42.2 C
Hyderabad
Friday, May 3, 2024
హోమ్తెలంగాణప్రజల దృష్టి మరల్చేందుకే పౌరసత్వ సవరణ చట్టం అకస్మాత్తుగా తెచ్చింది.

ప్రజల దృష్టి మరల్చేందుకే పౌరసత్వ సవరణ చట్టం అకస్మాత్తుగా తెచ్చింది.

ప్రజల దృష్టి మరల్చేందుకే పౌరసత్వ సవరణ చట్టం అకస్మాత్తుగా తెచ్చింది.

* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.

హైదరాబాద్ మార్చ్ 11 యదార్థవాది ప్రతినిధి: 

సుప్రీం కోర్టు తీర్పు నుండి  ప్రజల దృష్టి మరల్చేందుకే పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను అమలు చేసేందుకు మోడీ ప్రభుత్వం అకస్మాత్తుగా నోటిఫికేషన్ జారీ చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. భారత ఎన్నికల కమిషనర్ రాజీనామా, ఎలక్టోరల్ బాండ్ చెంప పెట్టు లాంటి సుప్రీం కోర్టు తీర్పును ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆగ మేఘాలపై సిఎఎ తెచ్చిందని, దాని ద్వారా ప్రజలను దైనందిన సమస్యల నుండి పక్కదారి పట్టించి మత ఆధారంగా భారత లౌకిక సమాజాన్ని విభజించి వచ్చే లోక్ ఎన్నికల్లో లబ్ది పొందాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోందని, సిఎఎకు వ్యతిరేకంగా గతంలోనే దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయని, మైనారిటీలను దేశ ప్రధాన స్రవంతి నుండి వేరు చేసి, ద్వితీయ శ్రేణులుగా మార్చే ప్రమాదకర ఎత్తుగడ ఇందులో ఇమిడి ఉందని, తక్షణమే సిఎఎను ఉపసంహరిచుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే భారత ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా, ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం బైటపడితే భారతీయ జనతా పార్టీ బండారం బైటపడుతుందనే భయంతోనే  సిఎఎను అకస్మాత్తుగా తెరైకి తెచ్చిందని ఆయన పత్రిక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్