెలుగు కవయిత్రి మొల్ల  జయంతిని అధికారికంగా నిర్వహించాలి.

తొలి తెలుగు కవయిత్రి మొల్ల  జయంతిని అధికారికంగా నిర్వహించాలి.

* తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి  రోజు శాలివాహన కుమ్మర ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలి.

సిద్దిపేట మార్చ్ 13, యధార్థవాధి ప్రతినిధి:

సిద్దిపేట జిల్లా పట్టణం నర్సాపురం చౌరస్తా లో ఆవరణంలో గల  కవయిత్రి మొల్లమాంబ జయంతి సందర్భంగా మల్ల మామ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఉత్సవ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద్భంగా రాదరి నాగరాజు  మాట్లాడుతూ అన్ని ప్రభుత్వాలు ఎన్నికల వరకు మాత్రమే శాలివాన కుమ్మరులను వాడుకుంటున్నారని, శాలివాన కుమ్మరులకు గుర్తింపు లభించడం లేదని ఈ ప్రభుత్వంలోనైనా తొలి తెలుగు కవి కవయిత్రి మోల్లమాంబ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో జీవో నెంబర్ 99 విడుదల చేసి కవయిత్రి మొల్ల జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మొల్ల జయంతిని అధికారికంగా నిర్వహించి కుమ్మరుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడాలని కోరారు. దరిపల్లి నగేష్  మాట్లాడుతూ కవయిత్రి  మొల్ల  మహిళలలో అభ్యుదయ భావాలు కల్గించిన  మాత్రుమూర్తి అని  స్ర్తీకి విద్య అవసరం లేదు, అక్షరాస్యత వైపు అడుగులు వేయాల్సిన పనిలేదని మహిళలను పక్కనపెట్టిన ఆ రోజుల్లో తన కలంతో అందరికీ సమాధానం చెప్పి రామాయణాన్ని తెలుగులో రచించిన తొలి తెలుగు కవయిత్రి తొలిసారిగా తెలుగులో రచించిన మొల్లమాంబ జయంతి రోజున తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్ గా ప్రకటించలని అన్నారు. ఆంజనేయులు మాట్లాడుతూ   ప్రేమించే ప్రతి ఒక్కరికి స్పంధించే హృదయం ఉంటే చాలు సాహిత్యం లో స్ర్తీలు కూడా తక్కువ కాదని నిరూపించింది మొల్లమాంబ. బడుగు, బలహీన వర్గాల నుండి ఉద్భయించిన తొలి తెలుగు కవయిత్రి అని తెలిపారు.ప్రముఖ న్యాయవాది వారుకోలు రాజలింగం మాట్లాడుతూ గాయత్రి మొల్ల 24 వేల శ్లోకాలతో, 7 ఖండాలతో ఉన్న రామాయణాన్ని 871 శ్లోకాలతో, 8 ఖండాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో సంక్షిప్తంగా, సరళ భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో రామయాణాన్ని రచించి తెలుగు తొలి కవయిత్రి గుర్తు చేశారు. కుమ్మర బందువులార మన కుమ్మర ఆడపడుచు, తొలి తెలుగు కవయిత్రిగా తెలుగు భాషలోకి రామాయణన్ని కేవలం ఐదు రోజుల్లోనే అందరికి అర్దమయ్యే విధంగా సరళ భషలో  అనువదించి చరిత్ర పుటలలో నిలిచిపోయిన మన ఆడపడుచు ఆతుకూరి  మొల్లమాంబ

ఇది మనకెంతో గర్వకారణం అని నాటి కాలంలోనె మహోన్నత అభ్యుదయ భవాలుకలిగిన స్త్రీ మూర్తి, మా కుమ్మర్ల ఆడపడుచు,అని గర్వంగా చెప్పుకుందాం అని తెలిపారు.ఇంతటి మహోన్నతమైన కవయిత్రి ఉండడం మన తెలుగు ప్రజలందరికీ ఎంతో గర్వకారణమని కలయిత్రి మోల్ల జయంతిని ప్రభుత్వం అధికారం గా నిర్వహించి శాలివాహన  ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించే వరకు తెలంగాణ శాలివాహన కుమ్మరులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శనిగరం మల్లయ్య, లక్ష్మణ్, ఎల్లం, రాములు, తిరుపతి, రవి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్